మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోను,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర లోని జిల్లాలోని ఒక జిల్లా శ్రీకాకుళం. దానికి రో పేరు 'సిక్కోలు'అని కూడా వ్యవహారిస్తారు. ఆ జిల్లా గురించి కధల రచయిత మాటల్లో చెప్పాలంటే "సిక్కోలు వెనుకబాటుతనం జీవించడంలోనే కానీ నీతికి,నిజాయితీకి,స్నేహనికి,సంస్కృతికి కాదు."ఈపుస్తకం లో ఉన్న100 కధలు అవి నిరూపించాయి. సిక్కోలు మాండలికం లోరాసిన ఈ కధలు అ అందరినీ అలరిస్తాయి, ఆనందింపచేస్తాయి. రచయిత స్వగ్రామం టెక్కలి దరి గూడెం. కావడంతో "సిక్కోలు ఆట,పాట,చదువు,సంధ్య, అలవాట్లు, గ్రహపాట్లు,దాపరికం లేకుండా చేసిన అక్షర ప్రయత్నమే ఈ సిక్కోలు కధలు" కాబట్టి ఈ కధలు 'కట్టు కధలు'ఎంత మాత్రం కాదు. . బాల్య,కౌమార, యౌవన జీవితాన్ని చూపించారు.ఋడ్డిగాడు,లక్ష్మీ, రామిగాడు లాంటి పాత్రలు బాల్యాన్ని చూపిస్తాయి. సిక్కోలు ప్రజల ఆచార వ్యవహారాలకు నిలువు ట్టద్దం ఈ కధలు అటు భాష పరంగానూ, ఆచార వ్యవహారాలు అధ్యయనం చేసేవారికి ఈ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుంది.