బతుకు బండి - బొమ్మన నవీన్

Batuku bandi

మరో పది నిముషాలలో రైలుబండి కదిరి స్టేషన్ చేరుకోనుంది. లగేజ్ మొత్తాన్ని మరోసారి చెక్ చేసుకొని, పడుకున్న తన మూడేళ్ళ కూతురు హారికను భుజన వేసుకొని రైలు దిగడానికి సిద్ధం అయ్యింది అనిత. " అనితకి పెళ్లి అయ్యి 8 ఏళ్ళు అయ్యింది. తండ్రి చూసిన సంబంధం ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నప్పటికి, అత్తారింట్లో వేధింపులకు గురికాక తప్పలేదు. చూసి చూడన్నట్టు ఉండే అత్త మామ, అయిష్టంగానే కాపురం చేస్తున్న భర్తతో 8 ఏళ్ళు నెట్టుకొచ్చింది. 5 నెలల క్రితం అత్త పోవడంతో, మామయ్య గంగిరెడ్డి అనిత వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే ఉంటున్నాడు. అనిత భర్తది ప్రైవేట్ ఉద్యోగం కావడంతో నెల్లూరులో కాపురం ఉంటోంది. పండగ సెలవులు కావడంతో పుట్టింటికి వెళ్తోంది ". రైలు మొదటి ప్లాటుఫారంలో ఆగింది. పండుగ కావడంతో స్టేషన్ అంతా రద్దిగా ఉంది. అనిత మామయ్యకి కాల్ చేసి స్టేషన్ కి రమ్మనింది. కానీ మామ స్టేషన్లో కనపడకపోయే సరికి కొంచెం దిగాలుగా రైలు దిగుతు లగేజ్ కూడా దింపుకుంది. ఆ రద్దీలో కూతురు హారిక తో పాటు లగేజ్ ని స్టేషన్ బయటకి తీసుకోచ్చేసరికి తలప్రాణం తోకకోచ్చినట్టు అయ్యింది అనితకి. స్టేషన్ బయట మామయ్య కనిపించేసరికి ఒకింత కుదపుపాటుకి లోను అయ్యింది అనిత. అనిత పలకరించిన పెడమోహం వేసుకున్న మావయ్య ని చూసి నిట్టూర్పు గా లగేజ్ తీసుకొని స్కూటీలో ఇంటికి బయలుదేరింది.కొడుక్కి లేనిపోని మాటలు చెప్పి అనితని పెట్టిన హింసలు అన్ని ఇన్ని కావు. అందుకే అనితకి అత్తింటి వాళ్లకి మాటలు అంతంత మాత్రమే. కానీ ఇప్పుడు చొరవ తీసుకొని మాట్లాడిచ్చిన స్పందన లేకపోయేసరికి కొంచెం బాధపడక తప్పలేదు అనిత. ఇంటికి చేరేసరికి పావుగంట పైనే పట్టింది. అప్పటికి కూతురు మానవరాలి కోసం ఎదురుచూస్తున్న అనిత తండ్రి, గేట్ వద్దే ఎదురుచూస్తూ కనపడ్డాడు. స్కూటీ దిగగానే తాతయ్య దగ్గరకి పరిగత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుంది హారిక. అనిత తండ్రి కూతుర్ని పలకరించి లగేజ్ లోపలకి తీసుకుపోయడు. అనిత ఇంట్లోకి వెళ్తూనే అమ్మని పలకరించి ఫ్రెష్ అవుదాం అని వెళ్ళింది. అనిత అమ్మ కూతురుకి ఇష్టంఐన నాటుకోడి వండుతూ ఉంది. అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. అనిత మావయ్య మాత్రం బయటే తినేసి రావడంతో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. నాటుకోడి లోకి అలసంద వడలు తింటున్న అనితకి భర్త శ్రీనివాస్ నుంచి ఫోన్ వచ్చింది. అనిత భర్తకి ఆఫీస్ ఉండడంతో ఒకేసారి రాలేకపోయారు. శ్రీనివాస్ మంచివాడు ఐనప్పటికి, తండ్రి చెప్పే బూటకపు మాటలు విని అనిత మీద కోప్పడేవాడు. అనిత మాత్రం కాలం ఏ సమాధానం చెబుతుంది అనుకుంటూ ఉండేది. కాల్ ఎత్తగానే గంభీర్యంగా మాట్లాడటం మొదలుపెట్టిన భర్త మాటలు వినసాగింది. ఆ మాటలు విన్న అనిత కంట్లో నీరు తినే కంచంలో పడసాగాయి. ఇవన్నీ గమనిస్తున్న తల్లి చేసేదేం లేక వంటగదిలోకి అనితని తీసుకెళ్ళింది. అనిత మావయ్య భర్త కి చెప్పిన మాటలకి, శ్రీనివాస్ మళ్ళీ అనితకి కాల్ చేసిన నానా మాటలు అనడంతో, తన తప్పు లేకపోయిన ఇన్ని అవమానాలు పడాల అంటూ తల్లి భుజన తల పెట్టి ఏడవసాగింది. తల్లి కూతుర్ని ఓదారుస్తూ " బతుకు బండి బాటలు ఒకేలా ఉండవమ్మా " అంటూ అంది. చేసేది ఎం లేక కాలం గడపసాగింది అనిత. ఒకరోజు మావయ్యకి పక్షవాతం వచ్చింది అని నాన్న ఫోన్ చేసేసరికి భర్తతో కలిసి హాస్పిటల్ కి బయలుదేరింది. పక్షవాతంతో బెడ్ మీద ఉన్న మామని చూసి బాధపడింది అనిత. పదిరోజుల డిశ్చార్జ్ తరువాత మావయ్యని తీసుకొని నెల్లూరులోని ఇంటికి బయలేదేరారు. సరిగ్గా నడవలేని మావయ్యని బెడ్ మీద పడుకోబెట్టారు ఇద్దరు. ఇక రోజు పక్షాపాతం పడియన్న మావయ్యకి సపవర్యలు చేయసాగింది. బయటవారు అందరూ అతన్ని అనాధ ఆశ్రమంలో వదిలేయమన్న వాళ్ళమాటలు పట్టించుకోలేదు అనిత. పిల్లలతో పాటు, మావయ్యని అనిత ఒక్కటే చూసుకునే సరికి అలిసిపోయేది. అలా ఒకరోజు పిల్లల్ని స్కూల్ కి పంపి ఇంట్లో పనులు ముగించేసరికి అలిసిపోయి కునుకు తీసింది. కలలో అమ్మ చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి. " బ్రతుకు బండి దారి ఒకేలా ఉండదు అని " చెప్పిన మాటలు ఇప్పుడు నిజం అయ్యేసరికి, ఉలిక్కిపడి కలలోంచి లేచి బెడ్ మీద ఉన్న మావయ్యకి మందులు ఇవ్వడానికి వెళ్ళింది అనిత.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల