బావగారు ఇకలేరు... - .

EVV no more...

గోదావరి యాస, భాషలకు ఎంతో ప్రాచుర్యం కల్పిస్తూ, "గోదారోళ్ల కితకితలు" ఫేస్ బుక్ పేజీతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన ఆ గ్రూప్ అడ్మిన్, ప్రముఖ రచయిత ఈదర వీర వెంకట సత్యనారాయణ (52) గురువారం(జులై 2, 2022) రాత్రి 11:30 గంటలకు గుండె పోటుతో రాజమండ్రి బొమ్మూరులోని తన నివాసంలో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన ఈవీవీ గా అందరికి సుపరిచితులు. "గోదారోళ్ల కితకితలు" ఫేస్ బుక్ పేజీని ఆయన 2016 లో ప్రారంభించి, ప్రపంచం నలుమూలల్లోని గోదావరి యాస, భాషలపై మమకారం కలిగిన వారెందరినో ఒకటి చేశారు. ఈ గ్రూప్ లో ప్రస్తుతం రెండు లక్షలకు పైగా సభ్యులున్నారు.

ఇటీవల నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమాలో ఈవీవీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఈవీవీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. ప్రతి ఏటా ఈవీవీ గారు గోదారోళ్ల కితకితలు గ్రూపు సభ్యులకై కార్తీక మాసంలో నిర్వహించే వనసమారాధనకు వేలాదిగా గ్రూపు సభ్యులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఎంతో సందడి చేసేవారు. ఈవీవీ మృతి చెందారన్న వార్త తెలిసి ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఈవీవీ గారితో మన గోతెలుగుకు ప్రత్యేక అనుబంధం ఉంది.

ఈవీవీ గారి ఆకస్మిక మరణానికి చింతిస్తూ, వారి ఆత్మ కి సద్గతి ప్రాప్తించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ
మీ గోతెలుగు.కామ్

మరిన్ని వ్యాసాలు

పింగళి లక్ష్మికాంతం కవి.
పింగళి లక్ష్మికాంతం కవి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బి.వి.నరసింహారావు.
బి.వి.నరసింహారావు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kutumbame Jeevanadharam
కుటుంబమే జీవనాధారం
- సి.హెచ్.ప్రతాప్
Pempakam lo premarahityam
పెంపకంలో ప్రేమరాహిత్యం
- సి.హెచ్.ప్రతాప్