కాశీ ప్రయాణ కథలు - ఆశ్రమ ధర్మాలు - శుక్రరధం - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kashi Prayana Kathalu - ashrama dharmalu

కాశీ ప్రయాణ కథలు - ఆశ్రమ ధర్మాలు - శుక్రరధం

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

"అన్నగారు నాకు ఆశ్రమ ధర్మాల గురించి తెలియజేయండి " అన్నాడు శివయ్య ." సోదరా నాకు శుక్రరధం గురించి కూడా తెలియజేయి " అన్నాడు శ్రీహరి.

సోదరులారా ఈరోజు మీరు అడిగిన ఆశ్రమ ధర్మాలు, శుక్రరధం గురించి చెపుతాను వినండి అని బ్రహ్మయ్య చెప్పడం ప్రారంభించాడు...

బ్రహ్మచర్యం,గార్హస్ధ్యం,వానప్రస్ధం,సన్యాసం అనేవి ఆశ్రమధర్మలు.

బ్రహ్మచర్యం:బ్రహ్మచర్యాన్ని 'సావిత్రం'అంటారు.ఎందుకంటే గాయత్రీ మంత్రోపదేశాన్ని పొంది దాన్ని జపిస్తారు కాబట్టి.ఉపనయం అయిన తరువాత బ్రహ్మచారి మొదటి మూడురోజులు గాయత్రీ మంత్రాన్ని జపించడాన్ని 'ప్రజాపత్యం'అంటారు.తరువాతవేదంలో చెప్పబడిన వాటిని ఆచరించడాన్ని'బ్రహ్మమని'వేదాన్నిసంపూర్ణంగా అధ్యాయనంచేసి అనుష్టానం చేయడాన్ని'నైష్ఠికమని'అంటారు.

గృహస్ధాశ్రమం:గృహస్తులు నాలుగు రకాలుగా విభజింపబడ్డారు.పొలం పండించుకు తినేవారిని'వార్త'అంటారు.యజ్ఞ సామాగ్రిని సమకూర్చు కోవడాన్ని'సంచయం'అంటారు.గృహస్తుడు ఇతరులను యాచించకుండా జీవించడాన్ని'శాలీనం'అంటారు.పొలంలో రాలిన గింజలు ఏరుకు తిని జీవించేవారిని'శిలోంఛం'అంటారు.

వానప్రస్తం:కందమూలాలు తిని జీవించేవారిని.'వైఖానసులు'అంటారు. కొత్తపంటచేతికి అందగానే ఇంటఉన్న పాత ధాన్యాన్ని దానంచేసేవారిని'వాఖల్యులు'అంటారు.రోజుకు ఒక దిక్కున యాచనద్వారా జీవించేవారిని'ఔదుంబరులు'అని,పండ్లను,ఆకులను భుజించి జీవనంచేసేవారిని'ఫేనవులు'అంటారు.

సన్యాసులు:సొంతకుటీరంలో తగు కర్మలు ఆచరించేవారిని' కుటీచకులు' అని.కుటీరం లేకుండా కర్మలు నిర్వహించకుండా సంచరించేవారిని ' బహుదకులు' అని,కేవలంజ్ఞానం మాత్రమే కలిగి సంచరించేవారిని 'హంసలని' జ్ఞానంకూడా పొందకుండా,పరబ్రహ్మ తత్వంలో లీనమయ్యేవారిని 'పరమహంసలు అంటారు.

వైవస్వతమనువు కుమార్తె 'ఇల'ఈమె చంద్రుని కుమారుడు ఊయిన 'బుధుని' వివాహంచేసుకుంది.వీరి కుమారులలో ఒకరైన 'పురూరవుడు'గొప్ప శివభక్తుడు.యమునానది తీరంలో ప్రయాగక్షేత్రమునకు సమీపములోని 'ప్రతిష్టానపురం'రాజధానిగా చేసుకుని, పరిపాలన చేస్తుండేవాడు.ఇతనికి ఊర్వశి ద్వారా ఆయువు,మాయువు,అమాయువు,విశ్వయువు,శ్రుతాయువు,శతాయువు అనే పుత్రులు జన్మించి, వీరంతా దేవలోకంలో ప్రసిధ్ధులు అయ్యారు.

ఆయువు భార్య ప్రభాదేవి. ఈమె 'సర్బావుని' కుమార్తె. వీరికి 'నహుషుడు' జన్మించాడు. నహుషుడు పిత్రుదేవతల కుమార్తె 'విరజ'ను వివాహం ఆడాడు. వీరికి యతి, యయాతి, సంయాతి, ఆయాతి, అంధకుడు, విజాతి అనే కుమారులు జన్మించారు. యతి తపోవనాలకు వెళ్ళగా, యయాతి రాజ్యభారం వహించాడు. యయాతికి రాక్షసల గురువైన శుక్రాచార్యుల కుమార్తె 'దేవయాని'-వృషపర్వుడు అనే రాక్షస రాజు కుమార్తె 'శర్మిష్ఠ' అనే ఇద్దరు భార్యలు.దేవయానికి 'యదువు' (యదువంశం మూలపురుషుడు) 'తుర్వసుడు' జన్మించారు. శర్మిష్ఠకు 'ద్రుహ్యుడు' 'అనువు' 'పుపురువు' అనే కుమారులు జన్మించారు.శుక్రుడు యయాతికి 'శుక్రరధం' అని తనపేరిట ఒక శక్తివంతమైన బంగారు రథాన్ని, 'అక్షయమగుఅమ్ములపొది' (ఎన్నిబాణాలు వాడినా ఎప్పుడూ నిండుగా ఉండేది) నిర్మించి ఇచ్చాడు. అలా యయాతి కి అందిన ఆరధం, అనంతరం కౌరవుల వారసత్వంగా వచ్చింది. అలా పరిక్షిత్తు నికుమారుడైన 'జనమేజేయుడు' 'గర్గముని' కుమారుని చంపడం వలన బ్రహ్మహత్యాపాతకానికి లోనై 'శౌనక'ముని ద్వారా అశ్వమేధ యాగంచేసి బ్రహ్మహత్యాపాతకంనుండి బైటపడ్డాడు.శుక్రరధం ఇంద్రునివద్దచేరింది.ఇంద్రుడు ఆరధాన్ని 'వసువు'కు ఇచ్చాడు. ఆ రధం అనంతరం 'బృహద్రథుడు '(జరాసంధుని)వద్దకు చేరింది.జరాసంధుని సంహరించిన 'భీముడు' ఆరధాన్ని శ్రీకృష్ణునికి కానుకగా ఇచ్చాడు. ఆ శుక్రరధానికి శ్రీకృష్ణుడు ఆరధానికి శైబ్య, సుగ్రీవ ,మేఘపుష్ప , బలాహక అనే అశ్వలతో సిధ్ధం చేసుకుని "దారకుని రధసారధిగా చేసుకున్నాడు , ఇంకా సూర్యుని రధానికి గాయత్రి, బృహతి, ఉష్ణి, జగతి, త్రిష్టుభ, అనుష్టుభ, పంక్తి అనే గుర్రాలు ఉంటాయి. మరియు చంద్రుని రధానికి యజులు, కండమానాలు, వృష, వాజిన్, నర, హయ, ప్రసిద్ధులు, గవిష్ణు, హంస" అన్నాడు. బ్రహ్మయ్య ఇచ్చిన వివరణతో త్రుప్తి చెందిన అందరూ నింద్రకు ఉపక్రమించారు.
 

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Atha sommu alludu danam
కాశీ ప్రయాణ కథలు - అత్తసొమ్ము అల్లుడు..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Anthuleni rahasyam gaa mighilina minchesot mystery house
అంతులేని రహస్యం - వించెస్టర్...
- డా:సి.హెచ్.ప్రతాప్
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్