ఊర్మిళ - K shanta

Voormila

రామాయణం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆదర్శమూర్తులైన సీతా రాములు, అంజనేయస్వామి భక్తి, రావణాసురుని విద్వత్తు, లక్ష్మణ,భరతుల ఆదర్శ భ్రాత్రృభావన...కాని ఎవరికీ గుర్తు రానిది సప్త పతివ్రతలకి ఏమాత్రం తీసిపోని మిథిలాకుమారి, లక్ష్మణుని అర్ధాంగిని ఊర్మిళాదేవి గురించి. తన కర్తవ్య నిర్వహణకోసం రాముడు అడవులకు బయలుదేరినపుడు వద్దని వారించినా పట్టుపట్టి సీతాదేవి కూడా అతనితో బయలుదేరింది. భర్త సహచర్యం లో భార్య కారడవులలో కూడా నందనవనం లో వున్నంత సంతోషంగా వుండగలదని నిరూపించింది . ప్రేమించే భర్త ప్రక్కన వుంటే భార్య ఎంతటి కష్టమైనా సంతోషంగా భరించగలదు అని చాటి చెప్పింది. అదే ప్రస్తావన ఊర్మిళ చేసినప్పుడు లక్ష్మణుడు ఆ ప్రస్తావనని నిరాకరించడమే కాక అపుడపుడే యవ్వనంలోకి అడుగు పెట్టి కోటి కలలతో భర్త సహచర్యానికై ఎదురు చూస్తున్న నూతన వధువు లేత భుజస్కంధాలపై ఒక గురుతరమైన బాధ్యతను మోపాడు. అడవులకి వెళ్తున్న సీతా రాముల వెంట లక్ష్మణుడు బయలుదేరి నపుడు ఊర్మిళ రాజభవనం లోనే ఉండి తన తల్లి తండ్రులను,మిగతా బంధు జనాన్ని, అక్కడి వ్యవహారాలని జాగ్రతగా చూసుకో మన్నాడు. నా విరహం లో కంట తడి పెడితే నీ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించలేవు కనుక బాధ పడడం కాని ఏడవడం కాని చేయరాదన్నాడు.ఎంతటి కఠినాత్ముడు. తండ్రి ఊర్మిళను మిథిలకు రమ్మన్నాడు.తల్లితండ్రులు,బంధుమిత్రుల తోనూ కొన్నాళ్ళు గడిపితే కాస్త ఉపశమనం వుంటుంది అంటూ బ్రతిమాలితే తన భర్త తనవారికి దూరంగా వుండడం వలన రాజభవనంలోనే వుండి అతని కర్తవ్యాన్ని తను నిర్వహించడమే తన ధర్మం అని చెప్పి ఆయనతో వెళ్లడానికి నిరాకరించింది . మేఘనాధ వధ కూడ ఊర్మిళ వలనే సంభవమైనది. అతనికి ఒక వరం వుంది .14 సంవత్సరాలు ఎవరైతే నిద్ర పోకుండా వుంటారో వారి చేతిలోనే అతను చంపబడతాడు.మరి 14 సంవత్సరాలు నిద్రపోకండా వుండడం ఎవరికైనా సంభవమేనా ?! లక్ష్మణుడికి నిద్రా దేవి వరం ఒకటి వుంది. దాని వలన అతని కర్తవ్య నిర్వహణకోసం అతనికి బదులుగా ఊర్మిళ నిద్ర పోయేవీలు వుంది . మరి ఆమెకు లక్ష్మణుడు ఏవో బాధ్యతలు అప్పగించాడు కదా ?నిద్ర పోతూ వుంటే ఆమె అవి ఏ విధంగా పూర్తి చేసింది? అనే ప్రశ్న మనకు మనసులో ఉద్భవించడం సహజం. ఒకానొక సందర్భంలో సీతాదేవి ఊర్మిళ కి ఇచ్చిన వరం ప్రకారం ఆమె ఒకే సమయంలో మూడు పనులు చేయగలదు. అందుకే ఆమె లక్ష్మణుడి వంతు నిద్ర పోతున్నా భర్త అప్పగించిన కర్తవ్యాన్ని కూడా సక్రమంగా నిర్వహించింది . ఇన్నాళ్ళుగా ఎదురు చూసిన రామ పట్టాభిషేకం సమయంలో నిద్రా దేవికిచ్చిన మాట ప్రకారం ఊర్మిళకు నిద్ర నుండి విముక్తినిచ్చి తాను నిద్ర పోయాడు లక్ష్మణస్వామి. ఇది విధి చేసే క్రీడా వినోదం కాకపోతే ఇంకేమిటి? నవ వివాహిత ఊర్మిళ కంట తడి పెట్టకుండా 14 సంవత్సరాలు భర్త వియోగం భరించడం తో పాటు అతను వనవాసం లో పాటిస్తున్న కఠిన నియమాలను కూడా పాటిస్తూ అతను తనపై పెట్టిన బాధ్యతలను కూడ మౌనంగానే నిర్వహించింది. త్యాగం, సహనం,కర్తవ్యనిష్ఠ మూర్తి భవించిన ఇటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వానికి స్వామిని అయిన ఊర్మిళ గురించి మొత్తం రామాయణ మహాకావ్యం లో ఎవరూ ఎక్కడా ప్రస్తావించక పోవడం శోచనీయం కాదా??

మరిన్ని కథలు

Taatayya
తాతయ్య
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Malle malle raakoodani roju
మళ్ళీ మళ్ళీ రాకూడని రోజు
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Viramam
విరామం.
- Harish Babu
Prema viluva
ప్రేమ విలువ
- Lakshmi Priyanka
Odarpu
ఓదార్పు!
- - బోగా పురుషోత్తం
Guruvu korika
గురువు కోరిక
- టి. వి. యెల్. గాయత్రి
Itlu nee tammudu
ఇట్లు, నీ తమ్ముడు!
- అంతర్వాహిని