ప్రతి నటికీ, నటుడికీ తప్పనిసరిగా వచ్చేది సంధికాలం....దాన్నే సినిమా భాషలో స్లంప్ అని అంటూంటారు. సినిమాల్లో కొనసాగేవారికే కాకుండా, సినిమాలనుంచి తప్పుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే నటులకొచ్చే సంధి కాలం మహా కీలకమైనది...ఎందుకంటే ఒకసారి రాజకీయాల్లోకొస్తున్నామని ప్రజల్లోకి సంకేతాలు పంపినప్పుడు, ఆ తర్వాత వారు చేయబోయే సినిమాలపై ప్రజలకు భారీగా అంచనాలేర్పడతాయి...వాటికి తగినట్లుగానే కథ, కథనం, పాత్ర అన్నీ రెడీ చేసుకోవాలి....ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై జోరుగా టాక్స్ వినిపిస్తున్నాయి... ఆయన ఏదోక పెద్ద పార్టీలో చేరతారని, లేదా సొంతపార్టీ పెట్టబోతున్నారనీ, ఇలా ఇంకా ఏదీ స్పష్టత రాలేదు....దేవుడి నుంచి ఆదేశాలు రాలేదని రజనీ వాయిదాలు వేస్తూ వస్తున్నారు....
ఇక దేవుడి నుంచి ఆదేశాలు వచ్చేసినట్టున్నాయి....అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పేసి తన మిగిలిన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయబోతున్నారట....ప్రస్తుతం రజనీ చేస్తున్న సినిమాలు పేట, మురుగదాస్ దర్శకత్వంలో చేయబోయే మరో సినిమా ఇవే చివరివి కావొచ్చని టాక్....చూద్దాం...ప్రేక్షకులకు దూరమైనా రజనీ ఒక సంచలన నాయకుడుగా జనం ముందుకొస్తారేమో....
|