Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Navvula Jallu by Jayadev Babu

ఈ సంచికలో >> శీర్షికలు >>

చిట్కా వైద్యం - నళిని

Home Remedies

సౌందర్య చిట్కాలు

1) ముఖం జిడ్డుగా ఉంటే రాత్రిళ్ళు గులాబీ ఆకులను నీళ్ళలో వేసి ఉదయం ఆ నీళ్ళతో ముఖం కడుక్కుంటే తేటగా ఉంటుంది.

2) మొటిమలు పూర్తిగా పోవాలంటే ఎండబెట్టిన తులసి ఆకుల్ని పొడి చేసి ఆ పొడికి ఒక టేబుల్ స్పూన్ పాలు, కొంచెం బాదం నూనె కలిపి రాసుకోవాలి.

3) గోరువెచ్చని నీటిలో రవ్వంత ఉప్పును కలిపి ఆ నీటితో కళ్ళను తుడవండి. కళ్ళు కాంతివంతంగా మెరుస్తాయి.

4) మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోవాలంటే తురిమిన కాకరకాయ గుజ్జుని ఆయా ప్రాంతాల్లో రుద్దితే సరి.

5) నీళ్ళలో జామ ఆకులు వేసి పది నిమిషాలు మరగనివ్వండి, చల్లారిన తరువాత ఆ నీటిని మౌత్ వాష్ గా ఉపయోగించండి.

6) వారానికి రెండు సార్లు బాదం పప్పును నీటిలో నానబెట్టి, నానిన తరువాత దంచి ఒక చెంచా నిమ్మరసంలో కలిపి మెత్తగా పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టిస్తే మంచి వర్ఛస్సు కనబడుతుంది.

7) కప్పు టమోటో రసంలో కప్పు మజ్జిగను మిక్స్ చేసి మచ్చలు మీద రాస్తే మచ్చలు పోతాయి.

8) కొంచెం ఉల్లి రసంలొ దూదిని ముంచి నల్ల మచ్చలు ఉన్నచోట రాసుకుంటే ఫలితం ఉంటుంది.

9) కొబ్బరి నూనెలో కర్పూరం కలుపుకుని కురులకు పట్టించి అరగంట ఆగిన తర్వాత స్నానం చేస్తే చుండ్రు త్వరగా తగ్గుతుంది.

10) పెరుగు మీగడలో సెనగ పిండి, నిమ్మరసం కలిపి పెదాలకు రాసుకుంటే మృదువుగా ఉంటాయి.

11) మందారపు పువ్వుని కాగేనూనేలో వేసి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించుకుని అరగంట తరవాత తలారా స్నానం చేస్తే జుట్టు నిగ నిగ లాడుతూ వత్తుగా పెరుగుతుంది.


12) దాల్చిన చెక్కను తీసుకొని బాగా మెత్తని పొడి చేసి, అందులో కొద్దిగా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్ర పరచుకొన్నట్లైతే ముఖంలో ఫెయిర్ నెస్ వస్తుంది.
 

మరిన్ని శీర్షికలు
Vantillu - Totakura Pulusu