Date - బొబ్బు హేమావతి

డేట్

అతను ఆమె మీద ప్రేమ అనే సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. ఆ రోజు సాయంత్రం తన స్నేహితులతో మాట్లాడుతూ అన్నాడు.... కాలేజీ గేట్ ముందు కూర్చుంటాను ఈ రోజు... చేపల వేట ...అని నవ్వుతూ... ఎంతమంది పడతారో నాకు చూడండి అన్నాడు.

ఒక్కరు కాదు రా .... ముగ్గురు పడ్డారు .... నా చూపులకు అంటూ .... నవ్వుకున్నాడు. పాపం ఒక్కరు కాదు ...ముగ్గురు అమాయకులు... ప్రేమ అనుకున్నారు . వారి వైపు డీప్ ఐస్ వేసుకుని వాళ్ళు వస్తుంటే వారినే చూసి నవ్వాడు, ఒకరికి తెలియకుండా ఒకరిని పడేసాడు.

చార్మింగ్ పర్సనాలిటీ... వయస్సు ఉన్న కోడెద్దు అతను... దినేష్. ఆదిలక్ష్మి కాలేజీ లో చేరగానే. పసిపిల్ల లా నవ్వుతుంటే... చూసాడు సీనియర్... దినేష్. ఏదో ఆకర్షణ. వ్యవహారం నడుపుదాం అనుకుని... నాటకీయంగా తనతో మాట్లాడుతూ అన్నాడు... నేను చాలా అల్లరి చేస్తాను అనగానే... అమాయక ఆదిలక్ష్మి... నేను చేస్తాను అంది. అతనితో స్నేహం కావాలి అనుకునింది.

తను కాలేజీ బస్ దిగి వస్తూ ఉంటె, ప్రతి రోజు ఎదురుగా నిల్చొని నవ్వుతూ... అబ్బో ఇతను నన్ను ప్రేమిస్తున్నాడు అనుకునింది. వాడేనా అల్లరి చేసేది నేను చేయలేనా అనుకునింది. వాడికి తెలియకుండా వాడికి ఒకరోజు స్పోర్ట్స్ క్లాస్ లో ఎదురు వెళ్ళింది. ఇంకొకరోజు స్నేహితురాలి తో కలిసి కాంటీన్ లో ఎదురుపడి పలకరించింది.

దినేష్... గిరి తో అన్నాడు... రేయ్ మామా.... నన్ను ట్రాప్ చెయ్యాలని అనుకుంటుంది రా... ఈ పొట్టిపిల్లా అని నవ్వుతూ... ఇప్పుడు చెప్తాను చూడు అంటూ... కన్ను గీటాడు.
ఆరోజు ఆదిలక్ష్మి కి .... చెప్పాడు... నాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది ... అని నవ్వాడు. పాపం ఆమె మొహం నల్లగా మాడిపోయింది. అల్లరి అంటూ... తనని అల్లరి పెట్టి... ఆకర్షించి... అప్పుడే పెళ్లి అంటున్నాడే అనుకునింది.
పెళ్లి కుదిరి ఉంటే ... నాతో ఈ నాటకం ఎందుకు అనుకుని... కొంచం జాగ్రత్తగా ఉండాలి అనుకుని... వాడికి దూరంగా ఉండసాగింది.
ఇంతలో ఆదిలక్ష్మి కి పెళ్లి కుదిరింది.

వెంటనే దినేష్... ఆమె చుట్టూ తిరుగుతూ... ఆమెతో ఫ్లాట్టేరీ అదే ఆమెను పొగడడం మొదలు పెట్టాడు. ఆదిలక్ష్మి నవ్వి ఊరుకుంది. ఆమెను తన వైపు తిప్పుకోవడానికి ప్రేమ లో ముంచేయసాగాడు. తనను రమ్మంటూ కాంటీన్ కి తీసుకుని వెళ్ళాడు. ఏదో అపనమ్మకం వాని మీద ఆమెకు. నేను చెప్పినట్లు చేయమంటూ... నేను చెప్పినట్లు వినమంటూ... ఆమెను ఆడించసాగాడు.

ఇంకొక పక్క రమ్య కూడా వాడికోసం వాడి చుట్టూ తిరగడం... ఆది లక్ష్మి జాగ్రత్త పడింది. వెంటనే... దినేష్... నన్ను దూరం పెడుతుందా... అని కోపం తెచ్చుకుని ... ఆమె ను వెంబడించి క్లాస్ లో ఎవరూ లేనిది గమనించి... ఆమె మీద మృగం లా ఎటాక్ చేసాడు. అందరికి మంచివాడు... కానీ ఆమెకు అతను ఒక థ్రెట్ . ఇక నన్ను వదిలి ఎక్కడకు పోతుంది అనుకున్నాడు.
ఆమెను వెంబడించి, పొగిడి, ఆమెను పొడిచి పొడిచి చూపుల తో చూసి... పెళ్లి పెళ్లి అంటూ ఆమెను డివాల్యూ చేసి,ఆమె మీద దాడి చేసి తప్పించుకుందాము అనుకున్నాడు. ఆది లక్ష్మి ఎవ్వరికి చెప్పినా నమ్మరు అనుకుని భయం తో పారిపోతుంటే... విషపు నవ్వు నవ్వుతూ ... నన్ను వదిలి నీవు ఎక్కడకు వెళ్ళలేవు అన్నాడు ఆమెతో. ఆమె తనకు తానుగా తనకు లొంగాలి అనుకున్నాడు. అప్పుడు నాకు పెళ్లి అని తెలిసి సెక్స్ కోసం నువ్వు నన్ను కోరుకున్నావు అని చెప్పి తప్పించుకుందాము అనుకున్నాడు.
పిల్లిని కూడా బంధించి చావా గొడితే... పులి అవుతుంది. మరి ఆడ పిల్ల.... ఆడపులి అయ్యింది.
నాకు పెళ్లి అంటూ దినేష్ ఆమెను ట్రాప్ చేసి సెక్సువల్ అస్సౌల్త్ చేసి దానికి ప్రేమ పేరు పెట్టి తప్పించుకుందామని అనుకుంటున్నాడా అనుకుని... పెళ్లి చేసుకో అంటూ వాడి వెంట పడింది.
ఆదిలక్ష్మి కు దొరకకుండా తలవంచుకుని చూపులు మళ్లించుకుని వెళుతూ ... దినేష్ భయపడి వెంటనే దగ్గరి బంధువు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయినా వదల లేదు ఆదిలక్ష్మి. ఎదురుగా వెళ్లి కూర్చుంది. పొడిచి పొడిచి చూడసాగింది. తప్పించుకోలేక ఊరొదిలి పారిపోయాడు. అయినా వదలకుండా ఉత్తరాలు రాసి ప్రేమను కురిపించింది.
పెళ్లి పెళ్లి అంటూ ఉత్త పుణ్యానికి తనను ప్రేమ లోకి లాగి, ఆమెను ప్రేరేపించి, తన కోరికలు తీర్చుకోవడానికి ఆమె లొంగి రాలేదని, ఆమెను పనిష్ చేయడానికి, వేరొక పెళ్లి చేసుకుని ఆమెను ఆమె ప్రేమను ఎగతాళి చేసాడు.
ఆది లక్ష్మి... ఆది శక్తి అయింది. వదలక వెంబడించింది... నాకు జవాబు కావలి అని అనుకుంటూ...
డేట్ పేరుతొ... అమ్మాయిలను మోసగించే అబ్బాయిలకు గుణపాఠం చెప్పింది.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల