అమ్మమ్మ మొన్నే వెళ్లపోయింది - Chandrashekhar Panakanti

Ammamma monne vellipoyindi

*అమ్మమ్మ మొన్నే వెళ్ళిపోయింది.......* నా చిన్నతనం నుండి నాకి చాలా ఇష్టమైన వ్యక్తి అమ్మమ్మ....కల్మషం లేని , పెద్దగా లోకజ్ఞానం లేని మా అమ్మమ్మ దగ్గరికి మేము ప్రతీ సంవత్సరం వేసవి సెలవుల్లో వెళ్ళేవాళ్ళం ...నేను మా అక్కలు ఇద్దరూ ఎప్పుడెప్పుడు వేసవి సెలవులు వస్తాయో అని ఎదురు చూచే వాళ్ళము. అలా ప్రతీ సంవత్సరం మా అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్ళేవాళ్ళం. ఊళ్ళో మా తాత , అమ్మమ్మ ఇద్దరే ఉండేవాళ్ళు , మాకు ఇద్దరు మామలున్నప్పటికీ వాళ్ల దెగ్గరికి వెళ్ళాకుండా , మా అమ్మమ్మ ఇంకా తాత ఇద్దరే ఊళ్ళో ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు. అమ్మమ్మ కి చిన్నప్పుడే అమ్మ నాన్న పోతే , వాళ్ల మామ గారి దగ్గర పెరిగింది , చాలా కష్టాలు పడింది. ఆస్తులు చాలా ఉన్నా , వాళ్ళ మామ పెట్టె బాధలకు చివరికి ఆవకాయ అన్నానికి అలవాటుపడింది. యుక్త వయస్సు వచ్చిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ అక్క మా అమ్మమ్మ కి పెళ్లి చేసింది , మా తాత ఇల్లరికం వచ్చారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. తాత పోలీస్ పటేల్ గా అప్పట్లో చేసి తరువాత మానేసి , ఊళ్ళో పౌరోహిత్యం చేసేవాళ్ళు , కష్టపడి పిల్లలు నలుగురిని పెంచి పెద్ద చేశారు తాత. మామలిద్దరు చెరో మంచి ఉద్యోగం లో చేరిపోయారు వాళ్ళు వేరే దేశం లో ఉంటారు.ప్రతీ వేసవిలో మేము అందరం మా అమ్మమ్మ వాళ్ల ఊరిలో కలిసేవాళ్ళం. నాకు ఇప్పటికి గుర్తుంది ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఉండేది చిన్న ఇల్లు , ఇంతకుముందు చాలా పెద్ద ఇల్లు ఉండేది...ఎంత పెద్దదంటే ఇంటి వెనకాల మా తాత ఇంటికి అవసరమైన కూరగాయలు పళ్లు పండించేవాళ్ళు. కాలానుగుణంగా అవసారినికి ఆ ఇంటిని అమ్మవలసి వచ్చి చివరికి ఈ ఇంటికి చేరారు. అయితేనేం వాళ్ల హృదయాలు ఇంకా విశాలంగానే ఉన్నాయి. ఇక మా అమ్మమ్మ ముందుగానే చెప్పినట్టు లోకం తెలియని మనిషి , మా తాత తప్ప వేరే లోకం లేదు తనకు. మేము వచ్చినప్పుడు తనకు పండగే పండగ. మేము వస్తున్నాం అని తెలిసిన వెంటనే , మా కోసం గడ్డ పెరుగు , పాలు , మీగడ అన్ని సిద్ధం చేసి ఉంచేది. డబ్బులకు కొదవలేదు , మా కోసం ఒక డబ్బా నిండా చిల్లర డబ్బులని నింపేది , మేము దగ్గర్లో ఉండే హన్మాండ్లు దుకాణానికి వెళ్లి మాకు కావాల్సిన చిరుతిండ్లు అన్నీ కొనుక్కుని వాళ్ళం, మేము మొత్తం వేసవి సెలవులని అక్కడే గడిపేసి 4 నుండి 5 కిలోల బరువు పెరిగి వెళ్ళేవాళ్ళం. ఇలా రోజులన్నీ సంతోషంగా గడిపోతున్నాయి. నేను కూడా కాల క్రమంలో హైద్రాబాద్ కి పెద్ద చదువుల కోసం వెళ్ళాను. సరిగ్గా సెప్టెంబర్ 26 2006 రోజు అప్పటికి ఇంకా మొబైల్ ఫోన్ లు ఇంకా అందుబాటులో రాలేదు , ఇంతలో మా బాబాయి వాళ్ళ ఇంటికి ఫోన్ వచ్చింది తాతగారు పోయారు అమ్మమ్మ ఒక్కతే ఉంది అని. అమ్మ నాన్న , పెద్ద అక్క ముగ్గురూ మా ఊరినుండి బయలుదేరారు దారిపొడుగునా వాళ్ళు తాతగారు లేరనే నిజాన్ని నమ్మలేకపొతున్నారు. వాళ్ళు చేరుకునేసరికి మధ్యాహ్నం 3 గంటలైంది. హైద్రాబాద్ లో ఉన్న నాకు కూడా ఈ విషయం తెలియడంతో జేబులో వంద రూపాయలతో నేను కూడా సాయంత్రం మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరాను. రాత్రి 12 గంటలకి నేను ఊరికి దూరంగా దిగాల్సి వచ్చింది. అక్కడినుండి ఊర్లోకి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది చిమ్మ చీకటి , కళ్ళు పొడుచుకున్న కానరాదు, గతుకుల రోడ్డుకుండా నేను ధైర్యం చేసి నడుచుకుంటూ ఊరివైపు వెళుతున్నాను. తాత గారు పోయారు అనే విషయం అబద్ధం అవ్వాలని కోరుకుంటూ , ఇంటికి దగ్గరగా వచ్చాను. ఇంటి ముందర నాలుగు పెద్ద దుంగలను కాలుస్తూ , కొంతమంది దేవుడి నామ స్మరణ చేస్తున్నారు. నా గుండె గుభేలుమంది , ఇది నిజం , తాతగారు లేరు అనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. అమ్మ నా దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చింది, నా కళ్ళు అమ్మమ్మ ని వెతికాయి , తాత పార్థివ దేహం పక్కన అమ్మమ్మ ఏడుస్తూ కూచుంది. అమ్మను చూస్తే ఏమి అనిపించని నాకు అమ్మమ్మని ఆ పరిస్తితి లో చూసేసరికి నాకు ఏడుపు తన్నుకు వచ్చింది. తెలవారింది , ఊరు ఊరంతా ఏకమైంది , మా తాత అంతిమ యాత్రకి సమయం ఆసన్నమైంది , అటువైపు మా చిన్నక్క వేరే ఊళ్ళో ఉండడం వల్ల , తనకి అదే రోజు రావడానికి వీలుపడలేదు , ఇక కడసారి చూపు కోసం ఈ రోజు తప్పకుండా రావాలి, లేకపోతే తనకి కడసారి చూపుకూడా ఉండదు , తాత ని ఊరి చివర్లో ఉండే స్మశాన వాటికకి తీసుకు వెళ్లారు , మా చిన్నక్క అదృష్టం చివరి చూపు దొరికింది. తాత చితికి నిప్పటించారు మా మామలు. అమ్మమ్మ విషయం ఎవరికి అర్థం అవలేదు , మొదలే లోకం తెలియని మనిషి , ఊర్లో ఒక్కరిని ఉంచడానికి వీలు కాదు ఎలా అని ఆలోచించారు. చివరికి ఒక అంగీకారానికి వచ్చారు , అమ్మమ్మని వృద్ధాశ్రమం లో ఉంచడానికి. చిన్నపటినుండి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళతో ఉండే అమ్మమ్మని చివరికి వృద్ధాశ్రమం లో చేర్చడానికి తీసుకువెళ్లారు. ఎక్కడో హయత్ నగర్ లో , కుంటలూరు అనే పల్లెటూరులో ఉండే ఆ ఆశ్రమానికి , అమ్మమ్మని తీసుకొని వెళ్లారు. అమ్మమ్మ కోసం ఒక గది , టీవీ , ఫ్యాన్ అన్నీ ఉన్నాయి , నా అని చెప్పుకోవడానికి లేని ఒక మనిషి తప్ప. ప్రేమలు ఆప్యాయతలు లేని ఈ యుగం లో , "మనీ" ఉంటేనే మనిషి అనే ఈ సమాజం లో కల్మషం లేని అమ్మమ్మ కి స్థానం లేకుండా పోయింది. వెళ్ళిపోయింది అమ్మమ్మ మొన్నే వెళ్ళిపోయింది. #సశేషం#

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు