మీ పలుకు - పాఠకులు

mee paluku

గోతెలుగు.కామ్ మొదటి సంచిక అదుర్స్! ఇందులో బాపు గారి బొమ్మ చాలా  బాగుంది. నేను ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి ఢిల్లీ  లో ఉంటున్నాను. సాధారణంగా మాకు ఆంధ్ర భవన్ కి వెళ్తే గాని తెలుగు పత్రికలు దొరకవు. ఈ అంతర్జాల పత్రిక మాకు వరం లాంటిది. మా లాంటి పాఠకులను  దృష్టిలో పెట్టుకొని మీరు చేసిన ఈ కృషిని అభినందిస్తున్నాను. ఈ రోజుల్లో అన్ని తెలుగు ఛానెల్ లో ప్రతి యాంకరు తెలుగుని ఖూని చేస్తున్నారు. దయచేసి మీరు దీన్ని emphasize చేయగలరని నీ మనవి.

---రవి కుమార్, న్యూ ఢిల్లీ 
 

'గో తెలుగు.కామ్' చాలా బాగుంది. వేరే అంతర్జాల తెలుగు పత్రికలతో పోలిస్తే ఈ పత్రిక పదహారణాల తెలుగు అమ్మాయిలా ముచ్చటగా ఉంది. స్వాతి లో ఈ పత్రిక ఏడ్ చూడగానే అంతర్జాల తెలుగు పత్రికల లిస్టు కి ఇంకోక సంఖ్య పెరిగిందని అనుకున్నాను. కానీ మొదటి సంచికని చూడగానే నా అభిప్రాయం మారింది. మిగతా అన్ని పత్రికలు ఒకవైపు నిలిస్తే గో తెలుగు. కామ్ మాత్రం ఒక వైపు నిలుస్తుంది.
--- లాస్య రామకృష్ణ 


అంతర్జాలం లో మహేంద్రజాలం సృష్టించిన "గోతెలుగు" కి శుభాకాంక్షలు. సీరియల్ కూడా ప్రచురించండి
--- బొప్పన రమణి, రాజమండ్రి .


మా అందరికి చక్కటి తెలుగు పత్రిక అందించిన గోతెలుగు వెలుగు ప్రకాశిస్తూ వుండాలని, ప్రతీవారం ఎదురుచూసేలా చేస్తుందని ఆశిస్తున్నాను
---సతీష్ తోండేపు, నార్త్ కరోలోన, అమెరికా

బాపూ గారి ముఖ చిత్రం బాగుంది. గొతెలుగు.కామ్ మొదటి సంచిక చాలా బాగుంది. ఇలాగె అనేక సంచికలు ప్రచురించాలని అకాంక్ష.
---కొండేపల్లి చెంగాళ్రాయ రెడ్డి  


పత్రికను ప్రమోట్  చేస్తూ 'సిరాశ్రీ' గారు రచించిన, గజల్ శ్రీనివాస్ గారు పాడిన తేనెలొలుకు తెలుగు పాట కర్ణపేయంగా ఉంది.
---టీవీయస్.శాస్త్రి 

ఎడిగారికి, మీ పత్రిక చూశాను. చాల అందంగా నాజూకుగా అందమైన అమ్మాయిలా ఉంది.  కధలు బావున్నాయి. మంచి కమర్షియల్ సీరియల్స్ వెయ్యండి. ప్రఖ్యాత రచయితల రచనలే కాకుండ వర్ధమాన రచయితల రచనలు కూడా వేసి ప్రోత్సహించండి.  మీ పత్రిక మంచి పేరు సంపాదించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మీకు మరోసారి నా అభినందనలు.
---కోడగుంట వెంకటేష్

ఈ పత్రిక విహంగ వీక్షణం చేసాను. బాగుంది.మీ పత్రిక మాలాంటి వారికి మంచి ప్రోత్స్తహకరంగా వుంటుంది అని ఆశిస్తున్నాను. Best compliments.
--పివిఆర్ మూర్తి

ఈ పత్రిక బాగుంది. కార్టూన్లు బాగున్నాయి.
--యస్ వి శివసుబ్రహ్మణ్యం

 


 

మరిన్ని వ్యాసాలు

ఫతేపూర్ సిక్రి.
ఫతేపూర్ సిక్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Taj Mahal - Wonders of the world
తాజ్ మహల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మొధెరా సూర్య దేవాలయం.
మొధెరా సూర్య దేవాలయం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
హవామెహల్ .
హవామెహల్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Cine geethala rachayitrulu
సినీ గీతాల రచయిత్రులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Social media lo nakilee profile patla apramattata
సోషల్ మీడియాలో అప్రమత్తత
- సి.హెచ్.ప్రతాప్