కాశీ ప్రయాణ కథలు - ప్రతిభకు పట్టం - డా. బెల్లంకొండ నాగేశ్వరరావు

Kashi Prayana Kathalu - prathubhaku Pattam

కాశీ ప్రయాణ కథలు. 7 - ప్రతిభకు పట్టం.

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

సోదరులారా ఈరోజు మీకు ప్రతిభకు పట్టం అనే కథ చెపుతాను వినండి అని శ్రీహరి కథ చెప్పడం ప్రారంభించాడు...

ఉత్కకళ రాజ్యాన్నవీరసింహుడు అనే రాజు పరిపాలన చేస్తుండేవాడు.

ఒకరోజు రాజు గారు సభతీరిఉండగా నలుగురు యువకులు సభలో రాజుగారిని దర్శించి " ప్రభు నమస్కారం మేము ఉత్కళ రాజ్య నివాసులమే గురుకుల విద్య పూర్తి చేసుకుని తమరి కొలువులో ఉద్యోగ ఆశ్రయుతులుగా

వచ్చాము మావిద్యార్హతలకు తగిన విధమైన అవకాశం కలిగించమని విన్నపం " అన్నారు.

"చిరంజీవులారా మీరు ఏవిద్యలో ప్రావీణ్యత కలిగి ఉన్నారో తెలియజేయండి "అన్నాడు రాజుగారు .

"ప్రభు నాపేరు గణపతి తమరి కొలువులో వైద్యులుగా ఉన్న రంగనాధం గారి కుమారుడను ,ఎంతటి మొండి వ్యాధినైనా మూలికావైద్యంతో పూర్తిగా గుణపరచ గలను " అన్నాడు మొదటి యువకుడు.

"ప్రభు నాపేరు నలభీముడు నేను తమరి అంతఃహపురం వంటల సమీక్షకుడు భీయ్య గారి కుమారుడను పాకశాస్త్రం అభ్యసించాను రుచికరమైన వంటకాలు తయారు చేయగలను "అన్నాడు రెండో యువకుడు.

"ప్రభు నేను తమరి ఆస్ధాన జోతిష్యులైన లక్ష్శయ్య గారి కుమారుడను నాపేరు పూర్ణచంద్రుడు నేను జ్యోతిష్య శాస్త్రం అభ్యసించాను నావిద్యను ప్రదర్శించే నాకు తమరికి సేవలు చేసే భాగ్యం మాకు కలిగించండి "అని చేతులు జోడించాడు మూడవ యువకుడు .

"ప్రభు నేను తమరి సైన్యాధిపతి గోపయ్య గారి కుమారుడను నాపేరు ఉదయ భానుడు ఉన్నత విద్యతోపాటు ,కత్తిసాము నేర్చాను అన్నివిధాలైన ఆయుధాలతో పోరాడగలను కత్తి పట్టిన నాటినుండి ఓటమి ఎరుగనివాడిని నాచేత ఆయుధం ఉన్నంత వరకు నన్ను ఎవరు జయించలేరు "అన్నాడు నాలుగో యువకుడు.

"చిరంజీవులారా మీఅర్హతలు ప్రశంసింపతగినవే పైగా మీతండ్రులు మాకు సేవలందించినవారే మీరు రేపువచ్చి గణపతి వైద్యులుగా,నలభీముడు వంటల పరివేక్షకుడిగా,పుర్ణచంద్రుడు ఆస్ధాన జ్యోతిష్యుడిగా , ఉదయభానుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు స్వికరించండి " అన్నాడు రాజుగారు.

నలుగురు యువకులు వారి వారి వృత్తిలో స్ధిరపడ్డారు. కొంతకాలం అనంతరం ఉత్కళపై మగధ రాజు వక్రకేతు తన సైన్యంతో దాడి చేయడానికి వస్తున్నాడని వీర సింహ రాజుకు వర్తమానం అందినది .మంత్రి,సేనాపతితో సమావేశమై విషయం వివరించిడు రాజుగారు.

"ప్రభు నేను ఉండగా మీరు యుధ్ధరంగానికి రానవసరంలేదు ఆజ్ఞాపించండి " అన్నాడు సేనాపతి ఉదయభానుడు .

యుధ్ధరంగంలో విజయం సాధించి, మగధ మహరాజును బంధీగా చేసి వీరసింహుని ముందు నిబెట్టాడు ఉదయభానుడు.

మగధ రాజును బంధవిముక్తుడను చేసి గౌరవంగా సాగనంపిన విరసింహుడు " సేనాపతి ఈవిజయం నీదే ఈగెలుపుతో మరెవ్వరూ మనపైకి యుద్ధ కాంక్షతో రావడానికి భయపడేలా చేసావు అభినందనలు. ఈశుభసమయంలో ఏంకావాలో కోరుకో " అన్నాడు.

ప్రభు తమరి ఆశీస్సులుచాలు వృత్తిరీత్యా నామాతృభూమిని కాపాడుకునే అవకాశం నాకు కలిగించిన తమకు సర్వదా విధేయుడను " అన్నాడు ఉదయభానుడు .

"అపురూపమైన ఈవిజయాని బహుమతిగా మా ఏకైక కుమార్తె చంద్రలేఖతో నీకు వివాహం జరిపించి ఈరాజ్యభారాన్ని నీకు అప్పగించాలి అనుకుంటున్నాను " వీరసింహుడు.

రాజు గారికి పాదాభివందనం చేసాడు ఉదయభానుడు .

సభలో కరతాళ ధ్వనులు మొగాయి.

"సోదరులారా వీరసింహుడు తన కుమార్తెను ,తనరాజ్యాన్ని ఉదయభానునికి కారణం ఏమిటో చెప్పగలరా ?" అన్నాడు శ్రీహరి.

"అన్నయ్య ఎంతో గారాబంగా పెంచుకున్న ఏకైక కుమార్తె ఏదో ఒకదేశపు రాజకుమారుడిని వివాహం చేసుకుని వెళ్ళిపోతే, వృధాప్యంలో ఉన్న తను రాజ్యాన్ని ఎంతకాలం పాలించగలడు తన మరణానంతరం రాజ్యం శత్రురాజుల ఆధీనంంలోనికి వెళ్ళిపోతుంది అనుకున్న వీరసింహుడు తగిన నిర్ణంయం తీసుకున్నాడు ఆయన నిర్ణయంతో రాజ్యంక్షేమంగా ఉండటంతోపాటు తన కుమార్తె తమకళ్ళముందే ఉంటుంది అనుకున్నాడు " అన్నాడు శివయ్య .

"సోదరా ఇంకోరకమైన ఆలోచనకూడా వీరసింహుడు చేసి ఉండవచ్చు, ఉదయభానుడి విజయ పరంపర అద్వితీయంగా కొనసాగడము శత్రురాజులు ఉత్కళరాజ్యం వైపు కన్నెత్తి చూడటానికి

భయపడుతున్నందున ఉత్కళ ప్రజలు ఉదయభానుడికి బ్రహ్మరధం పట్టారు సర్వసైన్యం అతని ఆధీనంలోఉంది ఉదయభానుడు తలచుకుంటే ఉత్కళ రాజ్యానికి రాజు కావడానికి పెద్దగా శ్రమపడనవసరంలేదు అందుకే వీరసేనుడు ఉభయతారకంగా ఉంటుందని తనకుమార్తెను ఇచ్చి వివాహం జరప నిర్ణఇంచాడు " అన్నాడు బ్రహ్మయ్య .

"నిజమే మీరు ఇరువురు చెప్పిన కారణాలు సమంజసమైనవే "అన్నాడు శ్రీహరి.

అంతా నిద్రకు ఉపక్రమించారు.