నెవ్వర్ ఎండ్ ప్రేండ్ షిప్! - రాము కోలా.దెందుకూరు.

Never end friendship

" నెవ్వర్ ఎండ్ ప్రేండ్ షిప్" "డియర్ స్టూడెంట్స్.. "కాలేజీ ఎకాడమీక్ ఇయ్యర్ ముగింపుకు వచ్చింది." '"ఇప్పటి వరకు ఫీజు చెల్లించని వారికి చివరి అవకాశం ఇదే.." " ఫీజు చెల్లించడానికి మరో నాలుగు రోజులు సమయం ఇస్తున్నాం ." " ఫీజు చెల్లించని వారిని పరిక్షలకు అనుమతించడం జరగదు." "అందువలన అందరూ తప్పని సరిగా ఫీజ్ నాలుగు రోజుల్లో చెల్లించండి.." "లేదా మీరు ఒక విద్యాసంవత్సరం కోల్పోవాల్సి వస్తుంది ." "ఈ విషయం మీ పెరెంట్స్ కు తెలియపరచండి." నోటీసు అందరికీ చదివి వినిపించి తిరిగి వెళ్ళిపోయింది మార్గరేటా టీచ్చర్. **** లాంగ్ బెల్ మ్రోగింది. అందరూ తరగతి గదులను ఉండి పుట్టలోని చీమల్లా బిలబిల మంటూ బయట దూసుకు వస్తున్నారు. వినీత్ క్లాస్ రూమ్ అంటిపెట్టుకుని బయటకు రావడంలేదు.. దూరంగా నిలబడి గమనించాడు ధీరజ్ , "ఏంట్రా!అందరూ వెళ్ళిపోతున్నారు." "నువ్వు మాత్రం బయటకు రావడం లేదు .. ఎంటి సంగతి.." భుజం పైన చేతులు వేసి అడిగాడు ధీరజ్.. మిత్రుడు చేతి స్పర్శకు కరిగిపోయాడు వినీత్. "మరో నాలుగు రోజుల్లో ఫీజు చెల్లించని కారణంగా ఎలాగు నన్ను కాలేజీకి రానివ్వరు." "అందుకే ఒంటరిగా క్లాస్ రూమ్ లో ఇలా గడపాలని .." కన్నీరు పెట్టుకున్నాడు వినీత్. "అదేంట్రా..అలా అంటావ్." "ఇదేమి పెద్ద సమస్యే కాదు కదా..!" "ఇంట్లో చెప్పకుండా అలా నీకు నీవు అనుకుంటే ఎలా.. " ఓదార్పుగా భుజం నిమిరాడు ధీరజ్.. "లేదు ధీరజ్ గత నాలుగు సంవత్సరాలుగా పంటలు సరిగా పండడం లేదు." "వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగి పోతున్నాయని నాన్న చాలా బాధల్లో ఉన్నాడు." "నాటు పెట్టిన పోలంకు నీరు సరిపడక తాలు గింజ వస్తుందేమో అని ఒకటే బాధపడుతున్నడు." "నిన్ననే పోలం చూసి వచ్చినం ." "ఇప్పుడు పంటకు నీళ్ళు చాలా అవసరం." "ఎండిపోతున్న పంట పోలం చూసి ఇస్తానన్న చేబదులు కూడా ఇవ్వనని చెప్పెసిండు సేఠ్..ఇటువంటి పరిస్థితుల్లో టర్మ్ ఫీజు కోసం నాన్నను ఇబ్బంది పెట్టలేను." "నాకు నేనుగా కాలేజీ మానేయాలని నిర్ణయం తుసుకున్నా ." ఇదే నాకు కాలేజీ తో ఉన్న అనుబంధం చివరి రోజు , అందుకేనేమో ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు." కన్నీరు తూడ్చుకుంటూ చెపుతున్నాడు వినీత్. "ధీరజ్.. నేను రెఢీ అవుతున్నా ,నువ్వుకూడా స్నానం చేసి సిద్దంగా ఉండు.షోరూమ్ దగ్గరకు వెద్దాం." చెప్పేసి స్నానానికి వెళ్ళిపోయాడు ధీరజ్ నాన్నగారు విశ్వకేత్. ధీరజ్ ఆలోచనలు నిన్నటి సంఘటన దగ్గరే ఆగిపోతున్నాయ్. వినీత్ కాలేజీ టాఫర్.... తనకే కాదు,ఎందరికో చదువు విషయంలో ఎంతో హెల్ప్ చేస్తుంటాడు అటువంటి వినీత్ ఫీజు చెల్లించేందుకు ఇబ్బంది పడుతుంటే,సాటి ప్రెండ్ గా తానేమీ చేయలేడా.. "ధీరజ్...! ఏంట్రా..నిన్నటి నుండి అదోలా ఉన్నావ్.. బుక్ చేసిన మొడల్ నచ్చలేదా! నీ ఆలోచనలో మరేదైనా కొత్త మొబైల్ ఉందా ! నీకు నచ్చిందే తీసుకుందాం... ఓకేనా.. అంటూ ధీరజ్ పక్కన కూర్చుని షూ..కట్టుకుంటున్నాడు విశ్వకేత్. "నాన్న గారు మీతో ఓ పది నిముషాలు మాట్లాడాలి. ప్రస్తుతం నాకు బైక్ తీసుకునే ఆలోచన లేదు.. కానీ ... బైక్ బదులుగా ..అంటూ ఆగిపోయాడు ధీరజ్. ధీరజ్ మనసులో ఏదో ఉంది అనేది విశ్వకేత్ అర్దం చేసుకున్నాడు. ధీరజ్ ను దగ్గరకు తీసుకుంటూ.. "నీ బర్త్ డే గిఫ్ట్ గా నువ్వు కోరుకున్న బైక్ కాదనుకుంటున్నావంటే. మరేదో కోరుకుంటూన్నావని అర్థమౌతుంది." "చెప్పు నాన్నా!...ఏం కావలి.! ప్రేమతో అడిగాడు విశ్వకేత్. "నాన్న గారు.. నాకు..నాకు.. బైక్ బదులుగా డబ్బులు కావాలి." ధీరజ్ మాటలకు విశ్వకేత్ ఆశ్చర్యం పోయాడు.. అంత‌ డబ్బు అవసరం ఏమోచ్చింది. తనకు తెలిసినంత వరకు ధీరజ్ కు ఎటువంటి అలవాట్లు లేవు. కానీ ఇంత డబ్బు అడిగాడు అంటే.. ఒక వేళ..ఏదైనా డ్రగ్స్ కు అలవాటు.. ఛా..ఛా ఇలా ఆలోచించడం తప్పు... "సరే ధీరజ్ ..నీకు బైక్ బదులుగా డబ్బులు కావాలి అంతే కదా .." "సరే ..పదా .. బ్యాంకు లోడ్రా చేసి ఇస్తాను .." అంటూ కూర్చున్న చోట నుండి కదిలాడు..విశ్వకేత్. ఆన్న మాట ప్రకారమే బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసాడు విశ్వకేత్. నాన్నగారు మీకు అభ్యంతరం లేకపోతే వివేక్ ఇంటి దగ్గర నన్ను దించగలరా.. అలాగే ..అనేసి బైక్ ను వివేక్ ఇంటివైపం మరళించాడు. ***** ధీరజ్ తన తండ్రి గారిని వెంట పెట్టుకొని రావడంతో వివేక్ తండ్రికి అనుమానం కలిగింది. తన కుమారుడు ఏదైనా తప్పు చేసాడేమో. అనుకుంటూ.. "బాబు మీరు ఇటు.." .అంటూ ఆగి పోయాడు వివేక్ తండ్రి మురుగన్. "అంకుల్ ఇలా కూర్చోండి ముందు గత నాలుగు సంవత్సరాలుగా పంటలు సరిగా పండడం లేదని," "ఈ సంవత్సరం పంట చేతికి వస్తుంది అనుకుంటే నీటి వసతి లేక దిగుబడి తగ్గుతుంది అనే బాధ మిమ్మల్ని వెంటాడుతుందని " వివేక్ ద్వారా తెలిసింది.! "ఇటువంటి సమయంలో కాలేజి ఫీజు అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక వివేక్ కాలేజి చదువు విషయంలో ...." "అందుకే నేను బైక్ తీసుకోవాలనుకున్న తన డబ్బు మీకిస్తున్నా." "పొలంలో బోర్ వేయించండి." "కాలేజీ ఫీజ్ చెల్లించండి.. "వివేక్ కాలేజీ టాపిర్ అంకుల్.. వాడు లేకుంటే కాలేజీకి గౌరవమే లేదు..! "కాదనకుండా ఈ డబ్బులు తీసుకొండి." "మెల్లమెల్లగా మీకు అవకాశం ఉన్నప్పుడు తీర్చండి చాలు.." అంటున్న ధీరజ్ వైపు విశ్వకేత్, మురుగన్ విస్మయంగా చూస్తున్నారు. నేటి యువతలోని ఆలోచనా విధానాలను ఇలా ఉన్నందుకు. వివేక్ ముఖంలో చిరునవ్వు విరిసింది. దూరంగా కాలేజీ బెల్ మ్రోగుతుంది.. "త్వరగా పుస్తకాలు సర్దేసుకో.! "క్లాస్ మిస్ అవ్వకూడదు.." అంటున్న ధీరజ్ మాటలకు .ఓకే అన్నట్లుగా బ్రోటన్ వ్రేలు చూపించాడు వివేక్. కష్టం సమయంలో ఆదుకునే వాడే నిజమైన ఆప్తుడు(స్నేహితుడు) ... శుభం..

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి