సొంత వైద్యం ప్రాణాంతకం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Sonta vaidyam pranantakam

అమరావతి నగరంలో తనఇంటి అరుగుపై నీతికథ వినడానికి చేరిని బాలలు అందరికి మిఠాయిలు పంచిన బామ్మ'బాలులు వృత్తి పరంగా ఎవరి పని వారే చేయాలి లేకుంటే ప్రమాదం.అనేకథ మీకు చెపుతాను వినండి.

అడవిలో ఏజంతువుకు ఎలాంటి ఆనారోగ్యం కలిగినా నక్క వైద్యం చేస్తుండేవాడు అతనికి సహాయంగా కోతి ఉండేవాడు.

ఒక రోజు నక్క వద్దకు ఏనుగు తాత వచ్చాడు''నాకు మోకాళ్ల నొప్పులు''అన్నాడు.పరిక్షించిన నక్కమామ ''వయసుకు తగినట్లు శరీరం బరువు తగ్గించుకోవాలి ఆకుకూరలు బాగాతినాలి,నొప్పి ఉన్న దగ్గర మునగఆకు వేడి చేసి ఉదయం సాయత్రం కట్టుకట్టండి-లేదంటే పొట్టు వలచిన చింతగింజల గుజ్జుతో కట్టు కట్టండి తగ్గిపోతుంది''అన్నాడు నక్క.

మరు దినం గుర్రం అన్న వస్తూనే ''అయ్యా నిన్నటినుండి విరేచనాలు ఆగకుండా అవుతున్నాయి'అని నీరసంతో కూలబడ్డాడు.లేహ్యాన్ని ఆకులో పెట్టి ఇస్తూ'' కొద్దిగా రెండు పూటలు తీసుకో వేడినీళ్లు మాత్రమే తాగు''అని చెప్పి పంపించాడు.నక్క.

ఒకరోజు అడవిలోని వనమూలికల సేకరణకు వెళుతూ''కోతి రెండు రోజుల్లో వస్తాను''అని చెప్పి వెళ్లాడు నక్క'

ఇదంతా చెట్టుపై నుండి గమనిస్తున్న పిల్లరామచిలుక కొతిబావను చూస్తూ''యాత్ర వైకుంఠ మాత్ర నిచేతి బావకోతి''అంది.

''ఏమిటి నాచేతిమాత్ర వైకుంఠయాత్రా? నేను వైద్యుడిని అవతున్నానని అసూయ''అన్నడు కోతి.

ఇంతలో కడుపునొప్పి తో బాధపడుతూ ఎలుగుబంటి బాబాయి అక్కడికి వచ్చాడు.నాడి పరిక్షిస్తూ ''ఏమిటి సమస్య''అన్నాడు కోతి.

''అయ్య నదికి కొత్త నీరురావడంతో చాపలు బాగావచ్చాయి.బాగా ఉన్నాయి అని నాలుగు చేపలు ఎక్కువ లాగించాను కడుపు నొప్పిగా ఉంది''అన్నాడు.

నక్క కడుపు నొప్పికి ఇచ్చే మందు సీసా ఖాళీగా ఉండటంతో చేతికి అందిన సీసాలోని లేహ్యం ఆకులో పెట్టి ఇస్తూ''రెండు పూటలా తీసుకో వేడినీళ్లేతాగు ''అని చెప్పి ఎలుగు బంటిని పంపించాడు.

''సరి నీపని సరి''గోవిందో గోవిందా! నారాయణా!''అని అరవసాగింది పిల్లరామచిలుక.పిల్లరామచిలుకను వెక్కిరించాడు కోతిబావ.

రెండోరోజు ఉదయం నక్కమామ వచ్చేసరికి కోతిబావ నిద్రిపోతూ కనిపించాడు.ఇంతలో ఎలుగుబంటుని నులకమంచంపై వేసుకుని నాలుగు ఎలుగుబంట్లు మోసుకువచ్చాయి.''గోవిందా గోవిందా! ఉందా? ఊపిరి ఇంకా'' అని అరవసాగింది పిల్లరామచిలుక.

''ఏంజరిగింది''అన్నాడు నక్క.

''మంచంలోని ఎలుగు బంటి కడుపునొప్పి అని వచ్చాను మందుఇచ్చాడు కోతి అంతకుముందు మాములుగా విరేచనాలే అవుతున్నాయి కోతిబావ ఇచ్చిన మందు తిన్నాక తిన్న చేపలు అలానే పడుతున్నాయి''బావురు మన్నాడు ఎలుగుబంటి బాబాయి .''ఏంమందు ఇచ్చావు''అన్నాడు నక్కమామ. అప్పుడే నిద్ర లేచి వచ్చిన కోతిబావ ఆసీసా చూపించాడు.

''భయపడక ఇదిగో మెంతులపొడి పెరుగులో కలిపి మూడు పూటలు తీసుకో'' కోతిబావ తెలియక నీకు విరేచనాలు అవడానికి మందుఇచ్చాడు'' అని మందు ఇచ్చి ఎలుగుబంటిని సాగనంపాడు నక్క. వెళుతూ బలంగా లాగిపెట్టి తన శక్తికొద్ది ఒతన్ను కోతిబావ పిర్రపై కసితీరా తన్ని తనవాళ్లతో కలసి వెళ్లాడు ఎలుగుబంటి .

దెబ్బకు బల్లిలా చెట్టుకు అంటుకున్న కోతిను చూస్తు పిల్లరామచిలుక ''అయిందా పెళ్లి కుదిరిందా తిక్క''అంది.

''కోతి తెలియని వైద్యం ఎంత ప్రమాదకరమో తెలిసి తెలియని పనులు చేస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి.ఆరోగ్యం బాగాలేనప్పుడు వైద్యుని వద్దకు వెళ్లాలి అంతేకాని సొంతవైద్యం చేసుకోవడం, ఎవరు చెపితే వారి సలహా తో తప్పుడు మాత్రలు మింగితే చాలాప్రమాదం.వైద్యుని సలహామేరకే మందులు వాడాలి అప్పుడు ఎటువంటి సమస్యలు తలఎత్తవు''అన్నాడు నక్కమామ.

బాలలు కథ విన్నారుగా! ఎన్నడు సొంత వైద్యం చేసుకోకండి".అన్నది బామ్మ.బుద్దిగా తలఊపారు పిల్లలు అందరూ.

మరిన్ని కథలు

mamidi komma malli poochenulae
మామిడి కొమ్మమళ్ళీ పూచేనులే
- ప్రభావతి పూసపాటి
Avititanam evariki?
అవిటితనం ఎవరికి?
- రాము కోలా.దెందుకూరు
Kannappa
కన్నప్ప
- పుల్లేటికుర్తి కృష్ణ మోహన్
Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు