సినీ పరిశ్రమలో పేమెంట్లకు సంబంధించి ఇన్వాయిస్ లూ గట్రా వుండవు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ వుందిగానీ, తెలుగు సినీ పరిశ్రమలో చాలా తక్కువ. పెద్ద పెద్ద అమౌంట్స్ విషయంలో ఎలా వున్నా, కథా రచయితలు, పాటల రచయితలూ, సినిమాటోగ్రఫీ.. ఇలాంటి విభాగాలు బిల్లులకు దూరంగా వుంటాయి. ఇప్పటిదాకా ఎలాగోలా నెట్టుకొచ్చేసినా, ఇప్పుడు సర్వీస్ టాక్స్ రాకతో కొత్త కష్టాలు మొదలయ్యాయి టెక్నీషియన్స్ కి. ఇచ్చే రెమ్యునరేషన్ లో టీడీఎస్ కట్ చేసి ఇస్తున్నప్పటికీ, వాటికి సంబంధించిన సర్వీస్ టాక్స్ లు వారిని భయపెడ్తున్నాయి. టీడీఎస్ ఇంకమ్ టాక్స్ పరిధిలోకి వస్తుంది.
సర్వీస్ టాక్స్ విధానంపై మొదటి నుంచీ చాలా విమర్శలున్నాయి. ఎక్కడా లేని విధంగా సినీ పరిశ్రమ ట్యాక్స్ లు చెల్లిస్తోందనీ, దాంతో సినిమా నిర్మాణం కష్టతరమవుతోందని పలువురు సినీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు కూడా. సర్వీస్ ట్యాక్స్ నుంచి వెసులుబాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతూనే వున్నా, ఫలితం దక్కడంలేదు.
ఒకవేళ సినీ పరిశ్రమ ప్రయత్నాలు ఫలించి, సర్వీస్ టాక్స్ నుంచి మినహాయింపు లభిస్తే కొంతమేర టెక్నీషియన్లు కూడా ఊపిరి పీల్చుకోగలుగుతారు. నిర్మాతలూ సేఫ్ జోన్ లోకి వెళతారు.
|