సర్పం దుష్టబుద్ధి! - - బోగా పురుషోత్తం

Sarpam dustabuddhi

కాళంగి నదిలో ఓ విష సర్పం వుండేది. దానికి వళ్లంతా విషమే కావడం వల్ల అందరిపై విషం కక్కుతూ హాని కలిగించేది.
నదిలో వున్న కప్ప పిల్లల్ని, చేప పిల్లల్ని, ఒడ్డున వున్న పక్షి గుడ్డులను తినేసి వాటి తల్లిదండ్రులకు దు:ఖం మిగిల్చేది.
ఓ రోజు కాళంగి నదికి పక్కనే వున్న ఊరందూరుకు వచ్చిన కొత్త పెళ్లికొడుకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు నదిలో దిగాడు. పగబట్టిన సర్పం కాటేసింది. కొద్ది సేపట్టికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని ఇంట్లో విషాదం నిండిరది. ఇది గమనిస్తున్న రుద్రయ్య అనే సాధువు అక్కడికి వచ్చాడు. తన దివ్య తప: శక్తితో సర్పాన్ని చూశాడు.
‘‘ ఓ సర్పరాజా.. సహజంగా నీవు క్రూర జంతువు..దానికి తోడు దుష్టబుద్ధి కారణంగా నువ్వు అందరికీ హాని కలిగిస్తూ తీరని వ్యథ కలిగిస్తున్నావు.. దీన్ని మానుకో..మానవత్వం అలవరుచుకో.. లేదంటే తీవ్ర దు:ఖం చవిచూస్తావు..’’ అని హెచ్చరించాడు.
సాధువు మాటలు సర్పానికి కోపం తెప్పించింది. ‘‘ నువ్వు సాధువువి.. మౌనంగా తపసు చేసుకోక నాకే నీతులు నేర్పిస్తున్నావు..నిన్నేం చేస్తానో చూడు..’’ అంటూ సాధువుపైకి బుసలు కొట్టి కాటేయబోదింది.
సాధువు తన తప:శక్తితో గద్దగా మారిపోయాడు. తన ముక్కుతో పామును పొడిచి చంపబోయాడు. అప్పటికీసర్పానికి బుద్ధి రాలేదు. గద్దతో ఎదురు తిరిగి పోరాటం చేయసాగింది.
ఇక లాభం లేదనుకుని రాబందువుగా మారాడు సాధువు. పామును తన కాళ్లతో పట్టుకుని ఆకాశానికి ఎగిరి విసురుగా కిందపడేసింది.
సర్పం కిందపడి బాధకు విలవిలలాడింది. ముందుకు కదలేక సోయింది. నేలపై పాకుతున్న చీమలన్నీ చుట్టుముట్టి కరుస్తుంటే కన్నీరు కార్చింది పాము. ప్రాణభయంతో ‘‘ కాపాడు స్వామీ..’’ అంటూ వేడుకుంది.
పాము ఆర్తనాదాలు గమనిస్తున్న సాధువు తన దివ్య దృష్టితో గమనించి వెంటనే మనిషిగా మారాడు ‘‘ చూశావా! నేను విషపు జంతువు.. నన్నెవరూ ఏమీ చేయలేదు.. అని కన్నుమిన్నూ కానకుండా అకారణంగా ఎందరికో దు:ఖాన్ని నింపావు.. నీకంటే బలహీనులైన చీమల చేత చిక్కి చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నావు.. ఇప్పటికైనా గర్వం వీడి దుష్టబుద్ధి వదిలి మానవత్వంతో మసులుకో...నిన్ను అందరూ స్నేహితులుగా దగ్గరికి చేర్చుతారు..’’ అని హితవు పలికి వెంటనే వైద్యుడిగా మారి ఆకు పసురుతో సర్పం గాయాల్ని మాన్పించాడు.
కొద్ది రోజులకు గాయం మాని కోలుకున్న విష సర్పం తన దుష్టబుద్ధి వీడి అన్ని జంతువులతో స్నేహం చేస్తూ హాయిగా జీవించింది.

మరిన్ని కథలు

Allari bhamatho pelli
అల్లరి భామతో పెళ్ళి
- డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు
Saraina empika
సరైన ఎంపిక
- కందర్ప మూర్తి
Gharana mosam
ఘరానా మోసం
- డా:సి.హెచ్.ప్రతాప్
Tappu telisindi
తప్పు తెలిసింది
- కందర్ప మూర్తి
Aaru chintachetlu
ఆరు చింతచెట్లు
- డా. భీమ మోహన రావు
Manavatwam
మానవత్వం
- సి.హెచ్.ప్రతాప్
Naa asha aakanksha
నా ఆశ-ఆకాంక్ష
- రాపాక కామేశ్వర రావు
Inner child
ఇన్నర్ చైల్డ్
- రాజు యెదుగిరి