బిగ్ బాస్ హౌస్ లోకి సడెన్ గా ఎంట్రీ ఇచ్చి హౌజ్ మేట్స్ నీ, ప్రేక్షకులనూ అలరించాడు కింగ్ నాగార్జున. దేవ దాస్ ట్రైలర్ వేసి చూపించి అందరికీ హుషారు కలిగించాడు. అయితే అదే సమయంలో ఒక విషయం ప్రేక్షకుల దృష్టిలో పడి ఆశ్చర్యంలో ముంచెత్తింది....అదే, నాని నాగ్ ని నువ్వు అని సంబోధిస్తూ క్లోజ్ గా మాట్లాడడం...అదేమిటి? నాని ఒక అప్ కమింగ్ హీరో, నాగార్జున ఒక పేద్ద హీరో....ఇద్దరి మధ్యా మరీ అంత చనువుందా అని....
అయితే, విషయమేమిటంటే, దేవ దాస్ సినిమాలో ఇద్దరి మధ్యా సానిహిత్యం ఉన్న పాత్రలు...వాళిద్దరి చుట్టూ అల్లుకున్న కథనం....నాగ్ బిగ్ బాస్ హౌజ్ కి రావడం, ఆయన అటు వెళ్ళి పోగానే ఆ చిత్ర హీరోయిన్స్ రావడం...ఇదంతా దేవ దాస్ సినిమా ప్రమోషన్ లో ఒక భాగమే....అందుకే, వాళ్ళ మధ్య సంభాషణాశైలిని ఇద్దరు హీరోలమధ్య ఉన్నట్టు కాకుండా, కేవలం దేవదాస్ సినిమాలోని పాత్రల మధ్య సంభాషణలాగే స్క్రిప్ట్ రాసారు. ఏ సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా చేయడం మామూలే....అదండీ సంగతి....!
|