రాజమౌళిని టాలీవుడ్ లో మిస్టర్ పెర్ ఫెక్షనిస్ట్ అంటారు అందరూ. తాను కోరుకున్న ఔట్ పుట్ కోసం తాను కష్టపడటంతోపాటు, ఆర్టిస్టులనూ కష్టపెడతాడు రాజమౌళి. దాన్ని అతనితో పనిచేసిన ఆర్టిస్టులు ఇష్టంగా భావిస్తారు కూడా. ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమా రూపొందిస్తున్న రాజమౌళి, ఆ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు.
రామోజీ ఫిలింసిటీలో ‘బాహుబలి’కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సీన్ లో రాణా నటిస్తున్నాడు. ఓ కర్టెన్ కాలిపోయే సన్నివేశం కోసం 14 టేక్ లు తీయించాడు రాజమౌళి. ఓ డైరెక్షన్ లో కర్టెన్ కాలిపోవాల్సి వుండగా, అది 13 షాట్ ల వరకూ సరిగ్గా కుదరలేదు. చివరికి ఖచ్చితంగా రాజమౌళి అనుకున్నట్టుగానే సన్నివేశం వచ్చింది. తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘బాహుబలి’ కోసం రాజమౌళి ఎంత శ్రమిస్తున్నాడో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి కష్టాలు, పెర్ ఫెక్షన్ కోసం తిప్పలూ చెప్పుకుంటే బోలెడున్నాయని యూనిట్ సభ్యులు అంటున్నారంట. అయినప్పటికీ రాజమౌళి డెడికేషన్ కి హేట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు వారంతా.
|