కురుక్షేత్ర సంగ్రామం. 6.
అసలు కురుక్షేత్రానికి ఆపేరు ఎలావచ్చింది?.
పూర్వము సంవరణుడను రాజు సూర్యుని కుమార్తె యైన తపతిని వరించాడు. సంవరణుడి గురువైన వసిష్టుడు సంవతణుని కోరిక గ్రహించి సూర్యుని ఒప్పించి వారిరువురకు పెళ్ళి చేసాడు. వారికి కురువు అను కుమారుడు జన్మించి మాహామేదావియై పదునారేండ్లకే సర్వవిద్యా సంపన్నుడయ్యాడు. సంవరణుడతనికి రాజ్యాభిషేకము చేసాడు. అతనికి సామాన్య రాజులవలె రాజ్యపాలనముచేసి మృతి చెందుట ఇష్టము లేదు. శాశ్వతమైన కీర్తిని సంపాదించిన అమరత్వము పొందాలని కోరుకుని, ఎక్కడ తాను కృషి చేసిన తన కోరిక నేరవేరగలదో యని అన్ని ప్రదేశములను పరిశీలిస్తూ తిరుగి శ్యమంత పంచక మున్న ప్రదేశమును జూచి యిది తన కృషికి సరియైన ప్రదేశమని అనుకుని అచ్చట బంగారు నాగలికి ఒక వైపున రుద్రుని వ్రుషభమును, రెండవ వైపున యముని మహిశామును గట్టి స్వయముగా దున్న నారంభించెను. ఇంద్రుడు వచ్చి యేమి చేయుచున్నావని యడుగగా, కురువు, "నేను ఈ క్షేత్రమున శాశ్వత కీర్తినిగోరి, సత్యము, తపము, క్షమ, దయ, శౌచము (పవిత్రత), దానము, యోగము, బ్రహ్మచారిత్వము అను అష్టాంగములను పటించవలెనని దున్నుచున్నానని చెప్పెను. తరువాత శ్రీహరి వచ్చి, "రాజా! నీవు చెప్పిన అష్టాంగములకు బీజము లెక్కడ నున్నవి? నాయందే కదా! " అనెను. ఆ బీజముల నిమ్మని కురువు తన ఎడమ చేయి చాచెను. విష్ణువు దానిని నరికెను. పాదములతో యాచించగా వానిని గూడ నరికెను. అంతట ఆ రాజు "నా శిరము నరికినను ఇష్టమే కాని ఆ బీజములు మాత్రము ఇచ్చట చల్లి వెళ్ళు " అని ప్రార్థించెను. అపుడాతని ధర్మ బుద్ధికి మెచ్చి శ్రీహరి, అతనికి దివ్య శరీరమును నను గ్రహించి, "రాజా! నీ పేరుతొ ఈ క్షేత్రము "కురుక్షేత్రమని" ప్రసిద్ధి కెక్కును. ఇది ధర్మక్షేత్రము. ఇక్కడ నున్న ఈశమంతపంచకములోను, వీని మధ్యనుండి ప్రవహించుచున్న " పృథూదక" మను ఈ నదిలో స్నానము చేసిన వారికి అనంత పుణ్యఫలములు కలుగును. ఇచ్చట దానములు చేసినచో ఇతర క్షేత్రములందు చేసినదానికన్నా కోటి గుణితమైన ఫలము కలుగును". అని వరమిచ్చి విష్ణువు అంతర్ధానం అయ్యాడు.
మరొక కథనం.
పూర్వం పరశురాముడు క్షత్రియ వధ చేసి, ఒకచోట ఐదు రక్త తటాకాలను నిర్మించాడు. ఆ తరువాత కురువు అనే రాజర్షి ఈ హింసా ప్రక్రియకు పరితాపపడి ఆ ప్రదేశాన్ని నాగళ్లతో దున్నించి ఆ స్థానంలోనే తపస్సు చేశాడు. దానికి ఫలితంగా దేవేంద్రుడు ప్రత్యక్షమై ఈ ప్రదేశంలో యుద్ధాది కారణాలవల్ల మరణించినవారికి స్వర్గం లభిస్తుందని వరమిచ్చాడు. అందువ్ల ఆ ప్రదేశానికి అప్పటినుంచీ కురుక్షేత్రమనే పేరు వచ్చింది. కౌరవ పాండవ యుద్ధం వచ్చినప్పుడు తమ యుద్ధంలో ఏ పక్షము వారు మరణించినా వారికి స్వర్గ ప్రాప్తి కలగాలనే తలంపుతోనే వాళ్లు కురుక్షేత్రాన్ని తమ యుద్ధ క్షేత్రంగా నిర్ణయించుకున్నారు.
ఈ వివిధ కాలాలలో ప్రాంతాన్ని బ్రహ్మవేది, ఉత్తరవేది, ధర్మక్షేత్ర, కురుక్షేత్ర అని పిలువబడుతుంది. కురుమహారాజు ఇక్కడకు వచ్చే సమయంలో ఇది ఉత్తరవేది అని పిలువబడింది. ఈ భూమిని పలురాజులు పరిపాలించారు. తరువాత భరతచక్రవర్తి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాడు. తరువాత మహాభారత యుద్ధం జరిగింది. యుద్ధం ఆరంభించే ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసాడు
మహభారతంలో ధర్మరాజుకు ,ధర్మరాజు-యథిష్ఠుడు-అజమీడుడు-అజాతశత్రువు-భారత-భారతశార్ధుల-భారతప్రవర్ష-భారతతర్షభ-భారతసత్తమ-భారతసింహం-భీమపూర్వజ-ధర్మజ-ధర్మనందన-ధర్మసూను-ధర్మసుత-ధర్మతనీయ-ధర్మాత్మజ-కౌంతేయ-కౌరవ-కౌరవశ్రేష్ఠ-కౌరవవ్యాగ్ర్య-కౌరవనందన-కౌరవనాధ-కౌరవవర్షభ-కౌరవసత్తమ-కౌరవవంశవర్ధన- కౌరవేంద్రా-కౌరవ్య-కుంతినందన-కుంతిపుత్ర-కుంతిసుత-కురుశార్ఢుల-కురుశ్రేష్ఠ-కురుశ్రేష్ఠతమ-కురుద్వహ-కురుకులశ్రేష్ఠ-కురుకులోద్వహ-కురుముఖ్య-కురునందన-కురుపాండవాగ్ర్య-కురుపతి-కురుప్రవర-కురుపుంగవ-కురురాజజా-కురుసత్తమ-కురూత్తమ-కురువర్ధన-కురువీక్షక్షక్షర-కురువృషభ-మృదంగకేతు-పాండవ-పాండవశ్రేష్ఠ-పాండవవ్యాగ్ర-పాండవానందన-పాండవవర్షభ-పాండవేయ-పాండునందన-పాండునృపాత్మజ-పాండుపుతత్ర-పాండుసూను.పాండుసుత-పాంవీర-పార్ధ-యాదవిమాతః-యాదవిపుత్ర వంటి పేర్లతో పిలువబడ్డాడు.
కర్ణునికి పలుపేర్లు.
కర్ణుడి అసలు పేరు వసుసేన. దీనికి అధిరథ మరియు అతని భార్య రాధ పేరు పెట్టారు.
కర్ణుడిని రాధేయ అని పిలుస్తారు, ఎందుకంటే అతను రాధకు దత్తపుత్రుడు, అతనిని ఆమె కొడుకుగా పోషించాడు.
అతిరథి కర్ణుని పెంపుడు తండ్రి. అందుకే అతిరథి అని పిలిచాడు. అధిరథి కుమారుడు.
కర్ణుడు
కర్ణ అంటే చర్మం/సహజ కవచం ఒలిచేవాడు అని అర్థం. ఇంద్రుడు అతనికి కర్ణ బిరుదు ఇచ్చాడు.
సూర్యపు త్ర
కర్ణుడు సూర్య దేవత సూర్యుని కుమారుడు. అతను సూర్యపుత్ర అని పిలుస్తారు. సూర్యుని కుమారుడు.
కర్ణుడు తన (సహజమైన) కవచాన్ని మరియు అతని అద్భుతమైన చెవిపోగులను కత్తిరించి, వాటిని ఇంద్రుడికి ఇచ్చాడు, అందుకే అతనికి "వైకర్తన" అని పేరు వచ్చింది.
కర్ణుడిని అంగరాజు లేదా అంగరాజు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అతడు అంగదేశానికి రాజు. ఇది కర్ణుడి పేరు కూడా.
వృ ష
వృష అంటే వాక్కులో సత్యవంతుడు, తపస్సులో నిమగ్నమై, తన స్వరాన్ని కాపాడుకునేవాడు, శత్రువుల పట్ల దయగలవాడు. అప్పుడు వృష అంటే ఎద్దు. అందుకే కర్ణుడిని మహాభారతంలో వృషుడు అని సంబోధించారు - ఎద్దు వంటి యోధుడు.
విజయధారి
విజయ విల్లు ఒక ఆయుధం. ఇది కర్ణుడికి తన గురువైన పరశురాముడిచే బహుమతిగా ఇవ్వబడింది. అప్పుడు కర్ణుని విజయధారి అని అంటారు.
కర్ణుడు సూత లేదా సౌత కులానికి చెందిన రథసారథి (అధిరథి) కుమారుడు.
వాస్తవానికి,. అతడు సూతపుత్రుడు కాదు. అతడు సూర్యపుత్రుడు...
మహాభారతంలోనిపర్వాలు 18.యుథ్థంలో పాల్గోన్న 'అక్షౌహిణీల సంఖ్య18. యుద్ధం జరిగిన రోజులు18.యుధ్ధంలో ప్రయోగించిన ప్రధాన అస్త్రాలు18.అక్షౌహిణీఅనగా...
ఏనుగులు...21870-రథాలు21870-గుర్రాలు65610-పదాతిదళము 109350 .మొత్తంకూడితే 218700.ఈమొత్తంకూడితే 18 వస్తుంది. మహాభారత యుధ్ధంలో అనేకయుధ్ధ నియమాలు పాటించారు.తను రథంపై ఉండి రథం దిగినవాడితోనూ ,సిధ్ధంగాలేని వారితోనూ, నిరాయుధుడితోనూ ,యుధ్ధం చేయకూడదు. 'సమఉజ్జి 'అయిన వారితో యుధ్ధంచేయాలి అన్నది నియమం. ఆయుధ్ధరంగంలో పలు దివ్యఅస్త్రాలు కలిగివీరులు ఎందరో ఉన్నారు. అర్జునిని వద్ద'పాశుపతాస్త్రము' ఇరువర్గల వద్ద'బ్రహ్మస్త్రము''భగదత్తునివద్ద'వైష్ణవాస్త్రము.కర్ణునివద్ద'ఇంద్రాస్త్రము'శివునిద్వారా అశ్వత్ధామపొందిన'ఖడ్గము'మరియు'నారాయణాస్త్రము' 'బ్రహ్మశిరోనామకాస్త్రం'మరియు'వాయువ్యాస్త్రం'కలిగిఉన్నాడు.అర్జున-శిఖండిలవద్ద'ఇంద్ర-వరుణ-ఆగ్నేయాస్త్రము' 'కీర్తినీయాస్త్రంము-నాగాస్త్రం'కలిగిఉన్నారు.త్రిగర్తాధిపతివద్ద'గరుడాస్త్రం'కర్ణునివద్ద'భార్గవాస్త్రం''మేఘూస్త్రం'వంటి పలు భీకరఅస్త్రాలు కలిగిఉన్నారు.
ఆరవరోజు యుధ్ధంలో పాండవులు మకరవ్యూహంతోనూ,కౌరవులు క్రౌంచవ్యూహంతో సిధ్ధమై యుధ్ధంలోఎదుర్కొన్నారు.తొలుత ద్రోణుడు భీమునితోతలపడ్డాడు.తనశర పరంపరలతో ద్రోణుని నిలువరించి అతని రథసారధిని నేలకూల్చాడు.తనరథాన్ని తానేనడుపుకుంటూ ద్రోణుడు వైదొలగాడు.కురు కుమారులు కొందరు భీమునిపై దాగికిదిగారు. వీరవిహారం చేస్తున్న భీమునికి తోడుగా వచ్చిన ధృష్టద్యుమ్నుడు కౌరవసేనలపై'సమ్మోహనాస్త్రం' ప్రయోగించాడు.అదిగమనించిన ద్రోణుడు దానికి విరుగుడుగా'ప్రజ్ఞాస్త్రం'విడిచి తమసేనలనుసమ్మోహంనుండి రక్షించాడు.వెనువెంటనే ద్రోణుడు పాండవసేనాని విల్లువిరచి, గుర్రాలను, సారధిని నేలకూల్చాడు.అప్పుడు అభిమన్యుడు వచ్చితన రథంపై ఎక్కించుకుని ద్రోణునితో తలపడ్డాడు.దుర్యోధనుతో తలపడిన భీముడు అతన్ని విరథుని చేసి శరవర్షంకురిపించాడు.కృపుడు దుర్యోధనుని తనరథం ఎక్కించుకుని భీమునితో తలపడ్డాడు.ఉపపాండవులు సైంధవుని తీవ్రంగా నొప్పించారు.అంతలోనే సూర్యాస్తమం కావడంతో యుధ్ధం ఆగిపోయింది.