విశ్వకర్మ ఎవరు? - కుందుర్తి నాగబ్రహ్మచార్యులు

విశ్వకర్మ ఎవరు?

విశ్వకర్మ ఎవరు? పరమాత్మ , ప్రజాపతి విశ్వకర్మయే? సకలచరాచర జగతత్తును సృష్టించినవాడు ,రుద్ర, విష్ణువు మొదలైన సకల దేవతాకోటిని , గంధర్వ, యక్షుల కిన్నెర,కింపురుష , మానవ పశుక్ష్యాదిక్రిమికీటకాదులను సృష్టించిన పరమాత్మ విశ్వకర్మయే అని వేదాలు ఎక్కడ చెప్పాయి? “ఆపోవా ఇదమగ్రే సలిలమాసితాస్మిన్ ప్రజాపతిర్వాయుర్భూత్వా అచరత్. స ఇమామ్ అపస్యత్, తాం వరాహో భూత్వా ఆహరత్. తాం విశ్వకర్మ భూత్వా వ్యమార్ట్ సాఽప్రథత సా పృథివ్యభవత్తత్పృథివ్యై పృథివిత్వం తస్యామశ్రామ్యత్ ప్రజాపతిః. స దేవానసృజత వసూన్రుద్రానాదిత్యాన్తే దేవాః ప్రజాపతి మబ్రువన్ప్రజాయామహా ఇతి సోఽబ్రవీత్౹౹

(1) యథాఽహం యుష్మాగ్మ్ంస్థపప్తాఽసృక్ష్యేవం తపసి ప్రజాననమిచ్ఛధ్వమితి తేభ్యోఽగ్నిమాయాతనం ప్రాయచ్ఛదేతేనాఽఽయతనేన శ్రామ్యతేతి తేఽగ్నినాఽఽయతనేనాశ్రామ్యన్తే....... ||

(2) (అథ కృష్ణయజుర్వేదం - 7 కాండే 1 ప్రపాటకే, 5అనువాకాః) ఇదే విదంగా ఇందులో ఎనిమిది మంత్రములు కలవు. తాత్పర్యము : - మనం చూసే విశ్వము (అనగా జగత్తు భూమి అని నానార్థములు )మొత్తం జలమయమై ఉండేది. మరియు మనం నిలబడి ఉన్న భూమి సలిలముతో కప్పబడి ఉంటుంది..

"ఇందుకు పూర్వం జలమును సృష్టించినది విశ్వకర్మయే అని ఋగ్వేదం -10 వ మండలము 82 సూక్తము 1 వమంత్రము తెలుపుతున్నది." ఋగ్వేదం యజుర్వేదము కంటే పురాతనమైనది. భూమి నీటితో కప్పబడి మరియు నివాసయోగ్యం కాని కారణంగా, విశ్వకర్మ వాయురూపము ధరించి నలుమూలల శోధించెను.ఆవిధంగా ప్రయాణిస్తున్నప్పుడు అతను నీటిలో భూమిని కనుగొన్నాడు.

విశ్వకర్మ భగవంతుడు శ్వేత వరాహ రూపము ధరించి తన కోరలతో ఈ భూమిని పైకి తీసుకుని వచ్చెను. విశ్వకర్మ అప్పుడు త్వష్టవిశ్వకర్మప్రజాపతి సాకార రూపాన్ని ధరించాడు మరియు భూమి పైనుండే నీటిని తుడిచివేసి, భూమిని విస్తరించాడు, (పృథ్వీ = విస్తారము అనే అర్థం కూడా ఉంది) ఆ భూమికి అప్పుడు పృథ్వీ అని పేరు పెట్టారు. అది ఇప్పుడు మనం నిలబడి ఉన్న నేల. 

అద్భ్యస్సంభూతః పృథివ్యై రసాశ్చ విశ్వకర్మణః సమవర్తతాధి, తస్య త్వష్టా విదధద్రూపమేతి..... అని పురుషసూక్తముయొక్క ఋక్కుననుసరించి జలతత్త్వమునుండి పృథ్వీ తత్త్వానికి తీసుకువచ్చినది పరమాత్మ పురుషుడైన విశ్వకర్మ అనే సత్యము ఋజువు అవుతుంది. విశ్వకర్మ ప్రజాపతి కొంతకాలం విశ్రమించెను.తరువాత భూమిపై ఎనిమిది మంది వసువులలు, ఏకాదశ రుద్రులు మరియు ద్వాదశ ఆదిత్యులను వీరందరికీ పరపాలకుడు ఇంద్రుడు ఆయనపై ప్రజాపతిని సృష్టించారు, విశేషవివరములు : - అష్ట వసువులు. 1. ఆప 2. ధ్రువ 3.సోముడు 4. అథర్వుడు 5. అనిలుడు 6. ప్రత్యూషుడు 7. అనలుడు 8. ప్రభాసుడు. ఏకాదశ రుద్రులు: - 1. ఆజను 2. ఏకపాదుడు. 3. అహిర్బుద్ధ్నుడు 4. త్వష్టృ 5. రుద్ర 6. హర 7. శంభుడు 8. త్ర్యంబకుడు 9. అపరాజితుడు 10. ఈశానుడు 11. త్రిభువనుడు. "రుధ్ రోదన రోదయతి ఇతి రుద్రః, రోదయాతి అసురాన్ రుద్రాః రుదిర్ = అస్రు విమోచన రుజం దుఃఖం ద్రావయన్తి ఇతి రుద్రాః రుతం వేదాత్మకం కల్పదౌ రువంతి ఇతి. " రుద్రుడు దుఃఖమును ఇచ్చేవాడు - ద్వాదశ ఆదిత్యలు: - 1. ఇంద్రుడు 2. ధాత 3. పర్జన్యుడు 4. త్వష్ట 5. పూష 6. ఆర్యముడు 7. భగుడు 8. విశ్వంత 9. అంశుమంత 10. వరుణ 11. మిత్ర 12. విష్ణు ఈ దేవతలందరినీ విశ్వకర్మయే సృష్టించెనని వేదం స్పష్టం చేసింది. సృష్టికర్త విశ్వకర్మ అష్ట వసువులును ఏకాదశ రుద్రులను , ద్వాదశఆదిత్యుల సృష్టించాడు మరియు వారందరికీ ఒక రాజు ఇంద్రుడు, సర్వోన్నత పరమాత్మ విశ్వకర్మకు ఇంద్రుడుకు మధ్య ప్రజాపతిని విశ్వకర్మ చేత సృష్టించబడ్డారు