‘అత్తారింటికి దారేది’ సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. వీటిల్లో ఏ పాట బాగుంది? అంటే అన్ని పాటలూ అని చెప్పాల్సి వస్తుంది. అవార్డుల కోణంలో చూస్తే, రెండు పాటలకు ఎక్కువమంది ఓటేస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ‘అమ్మో.. బాపుగారి బొమ్మా..’ పాటకి అత్యంత ప్రజాదరణ లభిస్తోంది.
శ్రీమణి రాసిన ‘గగనపు వీధిలో..’ పాట విమర్శకుల ప్రశంసలు పొందుతోంది, ప్రేక్షకుల ఆదరణా సొంతం చేసుకుంటోంది. ఇద్దరిలో ఎవరో ఒకరికి సైమా, ఫిలింఫేర్ తదితర అవార్డులు గ్యారంటీ అని చర్చించుకుంటున్నారు టాలీవుడ్లో. నంది అవార్డుల విషయానికొస్తే, వాటికి చాలా లెక్కలుంటాయి. అత్యంత ప్రజాదరణ పొందిన పాటలకు సైమా, ఫిలింఫేర్ తదితర అవార్డులు లభిస్తుంటాయి కాబట్టి, ‘అత్తారింటికి దారేది’ ఈ ఏడాది ఉత్తమ ఆల్బమ్గా అందరిచేతా కొనియాడబడుతోంది కాబట్టి, అవార్డులు గ్యారంటీ అని ఓ నిర్ణయానికి వచ్చేయొచ్చు.
శ్రీమణి, రామజోగయ్యశాస్త్రి.. ఇద్దరిలో ఎవరికి అవార్డు వచ్చినా, అది సినిమాకి వచ్చినట్టే కాబట్టి, ‘అత్తారింటికి దారేది’ పాటల పరంగా ఎన్ని అవార్డులు కొడుతుంది, ఇద్దరికీ అవార్డులు దక్కుతాయా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
|