వెంకటేష్, రామ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘మసాలా’. బాలీవుడ్ చిత్రం ‘బోల్ బచ్చన్’ కి ఇది తెలుగు రీమేక్. విజయభాస్కర్ దర్శకుడు. అంజలి, షాజన్ పదామ్సీ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆద్యంతం కామెడీతో సినిమా అద్భుతంగా సాగుతుంది. హిందీలో ఘనవిజయం సాధించింది గనుక, తెలుగులోనూ ఈ సినిమా విజయం ఖరారైపోయినట్టే అనుకోవచ్చు.
విజయభాస్కర్ డైరెక్షన్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవనుంది. వెంకటేష్, రామ్ కాంబినేషన్ లో సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయట. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వెంకటేష్ అంజలి పెయిర్ ఆల్రెడీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తో సక్సెస్ అయ్యింది. అదే కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో సెంటిమెంట్ పరంగా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ నడుస్తోంది.
రామ్ షాజాన్ పదామ్సీల జోడీ చాలా చక్కగా కుదిరిందనీ, వీరిద్దరి మధ్యా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందనీ అంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. సినిమా తప్పక ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని హీరో వెంకటేష్ చెప్పాడు. మసాలా టైటిల్ కి తగ్గట్టుగానే కామెడీ, రొమాన్స్ , యాక్షన్ కలగలిసి వుంటుందని దర్శకుడు విజయ్ భాస్కర్ అంటున్నాడు.
|