వృక్షో రక్షతి రక్షిత: - PULLETIKURTI KRISHNA MOHAN

Vruksho rakshathi rakshitaha
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె.. పోతనామాత్యుని పద్యం మనసులో చదువుకుంటున్నారాయన. ఆందోళనగా ఉంది అతనికి, కూతుర్ని చూడడానికి మరో రెండు రోజుల్లో పెళ్ళి వారు వస్తున్నారని తెలిసినప్పటి నుండీ ఏమీ తోచడం లేదు, అమ్మయికి ఇదే మొదటి పెళ్లి చూపులు. అందం,చదువు, ఉద్యోగం ఉన్న అమ్మాయి గనుక కాదనే అవకాశమేలేదు. కానీ అన్నీ ఉన్నా కట్నాలు,లాంఛనాలు మాత్రం మామూలే కదా.
అబ్బాయి తండ్రి అమ్మాయిని ఎక్కడో చూశారట, మధ్యవర్తితో కబురు పంపారు,అతని మాటలు బట్టి అబ్బాయి వాల్లు చాలా స్థితి మంతులు అని అర్థం అయింది. ఎట్టి పరిస్థితిలో కూడా వదులు కో వద్దని మరీ మరీ చెప్పాడు. అమ్మాయి నచ్చి కబురు పంపారు కాబట్టి వారు కట్నం ఏమీ ఆడగక పోయినా, తన స్థోమతకు తగ్గట్టు ఎంతో కొంత ఇవ్వకపోతే బాగోదని అతని భయం.
ప్రైవేటు కాలేజ్‌ లో బాటనీ లెక్చరర్‌ గా చేసి రిటైర్‌ అయిన తరువాత ఇంకా ఎక్కడా ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఎంతమంది పిలిచినా వెళ్లలేదు.
అందువలన ఎన్నో ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదురైనా అన్నింటికీ తట్టుకుని నిల్చున్నాడు. ఉన్నంతలో ఒక్కగానొక్క అమ్మాయిని చక్కగా చదివించాడు. ఆమె హైదరాబాద్‌ లో టిసియస్‌ లో పనిచేస్తుంది.
‘‘ఏమండీ రాఘవరావు గారు’’ భార్య పిలిపుతో ఆలోచనలనుండి బయటకు వచ్చాడు. ఆమె అప్పుడప్పుడూ అలా ప్రేమతో పిలిస్తుంటుంది.
‘‘కాఫీ చేతికి అందిస్తూ ఏమిటాలోచిస్తున్నారు’’ అడిగింది.
‘‘మనమ్మాయి పెళ్లి ఖర్చుల గురించి’’ అతని మొహంలో ఎటువంటి భావాలు కనిపించడం లేదు.
‘‘ఇంకా వాల్లొచ్చి అమ్మాయిని చూడనైనా లేదు అప్పుడే పెళ్ళి ఖర్చుల గురించి ఎందుకంత ఆలోచన? అయినా అమ్మాయి పేరుమీద ఫిక్స్డ్‌ డిపాజిట్లు ఉన్నాయిగా’’ అంది.
‘‘ఒక వేళ నచ్చినట్టైతే వాళ్ళ స్థాయికి తగ్గట్టు చేయాలంటే ఈ డబ్బు సరిపోదు’’ మొబైలు చేతిలోకి తీసుకుంటూ అన్నాడు.
‘‘చూడండి.. ’’ ఏదో చెప్దామనుకొని ఆగిపోయిందామె ప్రతీ ప్రశ్నకు అతని దగ్గర సమాధానం ఉందని అమెకు తెలుసు.
‘‘వాళ్ళు ఇష్టపడి వచ్చారు కాబట్టి కట్నం పెద్దగా డిమాండ్‌ చేయకపోవచ్చు అలా అని మనం ఇవ్వడం మానేయంగా, మంచి సంబంధం అయితే వదల్లేము కూడా ’’ కృత నిశ్చయానికి వచ్చినవాడిలా ‘‘ఏదేమైనా మన ఆర్ధిక పరిస్థితి మొత్తం వాళ్ళకు చెప్పేద్దాం ’’
ఇంతకీ అబ్బాయి మంచి చెడ్డలు వాకబు చేశారా? ’’
అబ్బాయి కూడా ఏదో సాఫ్ట్వేర్‌ లో చేస్తున్నాడట,మనం కూడా ఎంక్వయిరీ చేద్దాం అందుకు ఒకడు ఉన్నాడు.
ఆమె కూడా ఆలోచనలో పడిరది.
ంంం
భూమిక. ఒక సారి చూస్తే కళ్ళు తిప్పకోలేనంత అందం ఆమెది. హైదరాబాద్లో టిసియస్‌ చేరి మూడు సంవత్సరాలైంది, మంచి పేకేజ్‌ తో పాటూ మంచి పేరు కూడా ఉంది.
జీవన్‌ అదే కంపెనీలో ఆమెకు జూనియర్‌ గా చేరాడు, అతనికి అక్కడ ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు కానీ అతని ఉద్దేశం వేరు, వీళ్లిద్దరి పరిచయం ఇప్పటిది కాదు, విశాఖపట్నంలో ఇద్దరూ ఒకే సారి ఇంజనీరింగ్‌ లో జాయిన్‌ అయ్యారు.
ఆమెకు మొక్కలంటే ప్రాణం, కాలేజ్‌ ప్రాంగణలో ఉన్న మొక్కలను సంరక్షించే బాధ్యత కూడా ఆమె తీసుకుంది స్నేహితుల పుట్టిన రోజుకు ఏదో ఒక మొక్కను బహుమతి గా ఇవ్వడం ఆమెకు అలవాటు. కాలేజ్‌ లో జరిగిన ఒక డిబేట్‌ లో డ్రగ్స్‌ కి వ్యతిరేకంగా ఆమె మాట్లాడిన విధానం చూసి చాలామంది ఆమెకు అభిమానులుగా మారారు, ముఖ్య అతిధులుగా వచ్చిన ఎమ్మెల్యే, కలెక్టర్‌ గారు సైతం ఆమెను అభినందిచారు అక్కడ మొదలైంది జీవన్‌ కు ఆమె మీద ఆరాధన.
ఆమె ఎక్కడకు వెళ్ళినా బాడీగార్డ్‌లా ఉండేవాడు ఆమె ఏనాడూ అనవసరంగా ఒక్క మాటకూడా ఎవరితోనూ మాట్లాడిరదిలేదు .ఆమె గురించి తెలిసిన కామన్‌ ఫ్రెండ్‌ రూప అతనితో సరదాగా అనేది ‘‘ నువ్వు ఆమె మనసు గెలిచే కంటే ఒక దేశానికి ప్రధాని కావడం ఈజీ.
‘‘కాలేజ్‌ లైఫ్‌ సంతోషంగా గడపాలన్నా, ఆ రోజులు ఒక మంచి జ్ఞాపకంలా మిగిలిపోవాలన్నా తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని ఎటువంటి వ్యామోహాలకు లోనూకాకూడదని ’’ తండ్రి చెప్పిన మాటలు ఆమె ను ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటాయి. కాలేజ్‌ చదువు పూర్తయిన తరువాత వెంటనే ఆమెకు సాఫ్ట్‌ వేర్‌ లో జాబ్‌ వచ్చింది అతను మాత్రం బ్రిడ్జ్‌ కోర్స్‌ చేసుకొని మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు, అయితే ఏనాడూ తనని ఇబ్బంది పెట్టే పని చేయలేదు కాబట్టి తనంటే సాఫ్ట్‌ కార్నర్‌ ఉండడంతోపాటూ అతన్ని కాదనడానికి ఒక్క కారణం కూడా తనదగ్గర లేదు. అతను కూడా ఇంట్లో ఒక్కడే కొడుకు అవ్వడం, తన ఇష్టానికి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. పరిచయం అయ్యి ఆరేడు సంవత్సరాలయినా ఆమెతో మాట్లాడిరది చాలా తక్కువ సార్లు. ఆమెకోసమే ఇక్కడ చేరాడు అది ఆమెకు తెలుసు.
‘‘ఇక్కడకీ వచ్చావన్నమాట ’’ గతం నుండి బయటకు వచ్చాడు జీవన్‌ ఎదురుగా రూప నవ్వుతూ కన్పించింది. అతనెందుకు ఇక్కడ చేరాడో ఆమెకు తెలుసు.
బేలగా ఆమె వైపు చూశాడు. ‘‘మరేం చేయమంటావ్‌ ఇన్నాళ్ళకు మళ్ళీ బాడీగార్డ్‌ జాబ్‌ వచ్చింది, దేశప్రధానిని ఎలాగూ కాలేను ’’ నామోషీగా అన్నాడు.
‘‘నీ లాంటి బాడీ గార్డ్‌ ని దేశ ప్రధాని కాకుండా నా ప్రయత్నం నేను చేస్తా ’’ అభయమిచ్చిందామె.
ంంం
రాఘవరావు ఇల్లు, సింహాచలం దగ్గర ప్రహ్లాదపురం ఏరియాలో ఉంది సుమారు ఎనిమిది సెంట్ల స్థలం లో విశాలమైన వాకిలి, అందులో పూల మొక్కలతో పాటూ కొన్ని ఔషధ మొక్కలు, వాటితో పాటుగా అరటి, మామిడి చెట్లు కూడా ఉన్నాయి. చర్మవ్యాధులు తగ్గించే అలోవెరా,మనసిక ప్రశాంతతను కలిగించే అశ్వగంధ, ఉబ్బసానికి తగ్గించే జాటామాంసి, కిడ్నీల పనితీరు పెంచే ఉత్తరేణి అబ్బబ్బా పెరటి మొక్క వైధ్యానికి పనికి పనికిరాదంటారు కానీ పెరటి మొక్క వైధ్యానికే ఇక్కడ.మధుమేహాన్ని తగ్గించే ‘ఇన్సులిన్‌ ప్లాంట్‌’ కోసం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. తండ్రి ద్వారా వచ్చిన ఈ ఇలు,్ల ఎమ్మెల్యే గారు ఇచ్చిన ‘‘వృక్షమిత్ర ’’ బిరుదు తప్ప ఇంకా ఏ ఆస్తీ తన దగ్గర లేదు.
గేటు దగ్గర అలికిడికి ఆలోచనలనుండి బయటకు వచ్చారు. ఎదురుగా ఆంజనేయులు? అతని వయసు ఒక యాబై ఉంటుంది ఏదో ప్రైవేట్‌ కొంపెనీలో జాబ్‌ చేస్తూ, కాళీ సమయాల్లో కలెక్టర్‌ గారు తనకు అప్పజెప్పిన ప్లాంటేషన్‌ ప్రోగ్రామ్‌ లో సాయంగా ఉంటాడు.

* * *

‘‘రండి సార్‌’’ సాదరంగా ఆహ్వానించాడు. మీకు వీలైతే ఈరోజు సింహాచలంలో దేవగన్నేరు మొక్కలు ఇచ్చి రావాలి మీరు తోడుగా వస్తారా?
‘‘అలాగే సార్‌’’ అన్నాడు గానీ అతనికి కొంచం ఇబ్బందే.. రాఘవరావు గారు బ్యాటరీ స్కూటర్‌ మాత్రమే వాడతారు. ఈ బ్యాటరీ స్కూటర్‌ తో ఎప్పటికి వెళ్ళేది ఎప్పటికి వచ్చేది.
‘‘ మరేం పరవాలేదు లెండి కొండమీదకు వెళ్లక్కరలేదు కిందకు వచ్చి వాళ్ళే కలెక్ట్‌ చేసు కుంటారు ’’ అభయమిచ్చారు.
‘‘కాఫీ తీసుకోండి అన్నయ్య ’’ జానకి ఆంజనేయులు చేతికి అందించింది. తనకి కూడా ఇస్తుందేమోనని చూశారు. ఆయనవైపు చూస్తూ ‘‘మూడు ఒక కాఫీలు అయ్యాయి ఇక చాలు ’’ చిన్ననవ్వు నవ్వి అంది,సాయంత్రం లోగా ఇంకో రెండు కాఫీ లు తాగుతారని ఆమెకు తెలుసు . ఆయనకు ఉండే ప్రేమ మొక్కలు, కాఫీ, భూమిక..
‘‘జానకీ’’ అన్న పిలుపుతో.
‘‘అవును జానకి కూడా’’ మనసులో అనుకుంది.
‘‘సింహాచలం దేవస్థానం వాళ్ళు కొన్ని మొక్కలు అడిగారు ఇచ్చి వస్తాం’’
‘‘అలాగే ఈ పారిజాత పూలదండ కూడా స్వామివారికి ఇచ్చి రండి’’
చక చకా ఇద్దరూ ఒక బాస్కెట్‌ లో మొక్కలు సర్ది దాన్ని స్కూటర్‌ ముందుకు పెట్టి బయలుదేరారు. ఎంత ట్రాఫిక్‌ ఉన్నా సరే వాతావరణం మబ్బు పట్టి చల్లగా ఉండడం వలన ప్రాణానికి హాయిగా ఉంది. శ్రీనివాస నగర్‌ మీదుగా వెల్తూ విషయమంతా అంజనేయులకి చెప్పారు .
మౌనంగా విన్నాడు. తనకు కేవలం సమాచారం ఇచ్చారు కానీ చిన్న సహాయం కూడా ఎవరి దగ్గరా పొందంని అతనికి తెలుసు.
ంంం
వాళ్ళు వెళ్ళిన వెంటనే లోపలి గదిలోకి వెళ్ళి లేప్టాప్‌ తీసి ఏంజెల్‌ బ్రోకింగ్‌ స్టాక్‌ మార్కెట్‌ యాప్‌ లోకి లాగిన్‌ అయ్యింది. కరోనా పుణ్యమాని భూమిక వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ లో ఉన్నప్పుడు స్టాక్‌ మార్కెట్‌ గురించి కొంత అవగాహన కల్పించింది అప్పటి నుండి వేలైనప్పుడల్లా మోటర్స్‌ స్టాక్స్‌ లో ఎంతో కొంత ఇన్వెస్ట్‌ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఇంతింతై వటుడిరతై అన్న చందాన సుమారు మూడు లక్షల వరకూ దాంట్లో ఉంది, లాభాలలో ఉంది కాబట్టి పెళ్లి ఖర్చులకు మొత్తం తీసేసి ఎంతో కొంత ఆయనకు సాయంగా ఉండాలని అమె తపన. ఇప్పుడు ఆమెకు కొంత ఊరట గా ఉంది.
ంంం
అబ్బాయి తల్లిదండ్రులు రానే వచ్చారు, పెళ్లి కొడుకుతో పాటూ మొత్తం ఎనిమిది మంది వచ్చారు, వారిలో మధ్య వర్తి కూడా ఉన్నాడు.
‘‘నమస్కారం రండి రండి ’’ సాదరంగా ఆహ్వానించారు.
ముందే కబురు పెట్టడం వలన భూమిక కూడా సెలవు పెట్టి వచ్చింది.
కుర్చీలో కూర్చున్న జీవన్‌, వాళ్ళ తండ్రి ఇంటినంతటినీ పరిశీలగా చూస్తున్నారు.
రఘవరావు గారికి టెన్షన్‌ మరింత పెరిగింది.పెళ్ళి కొడుకు ఛామన ఛాయలో సుమారు ఆరడుగులు ఉంటాడు.అమ్మయికి తగ్గట్టే ఉన్నాడు, తండ్రి తెల్లగా పీలగా పొడుగ్గా ఉన్నాడు. ఈ వయసులో కూడా తలపై జుట్టు ఉందంటే ముచ్చటగా ఉంది.
* * *
ఇతను విశాఖపట్నంలో ఒక ఇండస్ట్రీ నడుపుతున్నాడంటే మామూలు విషయం కాదు.
బయట ఉన్న కారును బట్టి లోపలున్న వీరి తాహతు అర్ధం చేసుకోవచ్చు..
‘‘బావగారు అమ్మాయి మాఅందరికీ నచ్చింది ఇక ..’’ ఆయన ఎదో చెప్పబోతున్నాడు
ఆయన మాట పూర్తవ్వకముందే అందుకున్నారు .
‘‘అయ్యా ! క్షమించాలి నేను ఒక సామాన్య మైన వ్యక్తిని, మీ స్థాయికి తగినవాడిని కాదు నా దగ్గర ఉన్నదంతా ఇచ్చినా మీకు సరి తూగను’’ అతని గొంతులో ఆర్తి అక్కడున్న అందరికీ అర్ధమయింది.
ఆయన చిన్నగా నవ్వుతూ ‘‘చూడండి బావగారూ మీరే అన్నీ ఊహించుకుంటే ఎలా, ముందు నేను చెప్పేది వినండి. నేను ఈ రోజు శాంతా ఆగ్రో ఇండస్ట్రీస్‌కి ఎం.డి కావచ్చు కానీ ఒకప్పుడు నేను సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాను. మేము ఇద్దరు అన్నదమ్ములం పెద్దవాడు వరప్రసాద్‌, హైదరాబాద్‌ లో ఒక ఫార్మా కంపెనీ పెట్టి కొన్ని వేల మంది కి ఉపాధి కల్పిస్తున్నాడు. మా తండ్రి గారు నా పదవ ఏట మరణించారు. మా తల్లి శాంతమ్మ గారు ఏమీ చదువుకోలేదు కానీ ఆమెకు చదువు విలువ, మనిషి విలువ తెలుసు, ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం కానీ పేదరికం మా చదువులకు ఏనాడూ అడ్డు రాలేదు పరీక్ష ఫీజు కోసం అమ్మ గాజులు ఒక్కొక్కటీ అమ్మడం నాకు తెలుసు. తన గురించి ఎప్పుడూ ఆలోచించేది కాదు, ‘‘మంచి సమాజ నిర్మాణంలో మనంకూడా ఒక భాగమవ్వాలి ..’’ అనేది.
అతను చెప్పిన మాటలు ఒక పాటంలా వింటున్నారంతా
‘‘ కొన్ని సంవత్సరాల క్రితం ఓ కాలేజ్‌ లో జరిగిన కార్యక్రమానికి నన్ను గెస్ట్‌ గా పిలిచారు అప్పుడు మీ అమ్మాయి సభా వేదికపై మాట్లాడిన మాటలు ఇంకా గుర్తున్నాయి ‘‘మంచి సమాజ నిర్మాణంలో మనంకూడా ఒక భాగమవ్వాలి ..’’ మల్లీ ఆమె నోట మా అమ్మ మాట. ఆయన కళ్ళలో కన్నీటి చెలమ. సంబంధం కలుపుకోవడంలో డబ్బు పాత్ర అసలు లేదని నా నమ్మకం. నాకు కావలసింది డబ్బు కాదు సమాజానికి హితవు చేసేవాళ్ళతో ప్రయాణం చేయడం. ముగించాడు. ంంం
అత్తింటిలో అడుగు పెట్టింది భూమిక, కొత్తకోడలికి వంట అప్పగించారు అత్తగారు, మామగారి ఆరోగ్యానికి మంచిదని వస్తూ వస్తూ తనతో పాటూ తెచ్చిన ‘ఇన్సులిన్‌ ప్లాంట్‌’ ఆకులతో నెయ్యి తాళింపు వేసి పచ్చడి చేసి పెట్టింది.
అత్తగారి ఆనందానికి అవధులు లేవు. తనతో పాటుగా ఆయన ఆరోగ్యం పై శ్రద్ధ చూపే ఇంకో మనిషి ప్రవేశించిందని .
మామగారు ఆలోచనలో ఉన్నారు త్వరలో విశాఖపట్నం ఐటి హబ్‌ గా మారబోతోంది, కొడుకు కోడలు సాఫ్ట్‌ వేర్‌ గనుక అమ్మ పేరు మీద తానే ఒక ఐటి కంపెనీ పెట్టి .. మరింత మందికి ఉపాధి కల్పించవచ్చని.
ంంం
మామిడి చెట్టు నీడలో కూర్చున్న రాఘవరావు గారు బీపీ మోనిటర్‌ తో చెక్‌ చేసుకున్నారు.నార్మల్‌ గా ఉంది. మనసు ఉల్లాసంగా ఉంది తాను సమస్యగా భావించింది ఇంత ఈజీగా పరిష్కారం అవుతుందని అనుకోలేదు.
‘‘జానకీ..’’ పిలుపు అర్ధం చేసుకొని రెండు కాఫీలు తెచ్చిందామె. ఒక చేత్తో బట్టతల నిమురుకుంటూ ఇంకోచేత్తో కాఫీ గ్లాస్‌ పట్టుకొని పసిపిల్లల్లా అపురూపంగా పెంచిన మొక్కలవైపు లాలనగా చూస్తూ ‘‘ దేవుడున్నాడు మనిషి రూపంలో ..’’
ంంం
కొడుకెందుకు పెళ్లి చేసుకోనంటున్నాడో జీవన్‌ వాల్ల నాన్నకు అర్ధం కాలేదు. కంపెనీ వ్యవహారాలు చూసుకో మంటే, జాబ్‌ కోసం వెల్లాడు, అదే సమయంలో భూమిక ఫోటో, జీవన్‌ వాల్ల నాన్నకు పంపి విషయమంతా వివరించింది. ఆంజనేయులుగారమ్మయి రూప.
* * *

మరిన్ని కథలు

Maal
మాల్
- తడకమళ్ళ మురళీధర్
Nachiketuni katha
నచికేతుని కథ
- హేమావతి బొబ్బు
Mosapoyina Raju
మోసపోయిన రాజు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Bomma-Borusu
బొరుసు -బొమ్మ
- వెంకటరమణ శర్మ పోడూరి
Kanuvippu
కనువిప్పు
- కొల్లా పుష్ప
Nisha mohana raagam
నిషా - మోహనరాగం
- హేమావతి బొబ్బు
Prema enta madhuram
ప్రేమ ఎంత మధురం
- కొడాలి సీతారామా రావు