తెలుగుపాట తానతందాన(కవిత) - యు.వి. రత్నం

అచ్చుల హల్లుల కలగాపులతో,
స రి గ మ రాగం పలికేభాష              ||అచ్చు||

కొసరు,కొసరి, తానంపలికే,
విభక్తిప్రత్యయం నిండిన భాష           ||అచ్చు||

ఉగ్గుపాలతో.అమ్మనేర్పిన
యాసలపలుకులఅమ్మభాష           ||అచ్చు||

త్రిలింగదేశపు కవి త్రయంతో
వేలుగుచూపినా జ్ఞానపు భాష         ||అచ్చు||

ఉపనిషత్తులాభగద్గీతలా,
ఆద్యాత్మిక పా టం ఇచ్చేభాష         ||అచ్చు||

వందేమాతర గీతంలాగా
మూడు రంగుల ఝండా లాగ
త్రిలింగ దేశపు భాషే తెలుగు       ||అచ్చు||

ఖండాంతరాలప్రయాణాలలో
సముద్రాలూ దాటినభాష            ||అచ్చు||

ఓడలపైనాగోడలపైనా,
పశ్చిమ ఉత్తర దిక్కులలోనా
నిండిన,పండినఉజ్వల భాష,         ||అచ్చు||

అన్యభాషల అక్కున చేరిచి
తనలోనింపినభాషే తెలుగు,            ||అచ్చు||

తెలుగేకాదా “ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్”  ||అచ్చు||                   

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం
Vikarnudi patra ouchityam
వికర్ణుడి పాత్ర ఔచిత్యం
- సి.హెచ్.ప్రతాప్
సిని నారదులు.12.
సిని నారదులు.12.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు