Bsc - శ్రీనివాసరావు జీడిగుంట

Bsc

ఎందుకో రెండు రోజులు నుంచి కళ్ళు తిరుగుగుతున్నట్లు గా అనిపించడం తో ఎందుకైనా మంచిది అని కాలనీలో క్లినిక్ పెట్టిన కొత్త డాక్టర్ దగ్గరికి బయలుదేరాడు పద్మనాభం. కొత్త హాస్పిటల్ అయినా జనం బాగానే వున్నారు. డాక్టర్ గారు బాగా చాదస్తుడు అనుకుంట, ఒక్కొక్కరు ని యిరవై నిముషాలు పైన చూస్తున్నాడు. ఒక గంట తరువాత పద్మనాభం వంతు రావడం తో తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. డాక్టర్ చాలా చిన్నవాడు లాగా వున్నాడు అనుకుంటూ ఆయనకు ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. అప్పటి వరకు ఎవరితోనో సెల్ లో మాట్లాడి, నన్ను చూసి "ఏమిటి problem"అన్నాడు డాక్టర్. "BSC " అన్నాడు పద్మనాభం. డాక్టర్ మొహం చిత్తలించుకుని, మీరు ఏమి చదివారని కాదు, ఏమిటి రోగం అనబోయి, ప్రాబ్లెమ్ అన్నాడు. దానికి పద్మనాభం అదేనండి, BSC. BP, షుగర్, cholesteral అన్నాడు. దాంతో డాక్టర్ గారు ఒక్కసారిగా విరగబడి నవ్వుతు, బలేవారండి, మీ పేరు కి తగ్గట్టు గానే మాట్లాడుతున్నారు, అంటూ బీపీ చూసి కొద్దిగా ఎక్కువ వుంది, మీ వయసు కి పరవాలేదు. కొత్త మందులు ఏమిరాయటం లేదు, యిప్పుడు వాడుతున్నవి చాలని, ప్రిస్క్రిప్షన్ చేతికి యిచ్చాడు. "యింతోటిదానికి ఫీజు నష్టం "అనుకుంటూ పై జేబులో రెడీ గా పెట్టుకున్న అయిదు వందల నోటు బయటకి తీస్తో "మీ ఫీజు "అన్నాడు పద్మనాభం. అప్పటి వరకు, రాబోయే పేషెంట్ కేసు షీట్ చూస్తూ, కొద్దిగా వాకింగ్ చేస్తోవుండండి, డబ్బు తీసుతున్న పద్మనాభంతో, NCC అన్నాడు డాక్టర్ గారు. నడక పరవాలేదు గానీ, NCC ఈవయసులోనా అన్నాడు పద్మనాభం. దానికి డాక్టర్ హాయిగా నవ్వుతు NCC అంటే మీకు "No కన్సల్టెన్సీ charges " అన్నాడు. దానికి పద్మనాభం విరగబడి నవ్వుతు "బలే వాడివి, నీ పేరు కి తగ్గుట్టు గా అన్నావు సుధాకర్ అని లేచి నుంచున్నాడు. డాక్టర్ దగ్గర కి రమ్మని పిలవటం correct అవునో కాదో నాకు తెలియదు, మీరు మాత్రం అప్పుడప్పుడు తప్పకుండా రండి సరదాగా నవ్విద్దురుగాని, నాకూ ఫ్యూచర్ లో BSC రాకుండా వుండటానికి అంటూ, next పేషెంట్ ని పిలిచాడు డాక్టర్.

మరిన్ని కథలు

Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati
KARMA VADALADU
కర్మ వదలదు
- తాత మోహనకృష్ణ
mabbuteralu
మబ్బుతెరలు
- ప్రభావతి పూసపాటి