ఆన్ లైన్ పండుగ. - భాస్కర చంద్ర

Online pandaga

అది సరిగ్గా ముప్పైఏళ్ళ కిందటి ఉగాది పండుగ. పండుగ అంటే పండుగే. అంతా పండుగ వాతావరణం. పొద్దున్నే లేచి మావిడాకుల కోసం దగ్గర్లో ఉన్న మావిడి తోటలోకి వెళ్లి, మావిడాకులు కోసుకొని ఇంటికి తేవడం మొదటి పని. వస్తూవస్తూ కొన్ని మావిడి పిందలు, వేపపూలు మరియు రాలిన చింత రెక్కలు కూడా తీసుకొని రావడం జరిగేది. తెచ్చిన ఆ వస్తువులన్నీ ఒక మూలన పడేసి, స్నానాదులు ముగించుకొని , ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టే పనిలో నిమగ్నులమయ్యేవాళ్ళం. మావిడాకులూ ఒక్కొక్కటి తీసి , గుమ్మానికి కట్టిన దారానికి వరుసగా కుట్టడం, తరువాత వాటి పక్కపక్కనా, పచ్చటి వేప రెమ్మలు చేర్చడం మాకు ఎంతో ఆనందాన్నిచ్చేవి. ఒక పక్క అమ్మ భక్ష్యాలు చేస్తూ ఉండేది. శనగ పప్పు తో చేసిన భక్షాలు , నెయ్యలో కాలుతూ ఉంటే వచ్చే కమ్మటి వాసన , అబ్బో మహా మదురంగా ఉండేది. అప్పుడు అమ్మ ఏది చేసినా ఎంతో రుచిగా ఉండేది. అమ్మ చేతి మహత్యమొ లేక మా నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ వల్లో కానీ , ఏది వండినా భలే రుచిగా ఉండేవి. అమ్మ ఆలా వంట పనులు చేస్తూ ఉంటే , మేము మాత్రం ఇంటిని అలంకరించే పనుల్లో ఉండేవాళ్ళం. తరువాత వేప పూవు ను , వేప పిందెల నుండి వేరుచేయడం, మావిడి ముక్కలు సన్నగా తురుమడం, ఇంతలో నాన్న గారు కొత్త మట్టి కుండ తేవడం, దాన్ని శుభ్రంగా కడిగి, దానికి ఒక కంకణం కట్టి పసుపు కుంకాలతో బొట్లు పెట్టి , ఉగాది పచ్చడి తయారు చేయడానికని సిద్ధమయ్యేవాళ్ళం. వంటలు, భక్ష్యాలు ,పచ్చడ్లు , పచ్చని తోరణాలు ,కొత్త బట్టలు వీట న్నిటితో ఇల్లంతా కలకలగ ఉండేది. వీటికి తోడు మరో ముఖ్యమైన విషయం చెప్పనే లేదు. అది, మా అత్తయ్య గారు అంటే మా నాన్నా గారి చెల్లెలు మా ఇంటికి రావడం. ఆమె కూడా వస్తూ వస్తు పండుగ సమాగ్రి , కొత్త బట్టలు ,ఏవేవో తెచ్చేది. అత్తయ్య గారు వచ్చారంటే సరి ,నాన్న గారి కళ్లల్లో కొత్త సంతోషం ,వరవడి ఎక్కువయ్యేది . అమ్మ ,నాన్న అత్తమ్మ వాళ్ళ పిల్లలు , పచ్చటి తోరణాలు, ఇక ఆ రోజుటి సాయంత్రం పంతులు గారి పచాంగ పఠనం , ఒక్కో క్కరి పేరు మీద , వారి వారి రాశులు బట్టి ధన యోగాలు , అవమానాలు, అదృష్ట దినాలు ఇంకా అనేకానేక విషయాలు చర్చించ బడేవి. ఇవన్నీ అయిపోగానే , మల్లి ఏ యక్ష గానాలో లేక అవధాన ప్రక్రియనో చోటు చేసుకునేది. మేము అంటే "మా తరం" ఏంత పుణ్యం చేసుకుందో , మా కు అవన్నీచూసి, ఆస్వాదించి ,అనుభవించే అదృష్టం కలిగింది. "ఎంతైనా మేము మా తరం వారంతా అదృష్ట వంతులం , అదృష్టవంతులం.... "అంటు గొణుక్కుంటుంటే , మా ఆవిడ వచ్చి , "గొ ణిగింది చాలులే ముందు , ఆ డోర్ తెరిచి చూడండి ఎవరో వచ్చినట్లున్నారు" అంది . ఆవిడ గారు అరచినట్లు పురమాయించిన శబ్దానికి పూర్తిగా వర్ధమానంలోకి వచ్చాను. వెళ్లి మెయిన్ డోర్ తీస్తే, అమెజాన్ డెలివరీ బాయ్. పేరు, అడ్రస్ వాగైర కంఫర్మ్ చేస్తే , పార్సల్ డెలివరీ చేసి వెళ్ళిపోయాడు. ప్యాకెట్ ఓపెన్ చేద్దామనుకునే లోపే మల్లీ డోర్ బెల్ మ్రోగింది. మల్లి ఎవర్రాబ్బా అని డోర్ తెరిచి చూసాను. ఎవరో ఇద్దరు కుర్రాళ్లు, యూనిఫామ్ లో ఉన్నారు. చక చ క మా వివరాలు అడిగి కంఫర్మ్ చేసుకుని ఓటీపీ అడిగాడు. ఓటీపీ చెప్పిన వెంటనే తన దగ్గరున్నా పార్సెల్ ఓపెన్ చేసి, దాంట్లో నుండి మరేవో రెండు పాకెట్స్ ఓపెన్ చేసి , ఆ పాకెట్స్ ను కత్తిరించి వాటిలోంచి ఇంటి గుమ్మాలకు కట్టాల్సిన తోరణాలు తీసి , చకచక గుమ్మాలకు అలంకరించడం మొదలు పెట్టాడు. ప్రధాన ద్వారానికి యేల్లీడీ లైట్స్ తో సుందరంగా అమర్చబడిన ప్లాస్టిక్ తోరణం మరియు ఇతర గుమ్మాలకు వెరైటీ తోరణాలు తామంతతామే అమర్చి ఓ పది నిమిషాల్లో తమ పని ముగించుకొని వెళ్లిపోయారు. మావిడి తోటకు వెళ్లడం, ఆకులూ కోసుకొని రావడం, దారాలకు కుట్టి తోరణాలు చేయడం, మల్లి రెండు రోజులకు కల తప్పటం ,వాడటం , ఇవన్నీ ఏమి లేకుండా యెంత బాగా ఉన్నాయో ఆ తోరణాలు. ఇంతలో మల్లి కాలింగ్ బెల్ మ్రోగింది . ఎవరబ్బా అని మల్లి తలుపు తీశాను, ఇంకో వాడు మరొక పార్సీలు తో ప్రత్యక్షమైనాడు. అతని చేతిలో ఉన్న రెండు వేర్వేరు పార్సిళ్లు .అవికూడా ఓటీపీ చెప్పి తీసుకున్నాను. "మల్లి ఎవరండీ ?" అని శ్రీమతి కేక . "రెండో పార్సీలు అన్నాను -ముక్తసరిగా. "మీకన్నీ వెటకారాలే. పని చేయడం చాతకాదు. చేసేవారిపైనా ఎగసికణాలకు మాత్రం తక్కువ లేదు" అంది మూతి వంకరగా తిప్పుటూ. అది విప్పి చూసాను .ఒక దాంట్లో నెయ్యి వాసన గుప్పిస్తున్న వేడి వేడి బచ్చాలు. రెండోది రెడీమేడ్ ఉగాది పచ్చ్హడి. దాన్నీ ఎలా ఓపెన్ చేయాలో , అది యెంత కాలం నిలువ ఉంటుందో, దాంట్లో ఏమేమి ఇంగ్రేడిఎంట్స్ ఉన్నాయో, దాన్నీ త్రాగడం వలన ఏ విటమిన్స్ సమకూరుతాయో ,అంతే కాదు ఏ ఎలర్జీ ఉన్నవారు దానిని తినకూడడో అన్ని సవివరంగా వివరింప చేసే ఓ చీటీ కూడా ఉంది. ఇంకేముంది , ఇంటి అలంకరన అయిపోయిది , పచ్చడి రెడీ. బచ్చాలు రెడి. అన్ని రీడీ , ఒక చుట్టాలే లేరు అనుకుంటు ఉన్నానో లేదో, మొబైల్ ఉగాది రింగు టోన్ తో మ్రోగ సాగింది. అది వీడియో కాలింగ్ , మా చెల్లెలు రజని. రజని మాట్లాడటం మొదలు పెట్టిందంటే ఇక ఆపదు , ఆమ్మో!! అనుకుంటూనే వీడియొ కాల్ ఆన్ చేసాను. అంతే , "ఎరా అన్నయ్య వదిన ,పిల్లలు అందరు బాగున్నారా" తో స్టార్ట్ చేసింది. "ఆ చెల్లాయ్ అందరు బాగున్నారు. మీరు కూడా బాగున్నారా: కొంచం పిచ్ పెంచి ప్రతిసమాధానం ఇచ్చాను. "సరే గాని , నేను ఆన్ లైన్లో పంపిన ఉగాది పచ్చడి డెలివెరి అయ్యిందా " అని చెల్లమ్మ గొంతు. అప్పుడు అర్థమయ్యింది , మొదటి పార్సెల్ కంటెంటు. వెంటనే మొబైల్ను మా ఆవిడా చేతికి ఇస్తూ , "మీరు మాటాడంటి నేను, పార్సెల్ విప్పే చూస్తాను" అన్నాను. "ఆ.. చూడండీ. ఎలాగో మీ చెల్లి పంపిన ఉగాది పచ్చడే గా మీకు నచ్చేది " అంది శ్రీమతి. అంతలోనే మా అమ్మయి కలుగ చేసుకొని , "ఊరుకో అమ్మా, నాన్నని ఎందుకలా ఉడికిస్తావు" అంది. ఇంకా ,"నీ విషయంలో కూడా అంతేగా , నీవు పంపిన పచ్చడిని మీ అన్నయ్య లొట్టలు వేసుకుని తినడా " అంటూ పార్సెల్ విప్పడంలో నాకు సహాయం చేయసాగింది . ఇక వీడియో కాలింగ్ లో మా అవిడా , చెల్లెలు మాటాడుకుంటూనే వున్నారు. "తానూ ఆర్డర్ చేసిన పచ్చడి, బచ్చాలు ,ఆన్లైన్ షాప్పింగ్స్ , తారుమారైన పార్సిల్స్ గురించి , నాతొ.. మా ఆవిడతో.. మా పిల్లలతో ..., మా పిల్లలు వాళ్ళ పిల్లలతో.. ఆలా ఓ గంట సేపు సాగింది ఆ వీడియొ కాలింగ్. వీడియొ కాలింగ్ అయిపోయిన తరువాత ఇల్లంతా ప్రశాంతంగా అనిపించింది. ఏదో తుపాను వచ్చి ఆగినంత నిశ్శబ్దం. పార్సిల్ విప్పి చుస్తే - అదియు ఉగాది పచ్చడే. అది ఆన్లైన్ లో ఆర్డర్ చేసిందే. సేమ్ టు సేం. భోజనాలు అయ్యాయి అని పించాక, టీవీ ఆన్ చేసారు.పండుగ సందర్బంగా ఏవేవో ప్రోగ్రామ్స్. కొన్ని వెకిలిగా నవ్వించేవి. కొన్ని కోతి చేష్టలు , ఇక కొన్ని ఛానెళ్లు పంచాంగ శ్రవణాన్ని , రాశీ పలాలా విశ్లేషణలను ప్రసారం చేస్తుంన్నాయి గాని , ఈ తరం పిల్లలు మనల్ని విననిస్తారా?!!. ఆలా భోజనాలయ్యాక ఓ కునుకు తీసి, ఫ్రెష్స్ అప్ అయ్యి ,మెయిన్ డోర్ తెరుచుకుని బయటకు అచ్చాను. బయట అందరు ఇంటి గుమ్మాలను అందమైన ప్లాస్టీక తోరణాలతో తీర్చి దిద్దుకున్నారు. కొందరు లైట్లతో ,మరి కొందరు రంగు రంగుల బల్బులతో యెంత అందంగా అమర్చుకొన్నారో. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్క మనుషుల కల లేదు. అన్ని మూసి వున్న తలుపులే. ఇప్పటి పండుగలు ఇంటి గడప వరకే పరిమితమైనట్లున్నాయి. మా తరంలో , పండుగ అంటే అంతటా పండుగే. ఇంట్లో ఉంటె ఇంట్లో పండగ , వీధిలోకి వెలితే వీధిలో పండగ . ఊర్లోకి వెలితే వూరంతా పండగ.లోకమంతా పండగ వాతావరణం. మూసినఉన్న తలుపుల వెనుక యెంత పెద్ద సంబరం చేసుకొంటే మాత్రం ఏం లాభం , అది పది మంది పంచుకొని సంతోషపడనప్పుడు ??. అపార్టుమెటు వీడి దాటి , మెయిన్ రోడ్డు పైకి వచ్చాను, పేరుకు పండుగ తప్ప ఏ గుమ్మం దగ్గర ఓ పండుగ వాతావరణం లేదు. ఒక ఇంటి ముందు ఆసంతోషం లేదు. సంబరము లేదు కోలాహలం లేదు.చుట్టాలు లేరు, పక్కాలు లేరు , ఆ సంతోష వధనాలు లేవు. మీ ముందు తరం వారు మీకు గుర్తుండేలా పండుగలు చేసి , మీ మనస్సులో కొన్ని తీపి జ్ఞాపకాల్ని నింపారు. మరి మీరు మీ ముందు తరానికి ఏమి ఇస్తున్నారు అని మూగగా అడుగుతున్నట్లుంది, ప్రశ్నార్థక రూపంలో ఉన్న ఆ వీధి దారి. శుభం/

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల