పెళ్ళి చేసుకో.. - తాత మోహనకృష్ణ

Pelli chesuko

ఒక వయసు వచ్చాక, మగాడి దగ్గర అందరూ అడిగే మాటలు...పెళ్ళి, పెళ్ళాం గురించే. అలాగే మన హీరో కు కూడా ఆ సందర్భం ఎప్పుడూ వస్తూనే ఉంది. ఒకరోజు మన హీరో ను పెళ్ళి గురించి మళ్ళీ అడిగేసింది అక్క అను.

"పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు తమ్మడు? ఇలాగే ఉంటే, ఎలాగ చెప్పు?"

"పెళ్ళా అక్కా! పెళ్ళి చేసుకుంటే, పెళ్ళాం వస్తుంది..హింస పెడుతుంది. నా కెందుకు చెప్పు?... అమ్మ ఉంది..నన్ను చూసుకుంటుంది. నువ్వు అప్పుడప్పుడు మంచి సలహాలు ఇస్తావు..నాకు అది చాలు...!"

"నాకు పెళ్లైంది రా! నేను ఎప్పుడూ నీ కోసం ఉండను. నాకూ సంసారం..పిల్లలు ఉన్నారు. అయినా, ఎవరు చెప్పారు నీతో, పెళ్ళాం హింస పెడుతుందని?"

"అబ్బో! సంసారం? నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో నాకు తెలుసు అక్కా...!"

"ఒరేయ్! పెళ్ళి లో కష్టాలు..నష్టాలు ఉన్నా, ఆనందాలు, లాభాలు కూడా ఉంటాయి. జంట గా జీవించడంలో మజా ఉంటుంది. ఇప్పుడు అమ్మ నీకు అన్నీ చేసి పెడుతుంది. నేను నీకు ఏమైనా సలహా కావాలంటే, ఇస్తున్నాను. ఒక పది సంవత్సరాలు పోయాక..అప్పుడు నీకు ఎవరు చేస్తారు? అప్పుడు పెళ్ళాం కావాలంటే, ఎవరూ పిల్లని ఇవ్వరు. ఇంట్లో పనివాళ్ళు ఉన్నా, ప్రేమ తో చూస్తారా? ప్రేమతో మాట్లాడతారా? చెప్పు? అందుకే, పెళ్ళి చాలా ముఖ్యం రా తమ్ముడు!"

"నువ్వు చెప్పింది నిజమే అయితే..! ఇప్పుడు నువ్వు ఇక్కడకు వచ్చి..రెండు రోజులైంది కదా! ఇంకా రెండు రోజుల వరకు నిన్ను ఇంటికి పంపను. బావ వస్తాడేమో చుద్దాం! నువ్వు.. బావ ఫోన్ చేసినా, మాట్లాడకు అక్కా!"

"అలాగే.. తమ్ముడు! నీ పెళ్ళికి రెడీ గా ఉండు మరి!"

నాలుగో రోజు కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన అను ఎదురుగా, తన భర్త నిల్చొని ఉన్నాడు. "అనూ.." అంటూ వెంటనే వాటేసుకున్నాడు.

"ఏమిటండి ఇది? నాలుగు రోజులకేనా?"

"ఏం చెప్పమంటావు అను! వంట వండుకోలేను..హోటల్ లో తినలేను, బట్టలు ఉతకడానికి టైం లేదు, గల గల మాట్లాడే నువ్వు లేవు..పక్కన నువ్వు లేకపోతే అసలు నిద్ర పట్టట్లేదు..ఏం చెయ్యమంటావు?"

"సరే లెండి! అందరూ చూస్తారు...!"

"చూసాను లే అక్కా! మీ సినిమా..అంతా! "

"ఇప్పుడు అర్ధమైందా తమ్ముడు..నేనే గెలిచాను. నా మాట విని పెళ్ళి చేసుకో.."

"అలాగే అక్కా!"

"ఒకటి మాత్రం ఇంపార్టెంట్! మంచి మనసున్న అమ్మాయిని చూసి చేసుకో..లేకపోతే లైఫ్ రివర్స్ అవుతుంది.."

"నీ లాంటి మంచి అమ్మాయిని చూడు అక్కా!"

****

మరిన్ని కథలు

Nalugu prasnalu
నాలుగు ప్రశ్నలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Satpravarthana
సత్ప్రవర్తన
- చెన్నూరి సుదర్శన్
Chalicheemalu kaadu
చలిచీమలు కాదు
- జి.ఆర్.భాస్కర బాబు
Enta chettuki anta gaali
ఎంతచెట్టుకు అంత గాలి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా