పులస్య బ్రహ్మ. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Pulastyabrahma

పులస్యబ్రహ్మ. (పురాణకథ).

పులస్త్యుడు బ్రహ్మ మానస పుత్రులైన ఏడుగురు ప్రజాపతులులో ఒకరు. ప్రస్తుతంజరుగుతున్న మన్వంతరములోని (ఏడవమన్వంతరము) సప్తర్షులలో ఒకడు.

కొన్ని పురాణాలు పులస్త్యుని ద్వారానే మానవాళికి చేరాయి. ఈయన బ్రహ్మ నుండి విష్ణు పురాణాన్ని పొంది, పరాశరునికి బోధించాడు. పరాశరుడు విష్ణు పురాణాన్ని సమస్త లోకానికి తెలియజేశాడు.

పులస్యుడు కర్ధముని తొమ్మిది మంది కుమార్తెలలో ఒకతయిన హవిర్భును వివాహం చేసుకున్నాడు. హవిర్భుద్వారాపులస్యునికి అగస్త్యుడు జన్మించాడు. పులస్యునికి ఇద్దరు భార్యలు. పులస్త్యుని రెండవ భార్య, రాజర్షి పుత్రిక అయిన తృణబిందు నకు కుమారుడు విశ్రవసుడు కలిగాడు. సుమాలి కూతురైన కైకసి వలనవిశ్రవసునికి రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ జన్మించారు.మరోభార్యఇద్విదద్వారా కుబేరుడు జన్మించాడు. ఈ విధంగా పులస్త్యుడు కుబేరుడు, రావణుడు వంటి వారితో సహా సమస్త రాక్షసులకు మూలపురుషుడు.

పులస్యుడు దక్షుని కూతురైన ప్రిథిని వివాహమాడినాడు. ఈమెనే భాగవతములో హవిస్భూగా చెప్పబడింది.

ఇద్విద, తృణబిందుడు, అలంబూష అనే అప్సరసల కూతురు. తృణబిందుడు వైవస్వత మనువు వంశములోని మరుత్తుని సంతతికి చెందినవాడు. తృణబిందుడు యాగము చేసి బిందెల నిండా బంగారాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చాడు. అంత తీసుకొని వెళ్ళలేని బ్రాహ్మణులు చాలా బిందెలను అక్కడే వదిలి వెళ్ళారు. యుధిష్ఠిరుడు యాగము చేసినప్పుడు ఈ బంగారాన్నే తీసుకొని యాగంలో ఉపయోగించాడు. తృణబిందుడు చక్రవర్తి, అందగాడు.

రాజ్యపాలన అనంతరం తృణబిందు ఆశ్రమంలోతపస్సుచేసుకుంటున్నాడు పులస్యుడు. ఇద్దరుదేవతాస్త్రీలు ఆ ఆశ్రమంలో ప్రవేసించి ఆటపాటలతో పులస్యునికి ఆటంకం కలిగించారు.ఆగ్రహించిన పులస్యుడు కన్యలు ఈఆశ్రమంలో ప్రవేసించి తన కంటబడితే తమ కన్యత్వన్ని కోల్పోయి గర్బవతులు అవుతారు " అనిశపించి తపస్సు చేయసాగాడు. ఆవిషయంతెలియని తృణబిందువుని కుమార్తే పులస్యుని కంటబడి గర్బవతి అయింది. ఈవిషయం తెలిసిన తృణబిందువు తనకుమా ర్తెను వివాహంచేసుకోమని పులస్యునికోరగా,అంగీకరించి వివాహం చేసుకున్నాడు. అలా వారికి 'విశ్రవసువు' అనేకుమారుడు కలిగాడు. అతను విద్యావేత్త, తండ్రివలే తపోధనుడు.పెద్దవాడు అయిన తరువాత 'దేవవర్ణి'అనే ఆమెను వివాహంచేసుకున్నాడు. ఆదంపతులకు'కుబేరుడు'జన్మించాడు.'కైకసి' అనేమరోభార్యద్వారా విశ్రవునికి'రావణుడు'జన్మించాడు.

రావణుడు తన తపోశక్తిచే శివుని,బ్రహ్మను మెప్పించి అనేక వరాలుపొంది. కనిపించినరాజులను జయిస్తూ గర్వంతో విర్రవీగసాగిడు.హైహయరాజైన కార్తవీర్యార్జునితో తలపడిన రావణుడు ఓడిపోయి అతని చెరసాలలో బంధీఅయ్యాడు.పులస్యునికి ఈవిషయంతెలిసి ఆయన కార్తవీర్యార్జుని వద్దకు వెళ్లాడు.సాదరంగా ఆహ్వానించి "తమరు విచ్చేసిన కార్యంఏమిటి" అన్నాడు." నాయనా నీచెరసాలలో ఉన్నరావణుడు నామనుమడు అతన్ని బంధవిముక్తుడనుచేయి " అన్నాడు పులస్యుడు. వెను వెంటనే భటులనుపిలిచి చెరసాలలోని రావణుని విడిపించి సగౌరవంగా సాగనంపాడు కార్తవీర్యార్జునుడు.

మరిన్ని కథలు

mamidi komma malli poochenulae
మామిడి కొమ్మమళ్ళీ పూచేనులే
- ప్రభావతి పూసపాటి
Avititanam evariki?
అవిటితనం ఎవరికి?
- రాము కోలా.దెందుకూరు
Kannappa
కన్నప్ప
- పుల్లేటికుర్తి కృష్ణ మోహన్
Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati