అనుభవం - తాత మోహనకృష్ణ

Anubhavam

అనగనగా ఒకానొక రాజ్యాన్ని భీమసేనుడు అను రాజు పరిపాలించేవాడు. కొడుకుకి పట్టాభిషేకం చేసి, తాను విశ్రాంతి తీసుకుందామని నిర్ణయించుకున్నాడు. దీనికోసమై కొడుకుని అడిగాడు. దానికి వచ్చిన సమాధానం... "నాన్నగారు..! నేను ఇంకా చిన్నవాడిని..నేను ఈ రాజ్యభారం ఇప్పుడే మొయ్యలేను" "లేదు నాయనా..ఓపిక తగ్గటంతో నేనూ ఇంక ఈ బాధ్యతను మొయ్యలేను. కాలంతో పాటు నీకు అన్నీ తెలుస్తాయి..కాకపోతే, కష్టకాలంలో అనుభవం మనకి చాలా ఉపయోగపడుతుంది.. అది గుర్తుపెట్టుకో.." అన్నాడు భీమసేనుడు "అలాగే నాన్నగారు..!" "కొడుకు పట్టాభిషేకం వైభవంగా జరిగింది. రాజుయిన తర్వాత..అహంకారం కూడా ఎక్కువైంది. తను ఏది చెబితే, అది అమలవుతుందని..తన మనసుకు ఏది అనిపిస్తే అది చేసేసేవాడు కొత్త రాజు..ఎవరిని సంప్రదించకుండా.." "కొన్నాళ్ళకి రాజు తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు. తనకి సలహాలు ఇచ్చిన తల్లితండ్రులు లేకపోవడంతో..రాజ్యంలో ఇంక వృద్ధులు ఎవరూ ఉండకూడదని, అందరికీ మరణశిక్ష విధించాలని ఆదేశించాడు. దానితో, చాలా మంది రాజ్యం వదిలేసి వెళ్ళిపోయారు. మరికొందరు..రాజు ఆదేశాలకు బలై చనిపోయారు. అదే రాజ్యంలో ఒక కుర్రాడు మాత్రం తన తండ్రి పై ప్రేమతో..తండ్రిని ఎక్కడో కొండగుహలో దాచి ఉంచాడు. ప్రతిరోజూ ఆహారం అందించి తండ్రిని కాపాడుకుంటున్నాడు. తన తండ్రి ఒక గొప్ప రైతని ఎప్పుడూ గర్వపడుతూ ఉండేవాడు. కొన్ని నెలల తర్వాత, రాజ్యంలో కరువు వచ్చింది. వర్షాలు లేవు..పంటలు పండట్లేదు. వరుణయాగం చెయ్యమని సలహాతో..రాజు ఆ యాగం చేయించాడు. వర్షాలు కురిసాయి కానీ, పంటలు వెయ్యడానికి విత్తనాలు లేవు. సలహా ఇవ్వడానికి రాజ్యంలో అనుభవం, పెద్దవారు ఎవరూ లేరు. ఉన్నవారికి ఏమీ తెలియదు.భయంతో పక్కరాజ్యం వాళ్ళు ఎవరూ సహాయానికి రాలేదు. ఇదే విషయాన్ని ఆ కుర్రాడు కొండగుహలో తన తండ్రిని కలిసి వివరించాడు. ఇలాంటి పరిస్థితిలో విత్తనాలు ఎలా తయారుచేసుకోవాలో, ఆ విషయాన్ని కొడుకుకి వివరించాడు. తండ్రి చెప్పిన విధంగా విత్తనాలను తయారుచేసి, రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. రాజు ఆశ్చర్యపోయి, పారితోషకం ఇవ్వడానికి ముందుకొచ్చాడు. "నీలాంటి యువకులు ఏదైనా సాధించగలరు" అంటూ ప్రశంసించాడు రాజు "క్షమించండి మహారాజా..! ఇది నేను చేసింది కాదు. మీ దగ్గర ఒక విషయం దాచాను. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం, ఆయనని ఎక్కడో దాచి కాపాడుకుంటున్నాను. ఇదంతా మా నాన్న తన అనుభవంతో నాకు చెప్పడంతో.. ఇలా చెయ్యగలిగాను. నాకంత అనుభవం లేదు" "తన తండ్రి చెప్పినట్టుగా, అనుభవం ఆపదలో ఎలా కాపాడుతుందో రాజుకు బాగా అర్దమైంది. ఆ తరువాత, పెద్దవారిని ఎప్పుడు హింసించలేదు రాజు. వారిని గొప్పగా గౌరవించేవాడు. ********

మరిన్ని కథలు

Gummam bayata cheppulu
గుమ్మం బయట చెప్పులు
- కొడాలి సీతారామా రావు
Maal
మాల్
- తడకమళ్ళ మురళీధర్
Nachiketuni katha
నచికేతుని కథ
- హేమావతి బొబ్బు
Mosapoyina Raju
మోసపోయిన రాజు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Bomma-Borusu
బొరుసు -బొమ్మ
- వెంకటరమణ శర్మ పోడూరి