అనేక బాలారిష్టాలు దాటుకుని థియేటర్లలోకి వచ్చిన ‘అత్తారింటికి దారేది’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. సినిమా విడుదలకు ముందే పైరసీ డీవీడీ వచ్చేయడంతో, థియేటర్లకు ఎవరూ రారని కొందరనుకున్నారు. కాని ‘అత్తారింటికి దారేది’ ఆ అవాంతరాన్ని చాలా తేలిగ్గా దాటేసింది.
ఉద్యమాల సెగ తగిలినప్పటికీ, అదీ ‘అత్తారింటికి దారేది’ హవాని అడ్డుకోలేకపోయాయి. యాభై కోట్లకు పై చిలుకు సాధిస్తుందని తొలి రోజే అంచనాలు వచ్చినా, టాలీవుడ్ హయ్యస్ట్ గ్రాసర్ అయిన ‘మగధీర’ని దాటుతుందని ఎవరూ ఊహించలేదు.
చాలా తేలిగ్గా 70 కోట్లు దాటేస్తోన్న ‘అత్తారింటికి దారేది’కి టైమ్ కలిసొస్తే, 100 కోట్ల క్లబ్ లోకి దూసుకుపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదేమో. పవన్ స్టామినా, త్రివిక్రమ్ డైరెక్షన్ , దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ .. అన్నీ కలిసొచ్చేశాయి ‘అత్తారింటికి దారేది’ సినిమాకి. అన్నిటికీ మించి పైరసీ దెబ్బ, పవన్ అభిమానుల్లో కసి పెంచింది. సామాన్య ప్రేక్షకులూ, పైరసీలో చూడ్డం కన్నా, థియేటర్లకు వెళ్ళి ఎంజాయ్ చేయడమే బెస్ట్ అనుకోవడంతో ‘అత్తారింటికి దారేది’ అదరగొట్టేస్తోంది.
|