స్వయం కృషి - B.Rajyalakshmi

Swayam krushi

వెంకట్ బస్సు లో జనాన్న్ని దాటుకుంటూ చివర్లో వున్న ఒక పెద్దాయన పక్కన సిటీలో కూర్చున్నాడు . బస్ తొందరగా బయ ల్దేరితే బాగుండనుకున్నాడు . సెలవుల్లో యెప్పుడూ యిదెబస్సులో యింటికెళ్లేటప్పుడు సంతోషంగానూ .తిరిగి వెనక్కి వెళ్లేటప్పుడు దిగులూ వుండేది . ఇప్పుడు దిగులూ లేదు ,సంతోషమూ లేదు ,కానీ యేదో మొండి ధైర్యం మాత్రం వుంది .

బస్ ముందుకు కదిలింది . హాయిగా వూపిరి పీల్చుకున్నాడు . వెంకట్ హైదరాబాద్ లో ప్రభుత్వ హాస్టల్ లో వుండి చదువుకుంటున్నాడు . అమ్మా ,నాన్నా పల్లెటూళ్లో వ్యవసాయం చేసుకుంటున్నారు . ఏడాది క్రిందట ఆడపిల్ల పెళ్లి చేసారు . కొన్ని అప్పులయ్యాయి . పంట రాబడీ అంతంత మాత్రమే . అల్లుడు హైదరాబాద్ లో ఆటో నడుపుతాడు . వెంకట్ అక్కయ్య కమల ,తమ్ముణ్ణి పండగలకు రమ్మంటుంది . వెంకట్ అప్పుడు హాస్టల్ వుండకుండా అక్కయ్య దగ్గర గడిపేస్తాడు . బావ రమేష్ వెంకట్ తో సరదాగా వుంటాడు . ఆటోలో తీసికెళ్లి అన్నీ చూపిస్తాడు . అక్కయ్య ,బావ మొదట్లో తనల్ని చక్కగా పలకరించేవాళ్లు కానీ గిరీశం వచ్చినప్పటినించీ సూటిపోటి మాటలు మొదలయ్యాయి వాడుకూడా చదువుకోవడానికే వచ్చాడు అయితే హాస్టల్ లో వుండడు . అక్కయ్యా వాళ్లింట్లో వుంటాడు
వెంకట్ ,గిరీశం .ఒకే బళ్లో ఒకే క్లాసులో చదువుకుంటున్నారు . అయితే గొడవ యెక్కడ మొదలయ్యిందంటే గిరీశం చదువుకోకుండా ,సరిగా బడికి వెళ్లకుండా అల్లరిచిల్లరగా తిరుగుతుంటే వెంకట్ బావకు చెప్పాడు . గిరీశాన్ని బావ బాగా కొట్టాడు ,వెంకట్ ని హాస్టల్ వద్దనీ తనింట్లోనే వుండమని అలాగే రోజూ గిరీశానికి చదువులో తెలియవనివి చెప్పమని చెప్పాడు . వెంకట్ అక్కయ్యా ,బావా మాటలు కాదనలేక హాస్టల్ వదిలేసి బావ దగ్గరకు వచ్చాడు . అప్పటినించీ వెంకట్ కి సమస్యలు మొదలయ్యాయి .
గిరీశం యెప్పుడూ యేదో ఒకతగువు పెట్టుకునేవాడు . వెక్కిరించడం ,నోటుబుక్స్ చింపెయ్యడం చేసేవాడు . అక్కయ్యకు చెప్తే ఏం మాట్లాడేదికాదు ,పైగా వెంకట్ నే సర్దుకుపొమ్మనేది . అక్కయ్యకు బావంటే భయం . బావకు కోపం వస్తే ఇల్లంతా పెద్ద రణరంగం . అది అలుసు చూసుకుని గిరీశం మరీ రెచ్చిపోయాడు . ఇప్పుడు ఆ యింట్లో చదువుకున్నా పడే చాకిరీ యెక్కువయ్యింది . అక్కయ్య చీటికీ మాటికి విసుక్కోవటం ,బావ పెడసరం మాటలూ మొదలయ్యాయి . పొద్దున్నె నీళ్లు పట్టాలి . పాలప్యాకెట్లు తేవాలి . బజారెళ్లి సరుకులు తేవాలి . మొత్తానికి బడికెళ్లేదాకా వూపిరి సలపుకుండా గాడిదచాకిరీ చెయ్యాలి . చివరికి హడావిడిగా అన్నం తిని బడికి పరుగెత్తాలి . ఒక్కోరోజు రాత్రిపూట పడుకుని పెద్దగా ఏడ్చేసేవాడు . గిరీశానికి యిదంతా మహా ఆనందం గా వుండేది . వెంకట్ ని పట్టించుకోవడం మానేసారు . ఇప్పుడు వెంకట్ తన బాధలు యెవరికీ చెప్పుకోలేదు ,చెప్పినా యెవరూ పట్టించుకోరు .
"అందరూ టికెట్లు తీసుకున్నారా ? యింకా యెవరైనా తీసుకోవాలా ?కండక్టర్ కేక తో వెంకట్ ఆలోచనలకు తెర పడింది . ఎవరూ మాట్లాడలేదు . బస్ వేగం పుంజుకుంది . కిటికీ లోనించి వచ్చే చల్లగాలికి అందరూ నిద్ర లోకి జారుకుంటున్నారు . వెంకట్ మాత్రం యేదో బాధతో కళ్లుమూసుకున్నాడు . అక్కయ్య నిన్న వుదయం అన్న మాటలు పదే పదే జ్ఞాపకం వస్తుంటే యేడుపు వస్తున్నది . చెయ్యని దొంగతనం తన మీద వేసారు . బావ పర్సులో అయిదు వందలు కనిపించడం లేడని గిరీశాన్ని అడిగితె వాడు అమాయకం గా మొహం పెట్టి తన పేరు చెప్పాడు .అక్కయ్యా ,బావా తన పుస్తకాలన్నీ వెతికితే నిజంగానే అయిదువందల నోటు దొరికింది . తను తియ్యలేదని చెప్పినా యెంత చెప్పినా యెవ్వరూ నమ్మలేదు . గిరిసమే యీ పని చేసాడు కానీ తను చెప్పినా యెవ్వరూ నమ్మరు .అసలు తనెందుకు తీస్తాడు ? అక్కయ్యకు తెలియదా తనెవ్వరో ?కానీ అక్కయ్యా ,బావా యిద్దరూ బాగా కొట్టారు . తనకు అక్కడ వుండాలనిపించలేదు . తన స్నేహితుడి దగ్గర డబ్బులు తీసుకుని బస్ స్టేషన్ కి వచ్చాడు .
, బస్సు వూళ్లో ఆగింది . వెంకట్ దిగాడు ,చీకటి పడుతున్నది . నాన్న యేమంటాడో ,అమ్మ యేమంటుందో ,అన్నయ్య యేమంటాడో అన్నీ తల్చుకుంటుంటే వెంకట్ కి గుబులుగా వుంది . బావ నాన్నకు ఫోన్ చేసేవుంటాడు . వెంకట్ యింటికి వెళ్ళేటప్పటికీ నాన్న లేడు ,అమ్మ పెరట్లో పని చేసుకుంటున్నది . అమ్మను వాటేసుకుని భోరున యేడ్చేసాడు . "నేను యిక్కడే ఉంటానమ్మా " అంటూ అమ్మను గట్టిగా పట్టుకున్నాడు " ఏమయిందిరా ,.వద్దులే బంగారూ వెళ్లకు" అంటూ అమ్మ తల నిమిరింది . వెంకట్ తన కష్టాలన్నీ చెప్పేసాడు . ఇంతలో వెంకట్ తండ్రి అప్పయ్య వచ్చాడు . చాలా గంభీరం ,కోపిష్టి మనిషి . భయం తో వెంకట్ తలుపు చాటున దాక్కున్నాడు . "వెధవా దాక్కుంటే కనుక్కోలేననుకున్నావా ,చదువుకొమ్మని పంపితే మా పరువు తీసావు కదరా ! చెప్పా పెట్టకుండా వచ్చేస్తే బావ ఫోన్ చేసాడు కాబట్టి తెలిసింది . " అంటూ వెంకట్ ని చెంప మీద కొట్టాడు .
"ఇప్పుడే వచ్చాడండి ,అక్కడ వాళ్లేదో విసుక్కున్నారుట "అన్నది అమ్మ .
" విసుక్కుంటే
వచ్చెయ్యడమేనా ? తాట వొలుస్తాను రేపు దిగబెట్టి వస్తాను " అంటూ అప్పయ్య విసుక్కుంటూ బయటకు వెళ్లాడు వెంకట్ మళ్ళీ అమ్మను పట్టుకుని బావురుమన్నాడు . కానీ ఆ యింట్లో అప్పయ్య మాటంటే శిలాక్షరం . అమ్మ చెప్పినా వినడు .
--------------------------------------------------------------------------------------------------------------------
తెల్లారింది . వెంకట్ ని లేపి తయారవమన్నాడు అప్పయ్య . అమ్మ చేత్తో వండిన రుచి రుచి భోజనం కడుపునిండా తిన్నాడు . మొండికేస్తే ప్రయోజనం లేదని తెలిసింది . అక్కయ్య యింటికి వెళ్లకూడదని గట్టిగా అనుకున్నాడు కానీ నాన్న మళ్లీ దిగబెడ్తున్నాడు . తనను యెవరూ అర్ధం చేసుకోవడం లేదు . తలవంచుకుని నాన్న తో బయల్దేరాడు .
కమల గుమ్మం లోనే "నాన్నా వీడు మాటమాత్రం కూడా చెప్పకుండా వెళ్లాడు . బొత్తిగా భయం ,భక్తి లేవు ,అయినా చెప్పాల్సిన అవసరమేముందిలే !చేతిలో డబ్బులున్నాయిగా ?" అన్నది అక్కసుగా . వెంకట్ తను ఏం చెప్పినా నమ్మరని మౌనంగా తల దించుకున్నాడు . ఆ రాత్రే వెంకట్ తండ్రి తిరిగి వెళ్లిపోయాడు . ఇప్పుడు వెంకట్ యింట్లో వాళ్లకు మరీ చులకనయ్యాడు . తిట్లూ ,చివాట్లూ ,చాకిరీ మరింత యెక్కువయ్యింది . గిరీశం వెంకట్ ని యెగతాళి చేస్తూ వుంటాడు . ఎందుకంటె ఆ యింట్లో దొంగవెధవ .
వెంకట్ యెన్ని కష్టాలున్నా చదువు మాత్రం మానలేదు . పగలల్లా చాకిరీ చేసినా రాత్రుళ్లు నిద్రపూకుని చదువుకునేవాడు . పదో తరగతి మంచి మార్కులతో ప్యాసయ్యాడు . అక్కయ్య నాన్న దగ్గరికి వెళ్లిపొమ్మని చెప్పింది . ఆ యింట్లో స్థానం లేదని తెలిసింది . అమ్మా ,నాన్న దగ్గరికి వెళ్లకూడదనుకున్నాడు .అందుకే అక్కయ్యా ,బావగారితో చెప్పి మరీ బయల్దేరాలనుకున్నాడు .
' మీరు యిన్నాళ్లు నన్ను దయతో చదివించారు . ఎక్కడికయినా వెళ్లి ఎదైనా పని వెతుక్కుంటాను "అన్నాడు వెంకట్ .
"వెళ్లవయ్యా వెళ్లు ఇక్కడ మనతిండెక్కువయినట్టుంది 'అన్నాడు బావ విసురుగా . వెంకట్ మాట్లాడలేదు . ఇప్పుడు వెంకట్ స్వేచ్ఛాజీవి !ఎక్కడికి వెళ్లాలి ?వెంకట్ తిరిగీ తిరిగీ చివరికి దీపాలు పెట్టె సమయానికి ఒక హోటల్ లో సర్వర్ గా చేరాడు . వసతి అక్కడే ,రెండుపూటలా భోజనం అక్కడే !వెంకట్ హాయిగా వూపిరి పీల్చుకున్నాడు . వెంకట్ కి ఒకటి అర్ధం అయ్యింది . పట్టుదల ,ఓర్పు ,కష్టపడే గుణం వుంటే జీవితం లో యేదైనా పొందొచ్చు . బ్రతకటానికి ఒక ఆధారం దొరికింది .
మంచితనం తో అందరినీ ఆకట్టుకున్నాడు . యజమాని దగ్గర నిజాయితీ పరుడిగా పేరు తెచ్చుకున్నాడు . కొంచెం స్థిరపడ్డ తర్వాత ప్రైవేటుగా డిగ్రీ చదవడం మొదలు పెట్టాడు .హోటల్ యజమాని పొరుగూళ్లో మెడికల్ షాపు తెరిచాడు . వెంకట్ యిప్పుడు చదువుకున్న యువకుడు . ఇంగ్లీషు బాగా చదవగలడు ,వ్రాయగలడు ,మాట్లాడగలడు . అన్నింటినీ మించి నియమ బద్ధత ,ఓర్పు వున్నవాడు . కాబట్టి హోటల్ యజమాని వెంకట్ ని మెడికల్ షాపు వాటాదారుగా చేర్చుకున్నాడు . షాపు నిర్వహణ పూర్తిగా వెంకట్ కి అప్పగించాడు . వెంకట్ యింత వున్నత స్థాయికి రావడానికి సుమారు పది సంవత్సరాలు పట్టింది . వెంకట్ రెండు గదుల యిల్లు అద్దెకు తీసుకున్నాడు . కంటినిండా నిద్ర ,నమ్ముకున్న నిజాయితీ జీవితం వల్ల వెంకట్ అందమైన ,ఆరోగ్యకరమైన యువకుడిగా తయారయ్యాడు . తండ్రి మరణించినప్పుడు ఒకసారి వూరికి వెళ్లాడు . అమ్మ అన్నయ్యతో పల్లెలో వుండిపోయింది .
ఒక రోజు ఒక వ్యక్తి కంగారు కంగారుగా షాపు లోకి వచ్చాడు . అప్పుడు వెంకట్ షాపు వెనుక గదిలో వున్నాడు . కౌంటర్ దగ్గర ఒక కుర్రాడిని పెట్టాడు . వచ్చిన వ్యక్తి కుర్రాడితో "బాబూ ---- నా భార్య కు అత్యవసరం రక్తం యెక్కించాలి ,లేకపోతె నాకు దక్కదు . నేను ప్రక్కవీధిలో నర్సింగ్ హోమ్ లో చేర్చాను . బి పాజిటివ్ గ్రూప్ !మీకు యెవరైనా తెలుసా ?" వగరుస్తూ ఆయాసం తో అడుగుతున్నాడు . కుర్రాడు వెంకట్ ని పిలిచాడు .
ఆ వ్యక్తి వెంకట్ కి నమస్కరించాడు . కుర్రాడు "యీయన మా యజమాని వెంకటేశ్వరరావుగారు "అంటూ పరిచయం చేసాడు . ఆ వ్యక్తి వెంకట్ బావగారు రామేశం . కానీ రామేశం తన కంగారూ ,బాధతో వెంకట్ ని గుర్తు పట్టలేదు . "బావగారూ " అన్నాడు వెంకట్ . రామేశం ఆశ్చర్యంగా చూసాడు .
"బావా ----- పద పద ముందు అక్కయ్యకు రక్తం యివ్వాలి నా రక్తం గ్రూప్ అదే "అంటూ నోరెళ్లబెట్టి చూస్తున్న రామేశాన్ని భుజం మీద తట్టి నర్సింగ్ హోమ్ కి పరుగెత్తాడు . క్షణాల్లో అక్కయ్యకు రక్తం యెక్కించారు . వెంకట్ అక్కడే అక్కయ్య దగ్గర కూర్చున్నాడు .
రామేశానికి అంతా కలలాగా వుంది . ఒకనాడు దొంగ వెధవ అని తిట్టి ,నిర్దాక్షిణ్యంగా వెంకట్ యింట్లోనించి తరిమేశాడు . ఆ తర్వాత కనీసం మంచీచెడూ కనుక్కునే ప్రయత్నం కూడా చెయ్యలేదు . ఈరోజు అదే వెంకట్ తన కుటుంబానికి ప్రాణదాతయ్యాడు . సిగ్గుతో కృంగిపోయాడు . కమల తమ్ముణ్ణి గుర్తు పట్టింది . రక్తదాత
తమ్ముడేనని తెలిసి కన్నీటిపర్యంతమయ్యింది .
మంచితనం ,సహనం , నిరంతర శ్రమ ,క్షమాగుణం మనిషిని వున్నత స్థాయిలో నిలబెడతాయి అన్న వాక్యానికి నిలువెత్తు తార్కాణం వెంకట్ !,

.

.వెంకట్ బస్సు లో జనాన్న్ని దాటుకుంటూ చివర్లో వున్న ఒక పెద్దాయన పక్కన సిటీలో కూర్చున్నాడు . బస్ తొందరగా బయ ల్దేరితే బాగుండనుకున్నాడు . సెలవుల్లో యెప్పుడూ యిదెబస్సులో యింటికెళ్లేటప్పుడు సంతోషంగానూ .తిరిగి వెనక్కి వెళ్లేటప్పుడు దిగులూ వుండేది . ఇప్పుడు దిగులూ లేదు ,సంతోషమూ లేదు ,కానీ యేదో మొండి ధైర్యం మాత్రం వుంది .

ReplyForward
.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి