“జీవితం ఎవరికీ పూల పాన్పు కాదు….” - లత పాలగుమ్మి

Jeevitham evarikee poola paanpu kaadu

అర్ధరాత్రి సమయం... బయట కుండపోతగా వర్షంకురుస్తోంది. అది ఒక పెద్ద డ్యూప్లెక్స్ హౌస్. విశాలమైన లివింగ్ రూమ్.. హై సీలింగ్, ఒక వైపు పైకి వెళ్ళడానికిమెట్లు... మరో వైపు ఎల్ షేప్

బ్రౌన్ కలర్ పెద్ద లెదర్ సోఫాఎటు చూసినా ఖరీదైనవస్తువులే. ధగ ధగ లాడుతూ తణుకులీనుతున్న పెద్దషాండ్లియర్స్గోడలకి ఖరీదైన తంజావూరుపెయింటింగ్స్కొత్త వాళ్ళెవరైనా చూస్తే ఇంట్లో వాళ్ళటేస్ట్ ని మెచ్చుకోకుండా ఉండలేరు.. సోఫాలో ఒకఐమూలగా పెళ్లి కూతురి అలంకరణలో ఒదిగి కూర్చున్నవసుధ ఇవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో లేదు..

చీర కొంగులో మొహం దాచుకుని " పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నానా" అని పదే పదే తననితాను నిందించుకుంటూ నిశ్శబ్దంగా ఏడుస్తోందిఏడుపుకి ఆమె ప్రక్కటెముకలుఅదురుతున్నాయి.

అతని ప్రవర్తనకి సున్నితమైన ఆమె మనసు ఎంతగానో గాయపడింది..

ఆత్మాభిమానం కలిగిన ఆమెకి జరిగిన విషయం తలుచుకుంటేనే సిగ్గుతో ప్రాణం పోతోంది... వద్దన్నా పదే పదే అదే విషయం గుర్తుకు వస్తోంది.

మూడేళ్ళ కొడుకు ధనుష్ గుర్తుకు వచ్చి ఆమె దుఃఖం రెట్టింపు అయిందిపిచ్చి తండ్రి, తనులేకుండా పడుకోవడానికి ఎంత ఏడ్చి ఉంటాడోపుట్టాక ఒక్క రోజు కూడా వాడిని వదిలిఉండలేదు

ఉదయం దండలు మార్చుకుంటుంటేఅమ్మ మెడలో దండ వేసాడు అంకుల్.. భలే.. భలే..అనిచప్పట్లు కొట్టాడు. పసివాడు.. వాడికేం తెలుసు.. అమ్మ వేరే బంధంలో బలవంతంగాబంధింపబడుతోందని.” అమాయకమైన పసిముఖం కళ్ళ ముందు కదలాడింది. ఎవరికోసమైతే వివాహానికి తలవంచిందో వాడికే దూరమవ్వాల్సి వస్తుందనుకోలేదుఅనుకుంది బాధగా.

మనసుని వ్యధకి లోను చేసే వర్తమానాన్ని అంగీకరించలేని ఆమె మనసు అందమైన గతం లోకిపరుగులు తీసింది

వసుధది మధ్య తరగతి కుటుంబం. తల్లి తండ్రులు, తమ్ముడుతో ఉన్నదాంట్లోనే ఎంతోసంతోషంతో... సంతృప్తిగా గడిచిపోయిందామె బాల్యం... చదువు, ఆటపాటలన్నింటిలోముందుండేవాళ్ళు అక్కాతమ్ముళ్ళిద్దరు.

తండ్రి ఎంత చెపితే అంత.. బంధుమిత్రులందరూ వీళ్ళ కుటుంబాన్ని ఎంతో ఆదర్శంగాచెప్పుకునేవారు. తమ్ముడికి అక్క మాటే వేదం.

ఇంజనీరింగ్ అయిన వెంటనే మంచి సంబంధం రావడంతో వసుధకి వివాహం జరిపించారుతల్లితండ్రులు. ఎంతగానో ప్రేమించే భర్త... మంచి మనసున్న అత్తమామలు.. సంవత్సరంతిరిగేసరికి చేతిలో పండంటి బిడ్డ... దేనికి లోటు లేని జీవితంవిధికే కన్ను కుట్టిందేమో ఆమెసంతోషం చూసి అన్నట్లుగా ఆఫీసుకని బయల్దేరిన భర్త అకస్మాత్తుగా రోడ్ యాక్సిడెంట్లోచనిపోవడంతో మిన్ను విరిగి మీద పడినట్లు అయింది వసుధకి.”

కష్టం అంటే తెలియని ఆమె జీవితంలో కష్టాల కడలి మొదలయింది

భర్త తో గడిపిన నాలుగేళ్ల కాలంలో ఒక జీవితానికి సరిపడా మధురానుభూతులు... అతనిగుర్తుగా ఒక బాబు.. ఇవి చాలు తన జీవితానికి... వాడి బాగోగులు చూస్తూ గడిపేయొచ్చుజీవితంఅనుకున్న తరుణంలో ఆమెకి.. తల్లితండ్రుల బలవంతం... అక్క మళ్ళీ పెళ్లి చేసుకునిజీవితంలో సెటిల్ అయితే కానీ తన వివాహ ప్రసక్తి లేదని భీష్మించుకుని కూర్చున్న తమ్ముడు.. పిల్లాడికి తండ్రి అండ కావాలని అత్త మామల బలవంతం.. వీటి పర్యవసానమే ఆరోజు జరిగినఆమె ద్వితీయ వివాహం.

వసుధ, శశిధరల వివాహం అతి కొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో రిజిస్ట్రార్ ఆఫీసులోనిరాడంబరంగా జరిగింది.”

శశిధర్ కి మొదటి వివాహం ద్వారా రెండేళ్ల పాప అనన్య. తల్లి లేని పిల్లని ఇంట్లో అందరూ గారాబం చేయడంతో మొండి ఘటంలా తయారయింది అనన్య. శశిధర్ వల్ల

కూడా కాకపోవడంతో

ఆడపిల్లకి తల్లి అవసరం ఎంతైనా ఉంది... నీకోసం కాకపోయినా అనన్య కోసమైనా పెళ్లిచేసుకోవాల్సిందే అన్న తల్లి వత్తిడితో కూతురి కోసం అతను కూడా ద్వితీయ వివాహానికి తలవంచక తప్ప లేదు. ఇద్దరి మొహాల్లో నిరాసక్తత.. అయిష్టత... రక రకాల సందేహాలు... వివాహంనిర్లిప్తంగా ఒక తంతులా ముగిసింది.

వసుధకి తోడుగా మూడు నిద్రలకి ఎవరు వెళ్లాలని తర్జన భర్జనలు పడుతుంటే రెండో పెళ్ళికికూడా అన్ని ఫార్మాలిటీస్ దేనికని!? వసుధ అత్తగారు రాజేశ్వరి దేవి కొంచెం విసుగ్గా అనడంతోఒక్కదాన్నే పంపటం ఇష్టం లేకపోయినా ఆవిడకి భయపడి మిన్నకుండి పోయారు వసుధతల్లితండ్రులు.

కొడుకు.. కోడలు మధ్య ఒక అవగాహన వచ్చి.. తన మనవరాలు అనన్య.. వసుధకి మాలిమిఅయ్యేంతవరకు వసుధ కొడుకుని ఆమె తల్లితండ్రుల వద్దే ఉంచుకోమని.. తనిలా చెప్పినట్లుకూడా వసుధకి తెలీకూడదని ముందే వాళ్ళని హెచ్చరించింది రాజేశ్వరి.

పెళ్ళికి ముందు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడిలాంటి షరతులు పెట్టడమేమిటని బాధ పడ్డారువసుధ తల్లితండ్రులు... వసుధకి తెలిస్తే ఏం గొడవ చేస్తుందోనని భయపడి మూడు నిద్రలతర్వాత పిల్లాడిని తీసుకువచ్చి దింపుతామని నచ్చ చెప్పి పంపారు.

వసుధకి అత్తగారింట్లో మొదటి రోజు.. పగలంతా చుట్టాలతో హడావిడిగా గడిచిపోయింది. సాయంత్రానికి ఎక్కడివాళ్ళు అక్కడే సర్దుకున్నారు.

రాత్రి పది గంటలకి రాజేశ్వరీ దేవి కొడుకు గది చూపించి వెళ్ళిపోయింది యాంత్రికంగా. ఆవిడనుంచి స్నేహపూరితమైన చిన్న నవ్వు కూడా చూడలేదు పరిచయమైనప్పటి నుండి.. డాబు, దర్పం అడుగడుగునా కనపడతాయి ఆవిడలో.

మనసులో ఎంతో బాధ.. దుఃఖం.. మనసు వెళ్లనని మొరాయిస్తున్నా తప్పదని భయ భయంగాఅడుగు పెట్టిందాగదిలోకి... మంద్ర స్వరంలో మ్యూజిక్ నడుస్తోంది

చుట్టూ పరికించింది వసుధ..లోపల ఎవరూ లేరు.. బ్రతుకు జీవుడా అని గాలిపీల్చుకుంది..ఎంతో రిలాక్సింగ్ గా అనిపించిందామెకా క్షణంలో. మంచం మీద కూర్చోడానికిమనస్కరించక పక్కనే ఉన్న చైర్ లో కూలబడింది..గది నలువైపులా పరికించి చూసింది.. ఎటుచూసినా గోడల నిండా అందమైన పెయింటింగ్స్.. అతను మంచి ఆర్టిస్టు అని వింది కానీఇంత అద్భుతమైన చిత్రాలను.. అతని రూమ్ ఇంత కళాత్మకంగాను ఉంటుందనుకోలేదు..

రాత్రి రెండో ఝామైనా అతను రాకపోవడ సంతోషంగా అనిపించింది వసుధకి

నాలుగు రోజులుగా అలసి సొలసి పోయిన శరీరానికి ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలీలేదు.

మొద్దు నిద్ర లో ఉన్న వసుధకి

గుప్పుమని విస్కీ వాసన ఘాటుగా ముక్కు పుటాలకి సోకడంతో ఉలిక్కి పడి లేచింది.. ఎదురుగాశశిధర్‌.. చిన్నప్పటి నుండి ఆల్కాహాల్ తీసుకునేవాళ్ళంటే చచ్చేంత భయం ఆమెకు..అతనుతూలుతూ వస్తూ..య్!! నా గదిలోకి రావడానికి ఎంత ధైర్యం నీకు.. ఛీ.. పో బయటికి.. ఇటుకేసి ఎప్పుడూ రా..కు.. పో.. పో..!” అని అరవడంతో ఎవరైనా వింటున్నారేమోననే సిగ్గుతో.. అవమాన

భారంతో మొహం ఎర్రబడగా ఒక్క ఉదుటున బయటకు పరుగెత్తింది.. అతని ప్రవర్తనకి హతాశురాలైంది.

వదినా!! అన్న ఆడపడుచు శృతి పిలుపుతో ఉలిక్కిపడి చూసింది.. ఆలోచనల్లోంచిబయటపడి..వదినని లివింగ్ రూమ్‌లో చూసి పరిస్థితి అర్ధం చేసుకున్న శృతి.. “నా రూమ్ లోపడుకుందువుగాని రా వదినాఅని తీసుకువెళ్ళింది. ఆమె బాధ పడుతోందని తెలిసి ఏంచేయాలో అర్ధం కాక నిస్సహాయంగా చూస్తుండి పోయింది .. ఆమెకి కొంచెం సమయ మిచ్చి అన్నగురించి అంతా వివరంగా చెప్పాలనుకుంది. తనని అభాసుపాలు కాకుండా కాపాడినందుకుమనసులోనే ఆమెకి కృతఙ్ఞతలు తెలుపుకుంది వసుధ.

పడుకుందనేకాని నిద్రా దేవత ఆమె దరిదాపుల్లోకి కూడా రాలేదు.

తెల్లవారుఝామున మాగన్నుగా కొంచెం నిద్ర పట్టిన వసుధకి ఉదయం ఎనిమిది గంటలకిమెలుకువ వచ్చింది..లేట్ గా లేచినందుకు ఎవరేమనుకుంటారో అనే భయంతో... త్వర త్వరగా తయారై మొహమాటంగా

కిచెన్ కేసి వెళ్ళింది..కూతురి గదిలోంచి వస్తున్న కొత్త కోడలిని చుసిన రాజేశ్వరికి పరిస్థితి అర్థమైఆలోచనలో పడింది.. వీళ్ళిద్దరిని ఎలా కలపాలా అని ఆలోచిస్తూనే.. వంటామెకి రోజు వంటలోఏంచేయాలో చెపుతూ.. వసుధని చూసిమా వాడికి బెడ్ కాఫీ అలవాటు... తీసుకెళ్ళి ఇవ్వమనిఆర్డర్ జారీ చేసింది.”

వసుధ గుండెల్లో రాయి పడినట్లు అయింది.. ఏమీ మాట్లాడకుండా తల వంచుకుని నిలబడినవసుధని చూసిమా ఇంట్లో నువ్వు కిచెన్ లో చేయాల్సిన పనులేమీ ఉండవు కానీ... మాఅబ్బాయిని, మనవరాలిని చూసుకుంటే చాలు అంది.”

అతనేదో చిన్న పిల్లాడైనట్లు అనుకుంది వసుధ.”

పులి బోనులోకి అడుగు పెడుతున్నట్లు తడబడుతున్న అడుగులతో వెళ్ళింది.. అతను ఫోన్ లోఏదో చూసుకుంటున్నాడు బెడ్ మీద అటు వైపుకు తిరిగి పడుకుని.. ఎంత శబ్దం చేయకుండాఉందామన్న ఆమె గాజుల సవ్వడికి అతను లేచి అసహనంతోనువ్వెందుకు తెచ్చావు!? అని..అమ్మా!! ఇంట్లో నౌకర్లు అంతా ఎక్కడ చచ్చారు!? అంటూనే యాదగిరీ!! అని అరిచాడు.

వసుధ భయపడిపోయింది..

యాదగిరి పరుగెట్టుకుంటూ వచ్చాడు..

రోజూ కాఫీ తెచ్చి ఇచ్చేవాడివి.. ఏమొచ్చింది నీకివాళ !? అని గదమాయించేసరికి.. అయ్యా !! పెద్దమ్మగారు..అంటూ నీళ్లు నములుతూ నిలబడ్డాడు..

రేపటి నుండి నువ్వే తీసుకురా.. పో.. ఇంకా ఇక్కడే నిలబడ్డావే!! అన్నాడు విసుగ్గా..అది తననిఉద్దేశించే అన్నట్లుగా అనిపించి వడి వడిగా బయటకు నడిచింది వసుధ.

ఒక్కో రోజు ఒక్కో యుగంలా గడుస్తోంది ఆమెకా ఇంట్లో..

అన్ని పనులకి పనివాళ్ళు ఉండటంతో ఏం చేయాలో తోచేది కాదు.. శృతి ఒక్కతె ఇంట్లోవసుధని అర్ధం చేసుకున్నది.. త్వరలోనే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.

అనన్య గురించి అడిగింది వసుధ శృతిని…. అనన్య అంటే ఇంట్లో అందరికి చాలా ఇష్టమని.. తను కాలేజీ నుండి వచ్చాక మిగిలిన సమయమంత తనతోనే గడుపుతానని చెప్పింది.. పెద్దఅన్నకి ఇద్దరు.. రెండో అన్నకి ఇద్దరు మెుగపిలలు..ఇంట్లో అనన్య ఒక్కతే ఆడపిల్ల కావడం.. తల్లిఆలనా పాలనా లేదనీ ఇంట్లో అందరూ ముద్దు చేయడంతో ఎవరి మాట వినకపోవడంతో పెళ్ళిలో ఏం పేచీలు పెడుతుందోనని భయమేసి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి పంపామని చెప్పిందివసుధకి.

అనన్య వాళ్ళ అమ్మమ్మ ఇంటి నుండి రావడంతో..సహజంగానే స్నేహశీలి అయిన వసుధకి..శృతిసహాయంతో.. అనన్యకి చేరువ కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆయాని మాన్పించేసిఅనన్య పనులన్నీ తనే చూసుకునేది వసుధ. చిన్నారి చేత 'అమ్మ'అని పిలిపించుకునేది. నీకొక అన్న ఉన్నాడని ఎప్పుడూ కొడుకు ధనుష్ గురించి చెప్తూ బాధ పడే వసుధని తన బుల్లిచేతులతో ఆమె కన్నీళ్లు తుడుస్తూ " ఏలవమోకు" అనే చిన్నారి ముద్దు మాటలకి.. చేష్టలకితాత్కాలికంగానే అయినా ధనుష్ ని మైమరచేది.

రోజూ రాత్రి పూట శశిధర్ వచ్చేంత వరకు ఎదురు చూడటం.. అన్నీ వేడి చేసి అతనికి భోజనంపెట్టడం.. ఒకోసారి అతను తినే పరిస్థితుల్లో లేకపోతే డ్రైవర్ సాయంతో అతన్ని రూమ్ వరకుతీసుకువెళ్లి షూ తీసి పడుకోపెట్టడం ఇవన్నీ నిత్యకృత్యాలయ్యాయి వసుధకి.. క్రమేపీ అతనంటేభయం కూడా తగ్గ సాగింది ..

కొడుకు ధనుష్ ని తీసుకు రావడానికి పుట్టింటికి వెళతానన్న వసుధకి.. “ముందు నీకు కొత్తగావచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించు.. కొడుకుని తెచ్చే విషయం తర్వాత ఆలోచిద్దువుగానిఅని ఖరాకండీగా అన్న అత్తగారి మాటలకి హతాశురాలైంది.

పంటి బిగువున దుఃఖాన్ని అదిమి పెట్టి రూమ్ లోకి వెళ్లి దిండులో మొహం పెట్టి బోరునఏడుస్తూ.. “కన్న కొడుకుని చూడటానికి కూడా స్వాతంత్రం లేని బ్రతుకు .. తన అస్థిత్వాన్నేగమనించని భర్త.. తను ఇక్కడ ఎవరి కోసం

ఉంటోందో తెలియని జీవితం.. కన్న కొడుకుని దూరం చేసుకోవడం తప్పించి పెళ్ళి వల్ల తనుసాధించినదేమిటని బాధ పడుతున్న వసుధని స్థితి లో చుసిన శృతికి చాల బాధఅనిపించింది.

ఆమె పసిపిల్లలా అనిపించి అనునయంతో ఆమె తలపై చెయ్యి వేసి రాస్తూ వదినా!! అన్నతో మాట్లాడి ధనుష్ ని తీసుకు వచ్చే పూచీ నాది.. సరేనా!! నువ్వు బాధ పడొద్దు…! అన్న శృతిమాటలకి ఉక్రోషంతో తల పైకెత్తి "మీ అన్నయ్యకేం ఇంటరెస్ట్ ఉంటుంది!? ధనుష్ నితీసుకురావడానికి.. అతని లోకంలో అతనుంటాడు ఎప్పుడూ.. నా గురించే పట్టించుకోనివాడు.. ధనుష్ గురించి ఎందుకు ఆలోచిస్తాడు!? ప్రపంచంలో అందరూ స్వార్ధపరులే!!అనన్యని బాగాచూసుకుంటే చాలు అతనికి..అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది వసుధ.”

వదినా!! చిన్నన్న నువ్వనుకుంటున్నంత చెడ్డవాడు కాదు..ముందు నీకు

వాడి గురించి చెప్పాలితను స్వతహాగా చాలా మంచివాడు.. విధ మైన దురలవాట్లులేవు..వదిన చేసిన మోసం తట్టుకోలేక తాగుడికి బానిస అయ్యాడు కానీ…” అంటూ వాళ్ళ అన్న గతం గురించి చెప్పసాగింది..

మాది పెద్ద టెక్స్టైల్ బిజినెస్ . నాన్న శివరామ్ గారు అహర్నిశలు కష్టపడి విదేశాలకి సహితంఎక్స్పోర్ట్

చేసే స్థాయికి బిజినెస్ ని తీసుకు వెళ్ళినా..నాన్న గారు దాని పెట్టుబడికి అమ్మ పుట్టింటి వాళ్ళ సహాయం తీసుకున్నారనే నెపంతో రోజుకి ఇదంతా మా వాళ్ళ దయేనంటూ నాన్నగారినిసాధిస్తూ అన్ని విషయాల్లో తన మాటే నెగ్గించుకుంటుంది మా అమ్మ.

పెద్ద అన్నలిద్దరు చదువులో అంతంత మాత్రంగా ఉండటంతో నాన్నగారి బిజినెస్ లో జాయిన్అయిపోయారు.

నాన్నగారి ఆశలన్నీ చిన్నన్న మీదే. చిన్నన్న శశి చాలా తెలివైనవాడు. కానీ బిజినెస్ అంటేఅయిష్టం. ఆర్ట్ అన్నా, ఫొటోగ్రఫీ అన్నా ప్రాణం. అందులోనే తన కెరీర్ అనుకునేవాడు..

చదువులో బాగా చురుకుగా ఉండటంతో నాన్నగారు హార్వర్డులో ఎం.బీ. . చేయడానికిపంపించారు బిజినెస్ లో ఉపయోగపడతాడని.. ఎం.బీ. . అయిన తరువాత కూడా డిజిటల్ఆర్ట్ వైపే మొగ్గు చూపడంతో నాన్నగారికి అన్నకి ఇంట్లో తరచుగా వాగ్వివాదాలు అవుతుండేవి.

ఫ్రెండ్ చెల్లెల్ని ఇష్టపడ్డానని.. ఆమెని తప్ప ఎవరినీ చేసుకోనని చెప్పడంతో ఇంట్లో ఎవరికి ఇష్టంలేకపోయినా వివాహం జరిపించారు. వదిన చాల అందంగా ఉండేది. ఇద్దరూమేడ్ ఫర్ ఈచ్అదర్అన్నట్లు ఎంతో అన్యోన్యం గా ఉండేవారు.

అనన్య పుట్టిన తర్వాత వదినకి టీ. వీ. సీరియల్స్ లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. అన్నకి ఇష్టంలేకపోయినా..ఒక్క సీరియలే అని వదిన బ్రతిమలాడటంతో ఒప్పుకోక తప్పలేదు.

సరదాకి ఒక సీరియల్ లో యాక్ట్ చేస్తానని ప్రారంభించి.. వరుసగా అవకాశాలు రావడంతో పసిపిల్లఅని కూడా చూడకుండా అనన్యని ఆయాలకి వదిలేసి వెళ్లిపోయేది. ఔట్డోర్ షూటింగ్స్ అంటూ రోజుల తరబడి ఇల్లు పట్టకుండా తిరగడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి..

చిలికి చిలికి గాలి వానైనట్లు డైవర్స్ వరకు వెళ్ళింది విషయం.. అనన్యని తీసుకు వెళితే తనకెరియర్ కి అడ్డు అనుకుందో.. ఏమో..ఓరోజు చెప్పా పెట్టకుండా వెళ్లి పోయింది. ఆమె మీద కోపంతో.. కసితో..ఆమెని మరచి పోలేక.. ఆడవాళ్లంటేనే అసహ్యంతో.. మద్యం మత్తులో ఆరోగ్యంచెడకొట్టుకుంటూ తిరుగుతున్నాడు అన్నయ్య.

నాన్నగారు ఊరులో ఉంటే కొంచెం జంకుతాడు.. లేకపోతే షరా మామూలే.. అనన్య కోసమేబ్రతుకుతున్నట్లు ఉంటాడు వేరే ప్రపంచం లేకుండా.. తన కోసమే పెళ్ళికి కూడా ఒప్పుకున్నాడు.

కొంచెం ఓపిక పట్టు వదినా.. అన్నయ తప్పకుండా మారతాడుఅంటూ ఓదార్చింది..

శృతి మాటలు ఆశాజనకంగా అనిపించి వసుధ మనసు కొంచెం తేలిక పడింది. ముఖ్యంగాధనుష్ ని తీసుకువద్దాము అన్న మాట టానిక్ లా పని చేసింది ఆమెపై".

ఇంటి కోడలుగా వసుధ బస్సుల్లో.. ఆటో ల్లో పడి వెళ్లడం వాళ్లకి నామోషీ అని ధనుష్ నిచూడటానికి కూడా పుట్టింటికి వెళ్ళనిచ్చేది కాదు అత్త గారు.. ఎన్ని కార్లు ఉన్నా ఏదీ ఖాళీగాఉండేది కాదు.. శృతి పుణ్యమా అని అరుదుగా అయినా సాధ్య పడేది వసుధ కి.. తల్లిని ఒప్పించితీసుకు వెళ్ళేది తనే డ్రైవ్ చేసుకుంటూ.

జీవితం ఎవరికీ పూల పాన్పు కాదని.. కొత్త బంధంలో ఇమడటానికి కొంత సమయంపడుతుందని.. ఓర్పు, నేర్పు, సహనంతో ఉంటే కాలక్రమంలో అన్నీ సర్దుకుంటాయని.. ధనుష్సంతోషంగానే ఉన్నాడని ఫోనులో తల్లి చెప్పే ఓదార్పు మాటలు వసుధకి కొంత ధైర్యాన్ని.. స్వాంతననిచ్చేవి.”

తోడి కోడళ్ళిద్దరికి వసుధ పొడే గిట్టదు.. కాటన్ చీరలో సీదా సాదాగా ఉండే వసుధ అంటే వాళ్లకిహేళన భావం.. కేవలం అనన్యని చూసుకోవడానికి వచ్చిన ఆయాగా మాత్రమే పరిగణించేవారుఆమెని.

ఇంటికి వచ్చే ట్యూషన్ మాస్టర్ లీవ్ పెట్టడంతో..వసుధ తోడి కోడళ్ల పిల్లలకి ఛార్ట్స్, హోమ్ వర్క్ లోహెల్ప్ చేయడంతో పిల్లలందరు ఆమెకి చేరువ అయ్యారు. స్ట్రిక్ట్ గా ఉండే ట్యూషన్ మాస్టర్ కన్నావసుధ దగ్గరే చదువుకుంటామని పేచీ పెట్టేవారు. వసుధ కూడా తనకి ట్యూషన్ చెప్పటంఅలవాటేనని.. అందరిని కూర్చోపెట్టి చక్కగా చదివించి స్టోరీస్ కూడా చెప్పి పిల్లలందరికి ఫేవరెట్అయ్యింది.

వసుధ చదివించడం ప్రారంభించాక పిల్లలకి మంచి మార్క్స్ రావడంతో బావగారులు.. తోడికోడళ్ల దృష్టి లో పడింది వసుధ.

ఆమెలో ఉన్న

సునిశిత దృష్టి, అన్నింటిలో మంచి అవగాహన, స్నేహపూరితమైన స్వభావం అందరినిఆకట్టుకున్నాయి. మెల్లిగా అందరూ ఆమెని అభిమానించసాగారు.. పిల్లల కోసం యు.ట్యూబ్ లోచూసి శృతితో కలిసి రక రకాల వంటలు.. కేక్స్ తయారు చేసేది వసుధ.

నిమిషం ఖాళీ లేకుండా బిజీ చేసుకున్నా.. వసుధ మనసులో పెద్ద వెలితి.. కొడుకు కోసం ఆమెమనసు పడే తపన ఎవరూ అర్ధం చేసుకోలేరు..

సమయం ఎవరి కోసం ఆగదన్నట్లు ఆరు నెలల కాలం ఇట్టే గడిచి పోయింది...

వసుధ ఆలనా పాలనలో అనన్య లో వచ్చిన మార్పులు శశిధర్ కి ఎంతో సంతోషాన్నిచ్చాయి.. ప్రతిదానికి ఏడుస్తూ హఠం చేసే కూతురు ఒద్దికగా ఉండటం.. చిన్న చిన్న శ్లోకాలు, పద్యాలు.. డాన్స్చేస్తూ ఇంగ్లీష్ రైమ్స్ చెప్పడం చూసి మురిసి పోయాడు.

తను భార్యగా ఆమెని స్వీకరించక పోయినా ఆమె తన కర్తవ్యాలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తూ.. తననుండి ఏమీ ఆశించని వసుధని చుస్తే ఆశ్చర్యంగానూ.. ఆమె పట్ల తన ప్రవర్తన అతన్నిబాధించసాగాయి. ఓరోజు

అన్న పిల్లలకి స్టడీస్ లో హెల్ప్ చేస్తున్న వసుధని మొదటిసారిగా పరీక్షగా చూశాడు శశిధర్. చామనఛాయ రంగుతో..చూడగానే ఆకట్టుకునే కళ గలిగిన ముఖం..ఒత్తైన తలకట్టు.. కుదురుగా అల్లుకున్న పెద్ద జడ.... ఎంతో సింపుల్ గా ఉన్నా ఏదో అట్రాక్షన్ ఉంది ఈమెలోఅనుకున్నాడు.”

డ్రింకింగ్ తగ్గించి..బిజినెస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం.. ఖాళీ టైం లో కూతురితో గడపడం.. వసుధతో మాట కలపడానికి ఆసక్తి కనపరచడం..శశిధర్ లో వచ్చిన మార్పుకి ఇంట్లోఅందరూ సంతోషించారు.

ఆఫీస్ కి రోజూ వస్తున్న కొడుకుని చూసి ఎంతగానో పొంగి పోయారు శివరామ్ గారు.. ఆయనచిరకాల వాంఛ నెరవేరింది.. మొదటిసారిగా భార్య తీసుకున్న నిర్ణయాన్ని పొగిడి.. కోడలినిఅభినందించారు..

బుక్స్ చదవడం, పెయింటింగ్ ఇలా ఇద్దరి హాబీస్ ఒకటే కావడంతో అనతి కాలంలోనే వసుధ, శశిధర్‌ల మధ్య స్నేహ బీజం చిగురించింది.

ధనుష్ ని తీసుకురావడానికి తన తల్లి పెట్టిన షరతు చెల్లెలు శృతి ద్వారా తెలుసుకున్న అతనుతల్లిపై మండిపడ్డాడు.

వసుధని సంతోషపరచడానికి తను కూడా ఏమైనా చేయాలనే కోరిక.. ధనుష్ గురించి చెప్పేటప్పుడు ఆమె కళ్ళలో మెరిసే మెరుపు.. శశిధర్ ని తల్లికొడుకులని కలిపేలా చేసాయి.

ధనుష్ రాకతో వసుధ ఆనందానికి అవధులు లేవు.. ఆమె అతనికేసి ప్రేమతోకృతజ్ఞతాపూర్వకంగా చూసింది.

ధనుష్ రాక రాజేశ్వరికి కంటకింపుగా ఉన్నా కొడుక్కి, కూతురుకి..ఎదురు చెప్ప లేకమిన్నకుండిపోయింది.. ఇంత త్వరగా శశిధర్‌లో, అనన్యలో మార్పు తెచ్చిన వసుధనిమెచ్చుకోకుండా ఉండలేక పోయింది

అనతి కాలంలోనే ధనుష్, అనన్యలు

సొంత అన్నా చెల్లిలా కలిసిపోవడం ఇంట్లో అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అన్నా అంటూధనుష్ ని క్షణం కూడా వదలకుండా తిరుగుతున్న కూతురిని చూసి శశిధర్ అబ్బురపడిపోయాడు . ఇదంతా వసుధ శిక్షణ వల్లనే అని ఆమె పట్ల గౌరవం అభిమానం.. రెట్టింపుఅయ్యాయి.

కొడుకు రాక ఆమె జీవితంలో ఉన్న పెద్ద లోటుని భర్తీ చేసింది.. శశిధర్ ధనుష్ ని అనన్య తోసమానంగా ఎంతో ప్రేమగా చూడటం గమనించిన వసుధ మనసు ఆనందంతో పొంగిపోయింది. మొదటిసారిగా తన రెండో పెళ్లి నిర్ణయం సరైనదేననిపించింది.

వసుధకి జీవితం మీద మళ్ళీ ఆశలు చిగురించాయి.

బెడ్ రూమ్ లో పిల్లలిద్దరి మధ్యన ఆదమరచి నిద్ర పోతున్న వసుధని ఆరాధనగా చూస్తూ

నిస్తేజంగా ఉన్న తన జీవితంలోకి వసంతంలో కోయిలలా ప్రవేశించి ప్రేమ ధ్వనులు మోగించినఆమెకి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు శశిధర్.”

శుభం

*****************

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ