ఫ్రిజ్ లో మొండెం - తాత మోహన కృష్ణ

Fridge lo mondem

చంద్రకళ కు కొత్తగా పెళ్ళయింది. వాళ్ళాయన రవి ది మార్కెటింగ్ జాబ్. కొత్తగా హైదరాబాద్ కు బదిలీ అయ్యింది. ఆన్లైన్ లో రెంట్ హౌస్ కు అడ్వాన్స్ ఇచ్చారు.

కొత్త ఇంటికి వచ్చారు. హౌస్ చాలా బాగుంది. అన్నిటికన్నా అట్రాక్షన్ ఇంటి మధ్యలో ఉన్న రెడ్ కలర్ ఫ్రిజ్. ఓనర్ ఫ్రిజ్ ని వాడుకోమని ఇచ్చాడు. ఇంట్లో పాలు పొంగించారు.

రవి ది మార్కెటింగ్ జాబ్ కావడం తో టూర్స్ ఎక్కువగా ఉంటాయి. సడన్ గా టూర్ వెళ్లాల్సి వచ్చింది. ఇంట్లో చంద్రకళ ఒక్కర్తే ఉంది. ఈ కాలనీ, సిటీ కి దూరంగా ఉండడం చేత ఇళ్ళు చాలా తక్కువగా ఉంటాయి, దూరం దూరంగా.

ఇంట్లో ఇంకా సామాన్లు సర్దుకోలేదు. చంద్రకళ సామాన్లు సర్దుతోంది. ఫ్రిజ్ ఓపెన్ చేద్దామనుకుంది. లాక్ వేసి ఉంది. లాక్ కోసం చూసింది. కానీ కనిపించలేదు. పనిమనిషి తో తాళం పగులగొట్టించింది చంద్రకళ.

ఇంకో పక్క, వైజాగ్ బీచ్ లో పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. ఇసుకలో గవ్వలు సేకరిస్తున్నారు. అందరూ తలో చోట గవ్వల కోసం తవ్వుతున్నారు. అనుకోకుండా, ఒక చోట మనిషి తల ఇసుక లోంచి బయటకు వచ్చింది. పిల్లలు కేకలు వేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని, ఎంక్వయిరీ చేస్తున్నారు.

ఇక్కడ హైదరాబాద్ లో చంద్రకళ ఫ్రిజ్ పనిమనిషి తో తాళం బద్దలుగొట్టడానికి ప్రయత్నిస్తుంది. ప్రయత్నం ఫలించింది. ఫ్రిజ్ డోర్ ఓపెన్ అయ్యింది. పనిమనిషి షాక్ అయ్యింది. స్పృహ కోల్పోయి, కింద పడిపోయింది. కొంత సేపటికి మెలకువ వచ్చి, చుస్తే ఫ్రిజ్ లో తల లేని శవం ఉంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది చంద్రకళ.

పోలీసులు వచ్చి ఎంక్వయిరీ చేస్తున్నారు.

పోలీసులు హైదరాబాద్ లో విచారణకి చంద్రకళ ని పిలిచారు .

"నీ భర్త రవి గురించి ఈ హత్య విషయంలో ఏమి చెబుతావు"

"నా భర్త చాలా మంచి వాడు. కానీ కొంత కాలంగా ఒక అమ్మాయి తో క్లోజ్ గా ఉంటున్నాడు. ఒక సారి నేను వాళ్ళని దగ్గరగా, చూడకూడని పరిస్థితిలో చూసాను"

"ఆ అమ్మాయి పేరు తెలుసా నీకు?"

"తెలియదు."

"పోనీ ఆ అమ్మాయని గుర్తు పట్టగలవా?" ఆ తల ఫోటో చూపించారు.
చంద్రకళ - "ఈ అమ్మాయే" అని చెప్పింది.

వాళ్ళిద్దరికీ గొడవ అయ్యింది. రవి యే ఆ అమ్మాయిని హత్య చేసాడు. అందుకే టూర్ పేరుతో వైజాగ్ వెళ్ళాడు.

పోలీసులు రవి ని అనుమానించి, వైజాగ్ లో అరెస్ట్ చేసారు.

వైజాగ్ లో తల, హైదరాబాద్ ఫ్రిజ్ లో శవం, రెండూ ఒక్కరివే అని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది.

పోస్టుమార్టం రిపోర్ట్ రాగానే, పోలీసులు చంద్రకళ ని కస్టడీ లోకి తీసుకున్నారు.

చంద్రకళ చెప్పిన ప్రకారం, హత్య కాబడ్డ అమ్మాయి తో రవి కి సంబంధం ఉంది. కానీ ఆ అమ్మాయి పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం కన్నె పిల్ల అని తేలింది.

పోలీసులు ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. పోలీసులు చంద్రకళ ని గట్టిగా ప్రశ్నించగా, నిజం చెప్పింది.

రవి కి చాలా ఆస్తి పాస్తులు ఉన్నాయి. ఎప్పుడైతే, రవి ఆ అమ్మాయి తో క్లోజ్ గా ఉండడం చూసిందో, ఆస్తి చేజారిపోతుందని అనుకోని, ప్లాన్ ప్రకారం వైజాగ్ లోనే ఆ అమ్మాయిని హత్య చేసి, తల బీచ్ లో పాతి, మిగిలిన శరీరం హైదరాబాద్ తీసుకొని వచ్చి, ఫ్రిడ్జ్ లో పెట్టింది. ఆలా చేస్తే నేరం రవి మీదకు పోతుందని ప్లాన్. ఇంట్లో పని వాళ్ళు ఉండడం తో, ఫ్రిజ్ తాళం పోయినట్టు, విరగొట్టడం నాటకం ఆడింది. పని మనిషి సాక్ష్యం బలంగా ఉండడానికి.

అంతేకాదు, రవి కి ఉరి శిక్ష పడేటట్టు చేసి, ఆ ఆస్తితో, తన ప్రియుడు రాకేష్ తో హాయిగా ఉండడానికి ప్లాన్ వేసింది. రాకేష్ ఎవరూ కాదు, ఇంటి ఓనర్.

చంద్రకళ, ఆ అమ్మాయిని హత్య చేసి, వైజాగ్ లో తల ను పాతి పెట్టింది. హైదరాబాద్ లో రాకేష్ సహాయం తో ఫ్రిడ్జ్ లో మొండెం పెట్టింది. ఇల్లు కూడా, చంద్రకళ ఆన్లైన్ లో అడ్వాన్స్ ఇచ్చినట్టు రవి కి చెప్పింది.

కోర్ట్ లో వాదనలు జరిగాయి. రవిని ప్రశ్నించగా " నాకూ ఆ అమ్మాయి కి ఎటువంటి సంబంధం లేదు. నేను, తాను మార్కెటింగ్ కొలీగ్స్ అంతే" అన్నాడు.

చంద్రకళ ను, రాకేష్ ను కూడా విచారించారు. వాదనలు ముగిశాయి.

కోర్ట్ రవి ని విడుదల చేసి, చంద్రకళ - రాకేష్ కు శిక్ష విధించింది.

మరిన్ని కథలు

Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ