సుబ్బలక్ష్మి... జర మొబైల్ వదులమ్మా! - మీగడ.వీరభద్రస్వామి

subbalakshmi please leave mobile

సుబ్బలక్ష్మి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, అమ్మాయి మొదటనుండీ మొండి మనిషి, అల్లరి ఎక్కువ చదువు తక్కువ, పనిదొంగ, ఇంట్లో పనిచెబితే బడికి వెళ్ళితీరాలని అనేది, బడిలో పరీక్షలు ఉంటే ఒంట్లో నలతగా ఉంది ఇంట్లోనే ఉండిపోతాను అంటుండేది, ఉషారు నాస్తి బద్దకం జాస్తి, టీవీ ముందు కూర్చోమంటే గంటలు కాదు రోజులు తరబడి కూర్చోగలదు, సినిమాలూ షికార్లు అంటే ఎక్కడలేని ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఇంట్లో అంట్లు తోమమన్నా... బడి హోంవర్క్ చేయమన్నా చేతులు నొప్పిపెడుతున్నాయని తెగ యాగీ చేస్తూ పని ఎగ్గొట్టే బాపతు. మొబైల్ వినియోగం రాకముందు, ల్యాండ్ ఫోన్ పట్టుకొని గంటలు మాట్లాడే సుబ్బలక్ష్మి మొబైల్ వచ్చాక సెలవు రోజంతా మొబైల్ లొనే మునిగి తేలుతుంది.

ఇంత లేజీ ఫెలో టెన్త్ ఎలా పాస్ అయిందో అన్న అనుమానాలు అందరికీ వచ్చాయి, టెన్త్ పరీక్షలు ముందు ఇంట్లో పెద్ద డీల్ జరిగింది, టెన్త్ పాసైతే "రెడ్మీ" మొబైల్ కొని కానుకగా ఇస్తానని నాన్న హామీ ఇచ్చాడు, "టాబ్" కొని ఇస్తామని తాతయ్య, ఏకంగా "లేప్టాప్" కొని పెడతానని అమ్మమ్మ హామీ ఇచ్చారు.అమ్మైతే 'ఇంట్లో పని చేయనవసరం' నువ్వు టెన్త్ పాసైతే అదే మాకు పదివేలు అని సుబ్బలక్ష్మి ని బ్రతిమిలాడింది. డీల్ ఓకే అయ్యింది, అయితే టెన్త్ పాస్ అయిన తరువాత మీరు ఏమీ కొనరని తెలుసు, పరీక్షల ముందే మన డీల్ ప్రకారం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొని నా రూంలో పడియండి అమ్మతోడు టెన్త్ పరీక్షలు అయిపోయి నేను టెన్త్ పాస్ అయిపోయానని తెలిసినంత వరకూ వాటిని ముట్టుకొను అని సుబ్బలక్ష్మి పట్టుబట్టింది. ఏడుతరాల తరువాత అప్పలబత్తుల ఇంట్లో ఆడపిల్ల ఆమె ఆ మాత్రం ముద్దు మురిపాలు గారాభం తప్పదులే అని మూతులు కోరుక్కునే వారు చుట్టం బంధువులు, పిల్లలకు అంతగారాభం పనికిరాదు, దానివల్ల వాళ్ల భవిష్యత్తే నాశనం అయిపోతుందని సుబ్బలక్ష్మి తలిదండ్రుల మిత్రులు మాత్రం చెబుతుండేవారు.పిల్లలకు అందునా ఆడపిల్లకు అంత గారాభం తప్పు అని అనిపించినా... ఈ రోజుల్లో పిల్లలు చాలా సెన్సిటివ్ గా వుంటున్నారు మందలిస్తే మందుత్రాగి చేస్తామని బెదిరిస్తున్నారు అని అనుకుంటూ రాజీపడిపోయారు సుబ్బలక్ష్మి ఇంటివారు. ఒకరోజు ఆ ఊర్లోకి సన్నాసి అప్పలకొండ అనే సాధువు వచ్చాడు. చూడటానికి పరమ సన్నాసిలాగే వున్నాడు అతన్ని కొన్నాళ్ళు ఊర్లో ఉంచి ప్రవచనాలను చెప్పించుకుంటే... ఆడవాళ్లు టీవీలకు అతుక్కుపోరు, మగవాళ్ళు మొబైల్స్ కి అంటుకుపోరు, పిల్లలు వీడియో గేమ్స్ కి ఎడిక్ట్అయిపోరు అనుకొని ఊరు పెద్ద సాధువుకి పెద్ద పందిరేసి రాత్రి పురాణం చెప్పమన్నాడు. సాధువు సంబరాల్లో మునిగితేలి, "ఊరులో ఉన్న చిన్నా పెద్దా నా ప్రవచనాలను వినడానికి రావాలి అందరూ మొబైల్ ఫోన్స్ తేవాలి" అన్న ప్రచారం చేయించాడు. హైటెక్ సాధువులా వున్నాడు ఒక్క నిముషంలో మొబైల్ ను ఎక్కువగా వాడకం వల్ల నష్టాలను స్పష్టం చేస్తాడనుకొని, పురాణ సభ నిర్వాహకులు ఊర్లో ఉన్న మొబైల్ ఫోన్స్, టాబ్స్, లాప్టాప్స్, చివరాకరు కంప్యూటర్స్ ని కూడా సభకు తెప్పించారు, అక్కడకీ సాధువు అప్పలకొండ సంతృప్తి పడలేదు , శ్రోతలను గుంపులు గుంపులుగా విడిపోయు మద్యలో టీవీలు , మొబైల్స్, టాబ్స్ వగైరా పెట్టుకో మన్నాడు. అందరూ ఆశ్చర్య పోతుండగా... ఏ లింక్ ఓపెన్ చేస్తే రామాయణం వస్తుందో, ఏ యాప్ క్లిక్ చేస్తే చోటా భీమ్ కనిపిస్తుందో, వంటలూ వార్పులూ చూపే పెంట చానల్ రికార్డెడ్ ప్రోగ్రాం కావాలంటే గూగుల్లో ఎలా టైప్ చెయ్యాలో గుక్క తిప్పకుండా చెబుతున్నాడు సాధువు అప్పల కొండ.ఆధ్యాత్మికచింతన గురుంచి చెబుతాడు అనుకుంటే... ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ తో ఆడుకోడం, వాటిని విరివిగా వాడుకోవడం గురుంచి మరిన్ని మెలుకవులు చెబుతున్నాడు, ఇతను ఎవడురా బాబూ అనుకోని సభ నిర్వాహకులు తలలు పట్టుకున్నారు. సుబ్బలక్ష్మి పండగచేసుకుంది నేరుగా అప్పలకొండ వద్దకు వెళ్లి ఈమె కొన్ని అదనపు మెలుకవలు చెప్పింది.సాధువు అప్పలకొండ సుబ్బలక్ష్మి కుటుంబీకులను పిలిపించి "మీకు అభ్యంతరం లేకపోతే ఈ అమ్మాయిని నా కూతురులా దత్తత తీసుకుంటాను, దేశవిదేశాల్లో సాంకేతిక విప్లవం తెచ్చి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగించి వింత వింతలు వేద వేదాంతాలు, పురాణాలు, వినోదకార్యక్రమాలు చూడటం అబాలగోపాలానికీ నేర్పి మొబైల్ తో ప్రతినిత్యం కార్యక్రమంలో ప్రపంచ రికార్డ్ సృష్టిస్తాము అని అన్నాడు. సుబ్బలక్ష్మి ఎగిరి గెంతులు వేసింది, ఇలాగాయితే ఒక పెద్ద కంపెనీ సి ఈ ఓ కన్నా ఎక్కువ రాబడి తెచ్చుకోవచ్చు సుబ్బలక్ష్మి అని అన్నాడు అప్పలకొండ.సుబ్బలక్ష్మి పేరెంట్స్ ఆందోళన చెందగా అప్పలకొండ గురుంచి ఆరా తీశారు ఊరువారు. అప్పలకొండ ఒక మొబైల్ షాప్ ఓనర్ దొరికిన మోడల్ మొబైల్స్ లో అడ్డమైన సాఫ్ట్వేర్ లోడ్ చేయించి 24 గంటల్లో 90% సమయం మొబైల్స్ కి ఎడిక్ట్ అయిపోయి టెక్ మ్యాడ్ అయిపోయాడు.కొన్నిరోజులు తీర్ధయాత్రలకు పోయి మొబైల్ పిచ్చి తగ్గించుకోమని అతని పిల్లలు, భార్య డబ్బులు ఇచ్చి పంపితే, సోమరితనంతో బాధ్యత మరిచి ఇంటికి చేరకుండా,గుడిగోపురాలు తిరక్కుండా ఇలా చూడ చక్కని సాధువులా అందరికీ దర్శనం ఇచ్చి బలాదూర్ గా తిరగడానికి అలవాటు పడిపోయి, సివిల్ డ్రెస్ లో తిరిగితే విలువ ఉండదని సాధువు యూనిఫామ్ లో బస్తాబై, కషాయం కట్టుకున్న మనిషి కనిపిస్తే చాలు కాలుమీద పడిపోయే భక్తులు ఉన్న ప్రతిచోటుకీ పోయి తనఎలాక్ట్రిన్ గాడ్జెట్స్ పిచ్చిని సామాన్యులకు ఎక్కించాడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్నారు, అంతే గ్రామపెద్దలు సన్నాసి అప్పలకొండను మర్యాదగా వేధికదిగి వెంటనే ఊరు విడిచి పొమ్మనమని హుకుం జారీ చేశారు. సన్నాసి మూటా ముళ్ళు సర్దుకొని ఉరుకులు పరుగులు మీద ఊరుదాటాడు. సుబ్బలక్ష్మి ఇంటివారు ఇంట్లో మొబైల్స్ గూటిలో పడేసి ముఖ్యమైన ఫోన్ నెంబర్లు బుక్ లోకి ఎక్కించుకొని కావలసినంత డబ్బు పట్టుకొని దేశ పర్యటనకు పోయారు, బయట ప్రకృతి చూసైనా మొబైల్ పిచ్చి నుండి సుబ్బలక్ష్మి బయట పడుతుందని... ఊర్లో వారు శుభం పలుకుతూ సుబ్బలక్ష్మి కుటుంబానికి వీడ్కోలు పలికారు.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి