తెలివి - VEMPARALA DURGA PRASAD

Telivi

సురేష్ కి ఆ రోజు చాలా ఆనందంగా వుంది. కొడుకు ప్రదీప్ కి 10th క్లాస్ లో స్టేట్ 9th రాంక్ వచ్చింది. కొడుకు క్లోజ్ FRIEND విజయ్ కి 3rd రాంక్ వచ్చింది .

సురేష్ కి చదువుకునే పిల్లలంటే ఎంతో ఇష్టం. “విజయ్ కి తల్లి లేదుట, ఒక సారి వాళ్ళింటికి వెళ్లి అతన్ని, వాళ్ళ నాన్నగారిని congratulate చేద్దాం” అని కొడుకు తో అన్నాడు.

ప్రదీప్ ని తీసుకుని తన కార్ లో విజయ్ ఇంటికి వెళ్ళేరు. రామారావు పేట లో ఓ సన్న సందులో వుంది వాళ్ళ ఇల్లు. గేట్ బార్లా తీసి వుంది. ముందు ఖాళీ జాగా వుంది, వెనుకగా, చిన్న ఇల్లు. ఎడమ వైపు, ఒక నేలబావి, దానికి ఒక అడుగు ఎత్తులో గట్టు కట్టి, పైన GRILL వేసి ఉంచేరు . ఆ బావి పక్కనే కార్ తెచ్చి ఆపేడు. కార్ వచ్చిన సౌండ్ కి విజయ్ బయటికి వచ్చేడు.

ప్రదీప్ ని, సురేష్ ని చూసి, ఆనందంగా ఎదురు వచ్చి,." రండి అంకుల్" అన్నాడు.

"congratulations విజయ్ నీకు మంచి ర్యాంకు వచ్చింది" అన్నాడు సురేష్.

" థాంక్స్ అంకుల్ " అన్నాడు విజయ్

సురేష్, ప్రదీప్ కార్ దిగి, ఎత్తుగా ఉన్న వరండా మీదకి వచ్చేరు. అక్కడ ఉన్న కుర్చీల లో కూర్చున్నారు. అప్పుడు ఇల్లు పరిశీలనగా చూసాడు. అది చిన్న ఇల్లే, ముందంతా ఖాలీ స్థలం వదిలేసారు. కుడివైపు ఓ పాత ఐ-10 కార్ మట్టి కొట్టుకునిపోయి, rust పట్టి వుంది. ముందు భాగం పాడయ్యి ఆక్సిడెంట్ అయినట్లు వుంది.

విజయ్ ని అంటి పెట్టుకుని ఒక , పమేరియాన్ డాగ్ వచ్చింది. అది చాలా చెలాకీగా వరండా లోంచి, వాకిట్లోకి, తిరిగేస్తోంది. ఎవరో ఇంటి వాళ్ళ FRIENDS వచ్చేరు - అదీ దాని హడావిడి.

ఇంతలో కొడుకు FRIEND, అతని ఫాదర్ రావడం చూసి, సుధాకర్ బయటికి వచ్చేడు. వస్తూనే పలకరింపుగా నవ్వేడు. సుధాకర్ RTC లో పని చేస్తున్నాడు. ఈ రోజు కొడుకుకి , మంచి రాంక్ రావడం తో CELEBRATE చెయ్యడానికి సెలవు పెట్టేడు. సుధాకర్ వెనుకే, పాక్కుంటూ ఓ కుర్రవాడు వచ్చేడు. అతనికి ఓ 10 , 12ఏళ్ళుంటాయి. ఆ అబ్బాయికి పోలియో తో 2 కాళ్ళు చచ్చు బడి వున్నాయి. అన్న result హంగామా ఆ పిల్లవాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సుధాకర్ మాత్రం ఆ కుర్ర వాడిని, “ ఎందుకు బయటికి వస్తావ్, లోపల ఉండొచ్చు కదా” , అని విసుక్కుంటున్నాడు.

"మీ అబ్బాయి కి చాలా మంచి రాంక్ వచ్చింది, మీకు, మీ అబ్బాయి కి CONGRATS " అన్నాడు సురేష్

Thank you సర్, మీకు కూడా CONGRATS, మీ బాబుకు కూడా స్టేట్ లో 10 లోపు రాంక్ వచ్చింది కదా " అన్నాడు సుధాకర్.

థాంక్స్ అండీ అంటూ, ఆ బాబు... అంటూ ఆగిపోయాడు సురేష్.

సుధాకర్ మొహం బాధగా మారిపోయింది. “మా రెండో అబ్బాయి కిరణ్. వాడికి చిన్నప్పుడే పోలియో వచ్చి 2 కాళ్ళు చచ్చు బడి పోయాయి. వాడికి వైద్యం కోసం తిరగని ప్రదేశం లేదు . కానీ కాళ్ళు రాలేదు. ఆ బెంగతో నా భార్య రోగిష్ఠిది అయిపొయింది. పోనీ రోగంతో అయినా బ్రతికి ఉంటే బావుండేది. కార్ ఆక్సిడెంట్ లో మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది" అన్నాడు సుధాకర్.

“అరెరే... బాబుకి యెంత వయసు ?” అన్నాడు సురేష్

“వాడికి 12 ఏళ్ళు.” అన్నాడు సుధాకర్

"ఏం చదువుతున్నాడు "

5TH క్లాస్... ఏదో వీధి చివర GOVERNMENT స్కూల్ లో చదివిస్తున్నాను లెండి .. ముక్తసరిగా అన్నాడు సుధాకర్.

“పెద్దవాడిని టెక్నో స్కూల్ లో చదివిస్తూ, చిన్న వాడి చదువు NEGLECT చేస్తున్నారేమో " అన్నాడు సురేష్.

వాడిని ఆలా చదివించడమే ఎక్కువ...వాడికి కాళ్ళు లేవు, వాడొక నష్ట జాతకుడు. వాడికి 5 సంవత్సరాల వయసులో వాడిని కాపాడే ప్రయత్నం లో మా అమ్మ ఆ నూతిలో పడి చనిపోయింది. 2నెలలు తర్వాత వాడికి పోలియో వచ్చింది. 9 సంవత్సరాల వయసు లో నా భార్య కార్ ఆక్సిడెంట్ లో చని పోయింది. ఆ నూతి కి GRILL వేసి మూసేసాం, ఆ కార్ ని వాడలేక మూలన పడేసాము... అది ఆమెకి చాలా ఇష్టమయిన కారు " అన్నాడు సుధాకర్.

అతని వైఖరి చూస్తే, సెంటిమెంటల్ గా ఆ పసివాడిని కొడుకు లాగ చూడడం లేదని అనిపించింది. "భగవంతుడి లీలలకి పిల్లలెలా దోషులవుతారు" అనుకున్నాడు సురేష్.

కిరణ్ ని చూస్తే జాలి వేసింది. అందరూ అతన్ని జాలి గా చూస్తుంటే... గుమ్మం మీద తల పెట్టుకుని మొహం కప్పుకుని, కన్నీళ్లు పెట్టుకున్నాడు కిరణ్.

విజయ్ తమ్ముడిని ఊరుకోబెట్టాలని, మాట మారుస్తూ... తమ్ముడూ, వీడు నా CLASS MATE ప్రదీప్, వీడికి స్టేట్ 9TH రాంక్ వచ్చింది తెలుసా? అన్నాడు.

కిరణ్ కి అన్న అంటే పిచ్చి ఇష్టం . అన్న మాటకి తల ఊపుతూ, ప్రదీప్ ని ADMIRING గా చూసేడు.

మాటలు, కాఫీలు అయ్యేక సురేష్, సుధాకర్ కి బై చెప్పి కార్ దగ్గరికి వచ్చేడు. వెనుక టైర్ పంచేర్ పడి భూమికి అతుక్కుని వుంది. కార్ లో JOCKEY తీసేడు. టైర్ బొల్ట్స్ విప్పి, మూతలేని ప్లాస్టిక్ బాక్స్ లో ఉంచి, పక్కన ఉన్న నూతి గట్టు మీద వుంచేడు. స్పేర్ టైర్ కోసం డిక్కీ తీసేడు.

డిక్కీ లో స్పేర్ టైర్ లేదు. అప్పుడు అతనికి గుర్తుకు వచ్చింది ... 4రోజుల పూర్వం తన బావమరిది క్యాంపు కి వెళుతూ ఆ స్పేర్ టైర్ తీసి తన కార్ లో వేసుకుని వెళ్ళేడు.

“ఇప్పుడు ఎలా, అని ఆలోచిస్తూన్నాడు.” ఇంతలో... వెనుక ఏదో చప్పుడయింది.

పెంపుడు కుక్క టామీ విజయ్ తో ఆటలాడుతూ నూతి గట్టు మీదకి దూకింది. క్షణాల్లో అనుకోకుండా, దాని కాళ్ళు తగిలి, ప్లాస్టిక్ డబ్బా పక్కకి పడిపోయింది. నట్లు జారి నూతిలో నీళ్ళల్లో పడిపోయేయి.

ఈ సంఘటన తో సురేష్ కి మతి పోయింది. స్పేర్ టైర్ లేదు, బిగించడానికి నట్లు లేవు, ఉన్న టైర్ పంచర్ అయి వుంది. భగవంతుడా ఇంటికి ఎలా తిరిగి వెళ్లడం అనుకున్నాడు.

పరిస్థితి ని గమనించిన సుధాకర్ " పోనీ లెండి, కార్ ఆలా ఉంచి, OLA బుక్ చేసుకుని వెళ్లి, మెకానిక్ ని తీసుకుని వచ్చి రిపేర్ చేయించుకుని వెళ్ళండి - ఇంకేం చేస్తారు " అన్నాడు.

విజయ్ తనకి తోచిన సలహా ఇచ్చాడు.

"అంకుల్, హ్యుందాయ్ షో రూమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే, వాళ్ళ TEAM స్పేర్ టైర్ తెచ్చి బిగించి మీ టైర్ తీసుకెళ్లి రిపేర్ చేసి తెస్తారు. OFCOURSE సర్వీస్ ఛార్జ్ వేస్తారు" అన్నాడు.

అప్పుడు ఎలా నిర్ణయించు కోవాలా అని ఆలోచిస్తున్నాడు సురేష్. ఇంతలో కిరణ్ ఇలా

అన్నాడు :

"అంకుల్, ఏమి అనుకోకండి, నేనొక సలహా ఇవ్వనా "

వొక్క సురేష్ తప్ప మిగిలిన వాళ్ళు హేళనగా చూసేరు... నీకేమి తెల్సు అన్నట్లు.

“ మా కార్ మూలన పడి వుంది, అది, మీ కార్ మోడెల్ ఒకటే కదా. జాకీ తో దాని టైర్ విప్పి మీ కార్ కి బిగించుకోండి, మా ఇంట్లో ఎయిర్ పంప్ వుంది, దానితో టైర్ కి గాలి కొడితే సరిపోతుంది. మీ టైర్ బాగయ్యేక, మా టైర్ తిరిగి ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు 10 నిముషాల్లో పని అవుతుంది " అన్నాడు.

ఇంట్లో ఒక మనిషిగా చూడని ఆ పిల్లవాడా ఇంత మంచి సలహా ఇచ్చాడు అనుకున్నాడు సురేష్.

అతని తెలివికి ముచ్చటేసింది. "శభాష్...ఈ ఐడియా బావుంది " అంటూ టైర్ మార్చడం మొదలు పెట్టేడు సురేష్.

మొదటిసారిగా సుధాకర్ చిన్న కొడుకుని మెచ్చుకున్నాడు. ఆ కళ్ళలో మెరుపుని చూసేడు. ప్రదీప్, విజయ్ లు కూడా కిరణ్ ని మెచ్చుకోలుగా చూసేరు.

" పిల్లలు సవాళ్ళని ఎదుర్కోవడం లో ENCOURAGE చెయ్యాలి, కానీ నిరాశపరచ కూడదు . ఆ విషయం పిల్లవాడి FATHER ఇప్పటికయినా గ్రహిస్తే బాగుండును “. అనుకున్నాడు సురేష్.

ఇంటికి వెళ్ళేక కిరణ్ గురించి తీవ్రంగా ఆలోచించేడు సురేష్. ఊళ్ళో వున్న వికలాంగుల పాఠశాల యాజమాన్యం తో చర్చించి, అక్కడ ఒక సీటు సంపాదించేడు. సుధాకర్ ని ఒప్పించి కిరణ్ ని ఆ పాఠశాల లో జేర్పించేడు. సుధాకర్ ద్వారా, కిరణ్ PROGRESS ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. కిరణ్ స్కూల్ లో మంచి పేరు సంపాదించు కున్నాడు. సుధాకర్ లో ఇప్పుడు మార్పు కనపడింది.

2 సోంవత్సరాలు గడిచిపోయాయి.

7త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చేయి. డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన కిరణ్ ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించినట్లు సుధాకర్ చెప్పేడు. కిరణ్ విషయం లో తన కళ్ళు తెరిపించిన సురేష్ అంటే సుధాకర్ కి ఇప్పుడు చాలా అభిమానం.

***END***

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి