తెలుగులో సంచలన విజయం సొంతం చేసుకున్న 'అర్జున్‌రెడ్డి' సినిమాని హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా రూపొందుతోందీ సినిమా. కొన్ని నెలలుగా షాహిద్ కపూర్ అర్జున్‌రెడ్డి గెటప్ కోసం మేకోవర్ అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట్లో కొత్త భామ తారా సుతారియాని ఎంచుకోవాలనుకున్నారు. అయితే తారా సుతారియా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో బిజీగా ఉండడంతో ఆ ప్లేస్‌లో మరో ముద్దుగుమ్మ కోసం వేట మొదలెట్టారు. ఆ లిస్టులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు కూడా వినిపించింది. ఆఖరికి ఆ పాత్ర కోసం 'భరత్' బ్యూటీ కైరా అద్వానీని ఎంచుకోవడం జరిగింది.
తాజాగా కైరా పేరును అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. తెలుగులో షాలినీ పాండే నటించిన ఈ పాత్రకు అమాయకత్వంతో కూడిన అందంతో పాటు, కొన్ని సందర్భాల్లో మెచ్యూర్డ్ పర్‌ఫామెన్స్ కూడా అవసరం. 'భరత్ అనే నేను' సినిమాలో కైరా అద్వానీ నటన అందర్నీ ఆకట్టుకుంది. దాంతో ఈ పాత్రకు కైరా చక్కగా సూటవుతుందని భావించి ఆమెనే ఎంపిక చేసుకున్నారు. అలా హిందీ 'అర్జున్‌రెడ్డి'తో జత కట్టేందుకు కైరా ఫిక్సయిపోయింది. ఆల్రెడీ బోల్డ్ కంటెన్ట్ నేపథ్యం ఉన్న 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్‌లో నటించిన కైరాకి ఈ సినిమాలోని బోల్డ్ సీన్స్ అంత కొత్తగా అనిపించవనే చెప్పాలి. తెలుగులోనే లిప్‌లాక్స్‌ని అంత బోల్డ్‌గా చూపించిన సందీప్‌రెడ్డి వంగా ఇక హిందీలో లిప్‌లాక్స్‌ని ఇంకెంత బోల్డ్‌గా చూపిస్తాడో చూడాలిక.
|