అందాల తార శ్రీదేవి, బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వి కపూర్ నటించిన ధడక్ విజయాన్ని సాధించి, జాన్వికి మంచిపేరునే తెచ్చిపెట్టింది. అచ్చం తల్లిలాగే చక్కటి అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొంది. అసలే అటు హిందీలోనూ, ఇటు దక్షిణాదిలోనూ పేరు సంపాదించుకున్న అందాల తార, ఒక పెద్ద నిర్మాత కూతురు, ఇక అవకాశాలు జాన్విని వెతుక్కుంటూ రాకుండా ఉంటాయా..అందం, అదేక్రమంలో బాలివుడ్ లో మరిన్ని చిత్రాలు చేయబోతుందట జాన్వి. అందాల తార శ్రీదేవికి తెలుగు ప్రేక్షకులతో ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. పదహారేళ్ళ వయసు చిత్రం నుంచీ...గోవిందా..గోవింద వరకూ...బాలివుడ్ ఆమెకు మెట్టినిల్లయితే, టాలివుడ్ పుట్టినిల్లని చెప్పొచ్చు...అంటే జాన్వికి తెలుగు చిత్ర పరిశ్రమ అమ్మమ్మ గారిల్లన్నమాట...
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ హాట్ గా వింపిస్తోన్న పేరు విజయ్ దేవరకొండది....అర్జున్ రెడ్డితో ఘన విజయాన్ని అందుకుని, గీతగోవిందం ద్వారా యువత హృదయాలను గెలిచేసిన విజయ్ దేవరకొండ సరసన జాన్వి నటించబోతోందని సమాచారం...బోనీకపూర్ గ్రీన్ సిగ్నల ఇస్తే, జాన్వి తెలుగు చిత్రపరిశ్రమలో ఒక మంచి బోణీ కొట్టొచ్చు....చూడచక్కని జంట ప్రేక్షకుల ముందుకు రావొచ్చు....
|