రాజస్తాన్ రాష్ట్రము లోని కుంభాల్‌గఢ్ కోటను నిర్మించిన విశ్వకర్మ వంశీయ శిల్పాచార్యులు సూత్రధార్ శ్రీ మందన్
ఉత్తర భారత దేశములో ప్రఖ్యాత వాస్తుశిల్పి, కోటలు నిర్మించడం లో నిర్మాణ నిపుణుడు మరియు వాస్తు శాస్త్రజ్ఞుడు. వీరు మహారాణా కుంభ కాలంలో కుంభల్‌గఢ్ కోట నిర్మాణ ప్రధాన వాస్తు శిల్పాచార్యులు గా కీలక పాత్ర పోషించాడు. మందన్ విశ్వకర్మ
ఆయన లోకానికి అందించిన ముఖ్యమైన గ్రంథాలు *రాజ వల్లభ వాస్తుశాస్త్రం*
*ప్రసాదమందనం*,
*వాస్తుమందనం* తదితరాలు.
ఈ గ్రంథాలు వాస్తు శాస్త్రంలో ముఖ్యమైన పాఠాలు అందిస్తాయి. మందన్ విశ్వకర్మ తన తండ్రి నుండి పరంపర గా ఈ వాస్తు శాస్త్రం శిష్యుని గా అభ్యసించి తన తరం ప్రజలకు గురువుగా ఈ జ్ఞానం అందించారు. ఆయన శాసనకారుడు, నగర నిర్మాణ ప్రణాళికకారుడు, మరియు జ్యోతిష్కుడు కూడా.
మందన్ జీవించిన గ్రామం *మరువాస్* లో ఆయన శిల్పాన్ని నివసిస్తూ, ఆయనే భారతీయ వాస్తు శాస్త్రంలో ప్రముఖ వ్యక్తిత్వంగా నిలిచార
మహారాణా కుంభ సమయంలో, మేవార్‌లో సూత్రధర్‌ల సమావేశం జరిగింది. అనేక నిర్మాణ పనులు జరిగాయి. ముప్పై రెండు కోటలు మాత్రమే కాకుండా, కుండ్ మరియు సరోవర్ వంటి అనేక నీటి జలాశయాలు మరియు అనేక అద్భుత నిర్మాణాలు కూడా జరిగాయి. పర్వతాలపై చెరువులు నిర్మించబడ్డాయి. చిత్తోర్‌గఢ్‌లో శిల్ప సంరక్షణ కోసం సూత్రధర్ జైతా మరియు అతని కుమారులు కీర్తి స్తంభాన్ని నిర్మిస్తే, సూత్రధర్ మందన్ మరియు అతని కుటుంబం కుంభాల్‌గఢ్ వంటి గొప్ప పర్వత కోటను సృష్టించారు. అక్కడ, శిల్పాల మ్యూజియం నిర్మించబడింది.
సూత్రధర్ మందన్ యొక్క నివాస గ్రామం అతనికి గౌరవంగా రాజుగారు ఇచ్చింది ఆ గ్రామం మరువాస్. చాలా తరాలు గా సంవత్సరాలుగా,. ఈ గ్రామంలో ఈ దేశానికి చెందిన గొప్ప శిల్పి నివసించాడు అని ఎవరికి తెలియదు పాలకుల పరాక్రమం గురించి ప్రజలు తెలిసింది కానీ ఒక దేశం యొక్క మొహోన్నత వైభవ దృశ్య రూప కట్టడములకు కారణం అయిన శిల్ప వారసులు విశ్వకర్మ వంశీయ సూత్రధారులు ఉన్నారని వారిలో మందన్ మరియు అదే కాలానికి చెందిన జైత ,బలరాం, నారద, పెమా, చౌతా, సూత్రధార ధరణ వంటి అనేక మంది సూత్రధారుల గురించి ఈదేశములో ఎంత మందికి తెలుసు? ఆ మహనీయ శిల్పులు విగ్రహాలు కూడా ఉన్నవి.
సూత్రధర్ మందన్ మహారాణా కుంభ యొక్క ఆస్థాన శిల్ప సూత్రధార్.
. మనం ఆకాశం అంతరిక్షం నుండి, కుంభాల్‌గఢ్ కోట యొక్క ప్రాకారాన్ని చైనా యొక్క గొప్ప గోడలాగా చూడవచ్చు మనం ఈనాడు చూస్తున్నాము అంటే ఆ గొప్పతనం ఆ శిల్పికే చెందుతుంది . రాజుగా మహారాణా కుంభ దీని నిర్మాణానికి చరిత్ర లో ఘనత పొందాడు కానీ దాని వాస్తవ శిల్పి సూత్రధర్ మందన్ . మహారాణా కుంభను ఒక యుద్ధ వీరుడు గా కత్తి తో చేసే యుద్ధములో మార్చడంలో మందన్ చాలా దోహదపడ్డారు .మందన్ శిల్పి గుజరాతీ ప్రాంతానికి చెందిన విశ్వకర్మ సాంప్రదాయ సోంపురా కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి సర్వకళావిశారద, సూత్రధర్ క్షేత్రార్క్ లేదా ఖేత. వాస్తు ప్రసాద శిల్పంలో ఆయన తన కాలంలో ఒక ప్రత్యేక సంతకం. పురాతన భారతీయ గ్రంథాలు అయిన "జ్ఞాన్ ప్రకాష్ దీపార్ణవ" మరియు "జయప్రిచ్ఛ" వంటి గ్రంథాలను ఆయన తిరిగి మరల రాసారు లోకానికి అందించారు. ఈ గ్రంథాలను విశ్వకర్మ రాసినట్లు గా లోకం లో భావిస్తారు. మందన్ తన తండ్రి నుండి గురుజ్ఞానాన్ని పొందాడు మరియు ఆ కాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రంథాలను రచించాడు.
మందన్ యొక్క ప్రధాన గ్రంథాలు:
1. #రాజ్వల్లభ వాస్తుశాస్త్రం,
2. #ప్రసాదమందనం
3. #రూపమందనం
4. #దేవతామూర్తిప్రకరణం
5. #వాస్తుమందనం
6. #వాస్తుసారమందనం
7. #ఆయతత్త్వం
8. #శకుణమందనం,
9. #బందిస్తోత్రం మొదలైనవి.
మందన రచన పుస్తకాల ప్రతులు దేశంలోని ఇతర ప్రాంతాలకు విదేశాలకు వెంటనే చేరుకునేవి. షాజహాన్ కాలం నాటి ప్రఖ్యాత బనారస్‌కు చెందిన కవింద్రాచార్య పుస్తకాల సేకరణలో మందన పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆయన సోదరుడు నాథ మరియు కుమారుడు గోవింద్ కూడా వాస్తు పుస్తకాల రచయితలు.
రాజ్‌వల్లభ వాస్తుశాస్త్రం ముందుమాట నుండి

