మరో దీపావళి - Otra Prakash Rao

Another Diwali

తొమ్మిదవ తరగతిలో ఇంటర్వెల్ సమయాన "దీపావళి పండుగ మేము జరుపుకోవడంలేదు " బాధగా అన్నాడు అనిరుద్ "మూడు నెలల క్రితం మీ తాతయ్య చనిపోయినందుకా " అడిగాడు ప్రణవ్

“ అవును ప్రణవ్ "

"ఆ మాటే మా అమ్మ చెప్పింది .దీపావళి రోజు నిన్ను మాయింటికి పిలుచుకొని రమ్మంది అనిరుద్ "

" కరోనా సమయంలో బడికి పంపడానికి భయపడుతూ పంపారు .ఎవరింటికి పోకూడదని మా అమ్మానాన్న హెచ్చరించారు ప్రణవ్ "

" నీవు రావని నాకు తెలుసు ... మా అమ్మ నిన్ను పండుగ రోజుభోజనానికి పిలవమని చెప్పడం వల్ల పిలుస్తున్నాను .నువ్వు వచ్చావంటే మనమిద్దరం సరదాగా గడపవచ్చు "

",కరోనా సమయంలో అడిగినా ఎవరింటికి పంపరు. అడిగి ప్రయోజనం లేనప్పుడు ఎందుకు అడగాలి. ఆంటీకి సారీ చెప్పు ప్రణవ్ "

" మా అమ్మకు నువ్వు చెప్పిందే చెబుతాను .ఇప్పుడు మీ నాన్నమ్మకు ఎలా వుంది అనిరుద్ "

" కరోనా వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెబుతూ మరోవైపు ఎనభై ఐదు సంవత్సరాల వయసు అయినందువల్ల ఏమైనా జరగవచ్చని డాక్టర్లు చెబుతున్నారు ప్రణవ్ "చెమ్మగిల్లిన కళ్ళతో అన్నాడు.

*** *** ***

దీపావళి రోజు ఇంటిముందు ప్రణవ్ రాకెట్ వెలిగించే సమయాన "పక్క వీధిలో మన అనిరుద్ వాళ్ళింట్లో చాలా టపాకాయలు సంతోషంతో కాలుస్తున్నాడు. " అంటూ హనీష్ చెప్పాడు .

ఆ మాటలు వినగానే ప్రణవ్ ఆశ్చర్యపోయాడు, " తాతయ్య చనిపోయి మూడు నెలలు కాలేదు. ఈ సంవత్సరం దీపావళి పండుగ ఇంట్లో జరగదని’ నాతో చెప్పాడు "

"మన ఊరిలోనే అన్ని టపాకాయలు కాల్చిన వారెవరూ వుండరనుకొంటాను . ఆ వీధి వారందరూ సినిమా చూస్తున్నట్టు అక్కడే చూస్తూ ఆనందిస్తున్నారు " ప్రణవ్ వెంటనే వెళ్లి అడగాలనుకొన్నాడు.

"అమ్మా నేనుఅనిరుద్ ను భోజనానికి మనింటికి పిలుచుకొని వస్తాను "

"వాడి తల్లితండ్రులు పంపరని చెప్పాడుగా "

"ఒక సారి అడిగి వస్తానమ్మా "అన్నాడు ప్రణవ్

" ముఖానికి మాస్క్ వేసుకొని వేళ్ళు "అంటూ హెచ్చరించింది తల్లి

"అలాగే అమ్మా...." అంటూ మాస్క్ ధరించి అనిరుద్ ఇంటికి వెళ్ళాడు . అనిరుద్ ను చూసి ఆశ్చర్య పోయాడు .సంతోషంతో ఉత్సాహంతో టపాకాయలు కాలుస్తున్న అనిరుద్ ను చూడగానే ప్రణవ్ నందు కోపం పెరిగింది

“ఎరా పండగే జరపనాన్నావు ఈ ఊరిలో అందరికన్నా గొప్పగా జరుపుతున్నావు "కోపంగా అడిగాడు

"ఔను ప్రణవ్ ఈ రోజు మాకు చాలా గొప్ప పండుగ జరపకుంటే ఎలాగా " అన్నాడు చిరునవ్వుతో

" మీకే కాదు దీపావళి పిల్లలకు గొప్ప పండుగని అందరికీ తెలుసు "వెటకారంగా అన్నాడు ప్రణవ్.

"ఎవరెవరో టపాకాయలు కాలుస్తున్నప్పుడు మా ఇంట్లో టపాకాయలు కాల్చకుంటే మా పరువు పోతుంది ప్రణవ్. ఇది మాకు దీపావళి పండుగ కాదు "

"ఏంట్రా అనిరుద్ నీవు చెప్పేది "

“ దీపావళి పండుగా మనమెందుకు చేసుకొంటాము చెప్పు ప్రణవ్ “

“ యుద్ధంలో నరకాసురుడనే రాక్షసుడిని సత్యభామ చంపినందుకు ఈ పండుగ జరుపుకొంటున్నాము అనిరుద్ “

“నేనిప్పుడు టపాకాయలు కాలుస్తున్నది ఆ దీపావళి పండుగ కోసం కాదు. మా ఇంటిలో మరో దీపావళి పండుగ జరుపుకొంటున్నాము "

“ అనిరుద్, అర్థమయ్యేలా చెప్పారా ... బ్లేడ్ వెయ్యద్దు”

“ మా నాన్నమ్మ యుద్ధంలో కరోనా రాక్షసిని చంపినందుకు మేము పండుగ జరుపుకొంటున్నాము. ఎనభై ఐదు సంవత్సరాల బామ్మ కరోనా నుండి బతికి సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా కోలుకోవడం గొప్ప అని ఆసుపత్రివారే చాలా ఆశ్చర్యంగా చెప్పారు. మా నాన్నమ్మ ఈ రోజు ఉదయం డిశ్చార్జ్ అవుతుంటే ఆసుపత్రివారంతా పెద్ద దీపావళి పండుగలాగా దీపావళి టపాకాయలు కాలుస్తూ వేడుక జరిపారు. అది చూసాక మేము ఇలా జరుపుతున్నాము “ అన్నాడు అనిరుద్

"సారీ రా నేనే తప్పుగా ఊహించుకొన్నాను .మీ నాన్నమ్మను ఎక్కడ "అన్నాడు ప్రణవ్

"క్వారంటైన్ లో ఉంది. తరువాత కావాలంటే ఫోన్ చేసి మాట్లాడు ప్రణవ్ "అన్నాడు

మరిన్ని కథలు

Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati
KARMA VADALADU
కర్మ వదలదు
- తాత మోహనకృష్ణ
mabbuteralu
మబ్బుతెరలు
- ప్రభావతి పూసపాటి