మంచివాడు - బళ్ల రవీంద్ర ప్రసాద్

Manchi Vadu

కళింగ రాజ్యాన్ని వీరసేనుడు పాలిస్తూ ఉండేవాడు.ఆయన ఎవరన్నా అడగటమే ఆలస్యం దానాలు చేసేస్తూ ఉండేవాడు..అర్హుడా కాదా అన్నది ఆలోచించేవాడు కాదు. ఇది చూసి అతని మంత్రి లబోదిబో అనే వాడు.

"రాజా! మీరిలా ఏడాపెడా దానాలు చేస్తుంటే అంతపురం ఖర్చులకు కూడా ఖజానాలో డబ్బు ఉండదు." అనేవాడు.

రాజు "పర్వాలేదు.నాకన్నా దానాలు ధర్మాలు చేసేవాడు ఈ లోకంలో ఇంకొకడు ఉండరాదు" అన్నాడు.

మంత్రి అన్నాడు.."రాజా! దానం అంటే ఇది కాదు!ప్రజలు కట్టిన సుంకమే మీరు దానం చేస్తున్నారు. పైగా ఆ డబ్బు ఇస్తూ జనం చేత గొప్ప అనిపించుకోవాలి అన్న దుగ్ధ మీలో బాగా ఉంది."

రాజు "అలాగా! అయితే దానం చేస్తే ఎలా ఉండాలి? చెప్పండి. వింటాను "అన్నాడు.

అయితే మనం రేపు ఒక చోటికి వెళదాం ప్రభూ! ఇలా కాదు. సామాన్య వేషంలో." అన్నాడు మంత్రి. సరే అన్నాడు రాజు గారు.

మర్నాడు ఇద్దరూ జానపదుల వలె వేషం కట్టి పది క్రోసుల దూరంలో ఉన్న కృష్ణా పురానికి వెళ్లారు. అక్కడ ఒక చెరువు త్రవ్వబడుతున్నది.

రాజు అన్నాడు. "ఈ చెరువు త్రవ్వటానికి నేను డబ్బు ఇవ్వలేదు. ఈ చెరువు త్రవ్విస్తున్నది ఎవరో కనుక్కోండి! మంత్రిగారూ" అన్నాడు.

ఒక వ్యక్తి వచ్చాడు "అయ్య నా పేరు సోమయ్య. నేనే ఈ చెరువు త్రవ్విస్తున్నాను!" అన్నాడు.

సోమయ్యా! ఇక్కడ నీ పొలాలు ఏమన్నా ఉన్నాయా చెరువు దగ్గర! అన్నాడు.

సోమయ్య అన్నాడు "రాజా! నా పొలాలు ఇక్కడ లేవు. ఇక్కడికి దగ్గర రామయపాలెం ఉన్నాయి. అక్కడ ఒక కాలువ ఉంది.ఆ కాలువ పుణ్యాన నా పొలాలు బాగా పండి డబ్బు వస్తున్నది.. నాది ఈ ఊరే! ఇక్కడ రైతులకు నీళ్ల వసతి లేకపోవడాన్ని పంటలు పండటం లేదు. వీళ్లంతా బాధ పడుతున్నారు.. నా గ్రామస్తులు బాధపడుతుంటే చూడలేక నా పంట డబ్బుతో ఈ చెరువు త్రవ్విస్తున్నాను.. ఈ చెరువు నీళ్లతో నా గ్రామస్తులు పంటలు పండించుకొని నాలాగే హాయిగా ఉండాలని ఇలా చేస్తున్నాను.ఒక ఏడు వీళ్ళ కి లాగే నా పోలమూ పండలేదు అనుకుంటాను.వీళ్ళకి మేలు జరుగుతుందికదా?" అన్నాడు.

రాజు నిజమే అంటూ కోటకి బయలుదేరాడు..

మంత్రిగారితో! దారిలో మంత్రి అన్నాడు.."తెలిసిందా! ప్రభూ!! దానం ఇస్తే ఎలా ఉండాలో?"

రాజుగారు అన్నాడు."అవును మంత్రిగారూ!నేను జనానికి డబ్బు ఇస్తూ వారిని సోమరులుగా చేస్తున్నాను.ప్రజల డబ్బు ఇలాటి పనులకు ఉపయోగిస్తే మరికొంత లాభం చేకూరుతుంది. ఇక నుండి అలాగే చేస్తాను."అన్నాడు.

మంత్రి రాజు తన మాటలు విన్నందుకు సంతోషించాడు.

మరిన్ని కథలు

Prema viluva
ప్రేమ విలువ
- Lakshmi Priyanka
Odarpu
ఓదార్పు!
- - బోగా పురుషోత్తం
Guruvu korika
గురువు కోరిక
- టి. వి. యెల్. గాయత్రి
Itlu nee tammudu
ఇట్లు, నీ తమ్ముడు!
- అంతర్వాహిని
Naalo sagam
నాలో సగం
- టి. వి. యెల్. గాయత్రి.
Pichhuka paga-Enugu chavu
పిచ్చుక పగ - ఏనుగు చావు
- హేమావతి బొబ్బు
Ati Garabam
అతి గారాబం (బాలల కథ)
- మద్దూరి నరసింహమూర్తి