కంటేనే అమ్మ అంటే ఎలా? - అఖిలాశ

step mother

నా పేరు నీహ. నాకు ఇద్దరు పిల్లలు. రియాకు రెండు సంవత్సరాలు, వీనల్ కు పదకొండు సంవత్సరాలు. కాకపోతే వీనల్ నా సొంత కొడుకు కాదు. అవును.., నేను ఆయనకు రెండో భార్యను. ఆయనను తన మొదటి భార్య వదిలేసింది. తన పేరు అల్క. తానో పెద్ద మోడల్. మాడలింగ్ కోసమని ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. చిన్నప్పుడు వీనల్ కి పాలు తాపడానికి ఇష్టపడేది కాదని మా అత్తగారు చెప్పారు. పాలు తాపితే తన వక్షోజాలు జారిపోతాయని, మోడలింగ్ కి పనికి రాకుండా పోతానని వీనల్ కి పాలు తాపేది కాదట. అలా ఇంట్లో గొడవలు జరిగి వీనల్ ని, ఆయనను వదిలేసి వెళ్ళిపోయింది.

వీనల్, రియాను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాను. వీనల్ పెద్దయ్యే కొద్ది నాపై ద్వేషం పెంచుకున్నాడు. నాతో మాట్లాడేవాడు కాదు. రెండు, మూడేళ్ల నుండి అల్క దగ్గరికి వెళ్లి వస్తూ ఉండేవాడు. నాకు అది బాధగానే అనిపించేది. చిన్నప్పటి నుండి వీనల్ ను సొంత బిడ్డలాగే పెంచుకున్నాను. సొంత బిడ్డలాగే ఏంటి? వాడు నా సొంత బిడ్డే. ఇప్పుడు నాకు కాకుండా పోతాడేమోనని భయమేస్తోంది. కాకపోతే వీనల్..,రియాతో చాలా చక్కగా ఉంటాడు. ఇద్దరు కలిసి ఆడుకుంటారు, చదువుకుంటారు.

వీనల్ కి నేనంటే ఎందుకు ఇష్టం లేదో అర్థం కావటంలేదు. తన మనసులో ఏదో ఉంది. లేదంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తాడు? అప్పుడప్పుడు “నువ్వూ.., నన్ను మా అమ్మను వేరు చేసావు నాకు దూరంగా ఉండు అనేవాడు.” బహుశ తన మనసులో అల్కను, తనని నేనే దూరం చేశాననే ఆలోచన ఉన్నట్లు ఉంది.

ఒకరోజు.., నాకు జ్వరం రావడంతో పొద్దునే లేవలేకపోయాను. టిఫిన్ ఆలస్యం అయ్యిందని ఇంట్లోని వస్తువులన్నీ వీనల్ చెల్లాచెదురు చేశాడు. ఈయనకు బాగా కోపం వచ్చి “నీవు ఇంట్లో ఉంటే చేతలకు రావు నిన్ను బోర్డింగ్ స్కూల్ లో వేస్తే తప్ప దారికి రావని వీనల్ ను బెంగళూరులో ఉన్న సెయింట్ జోసెఫ్ బోర్డింగ్ స్కూల్ లో జాయిన్ చేశారు.” నేను ఎంత చెప్పిన వినకుండా వీనల్ ని, నాకు దూరం చేశారు. వీనల్ ఇంటి నుండి వెళ్ళినప్పటి నుండి నాకు అసలు బాగుండటం లేదు. రియా కూడా వీనల్ ని మిస్ అయ్యేది. అప్పుడప్పుడు ఈయన బెంగళూరుకి వెళ్లి వచ్చేవారు. వీనల్ చాలా బాగా చదువుకుంటున్నాడని చెప్పేవారు. నేను కూడా ఆనందపడేదాన్ని కాని చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమయ్యాడని చాలా బాధపడేదాన్ని. కనీసం సెలవుల్లో కూడా ఇంటికి వచ్చేవాడు కాదు.

ఒకసారి వీనల్ నుండి ఈయనకు ఫోన్ వచ్చింది. వాలీబాల్ టోర్నమెంట్ లో వీనల్ జట్టు ఫస్ట్ వచ్చిందని, స్కూల్ డే రోజు తన జట్టుకు ట్రోఫీ బహుకరణ ఉంటుందని, అల్క అమ్మను పిలుచుకొని తప్పకుండా రావాలని చెప్పి ఫోన్ పెట్టేశాడు.

ఈయనేమో నన్ను కూడా రమన్నారు. వీనల్ ని చూడక రెండేళ్లు అయ్యింది. కనీసం ఇలాగైనా తనను చూడవచ్చని ఈయనతో పాటు వెళ్ళాను. అక్కడికి అల్క కూడా వచ్చింది. చాలా చక్కగా అలంకరించుకొని ఇద్దరు పనివాళ్లను వెంటబెట్టుకొని ముందు వరసలోనే కూర్చొంది. నేను, ఈయన ఒక చోట కూర్చొని వీనల్ బహుమతి ప్రధానం కోసం ఎదురుచూస్తున్నాము.

అంతలోనే వీనల్ జట్టును స్టేజి మీదకు పిలిచారు. వీనల్ ట్రోఫీని తీసుకొని రెండు చేతులు పైకెత్తి చాలా సంతోషపడ్డాడు. వీనల్ జట్టు వారంతా స్టేజి దిగిన తర్వాత వీనల్ కు మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు.

వీనల్ అందరికి నమస్తే మా గెలుపుకు స్పోర్ట్స్ టీచర్ కారణమని వారి ప్రోత్సాహం వల్లే మేము గెలిచామని చెప్పుకొచ్చాడు. నన్ను ఇంత మంచి స్కూల్ లో జాయిన్ చేసిన మా అమ్మ, నాన్నకు ధన్యవాదములు అన్నాడు. అంతలో స్టేజి మీద ఉన్న టీచర్ మీ అమ్మ నాన్నను స్టేజి మీదకు పిలువు అన్నారు.

వెంటనే అల్క లేచి నిలబడింది. అక్కడ ఉన్న ఫోకసింగ్ లైట్ ఆమె మీద పడగానే అల్క పొంగిపోయింది. అందరూ చప్పట్లు కొడుతున్నారు. వీనల్ స్టేజి దిగి నా దగ్గరకు వచ్చి “అమ్మా…, నాన్నను పిలుచుకొని స్టేజి మీదకు రండి అన్నాడు.” నాకేమి అర్థం కాలేదు. ఏమీ మాట్లాడకుండా ఈయనను పిలుచుకొని స్టేజి మీదకు వెళ్ళాను.

వీనల్.., కంటినిండా కన్నీరు కార్చి “అమ్మా నన్ను క్షమించు. నేను నీ విలువ తెలుసుకున్నాను. నేను నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నువ్వు నన్ను ప్రేమించావు, ప్రేమిస్తూనే ఉన్నావు. నువ్వు నాకు తల్లిగా ఉండటం నా అదృష్టం అన్నాడు.”

నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే నన్ను వీనల్ ఎప్పుడూ అమ్మ అని పిలవలేదు. వెంటనే వీనల్ ని కౌగలించుకొని ఏడ్చేశాను.

ఆంగ్ల మూలం : జేఎస్

స్వేచ్ఛానువాదం : అఖిలాశ

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి