పెళ్ళైన కొత్తలో - తాత మోహనకృష్ణ

Pellaina kottalo

సుహాస తో సందీప్ పెళ్ళి జరిగి ఒక నెల అవుతోంది. సుహాస ఒక చక్కని చుక్క..చూడడానికి బాపు బొమ్మ లాగ అందంగా ఉంటుంది. సందీప్ ఒక ప్రైవేట్ కంపెనీ లో పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. ఒక రోజు సాయంత్రం భార్య బట్టలు సర్దుతుంటే....

"అబ్బా..! ఏమిటి ఈ చిలిపి చేష్టాలు.." అంది భర్య సుహాస
"నేను ఏం చేసాను..డియర్..!"
"మీరు మరీ పోకిరి గా తయారైపోతున్నారు..మీ చేతులు ఎప్పుడూ తిన్నంగా ఉండవ్.."
"ఏం చేశాను చెప్పు..ప్రతీ భర్త భార్యతో రొమాంటిక్ గా చేసేదే..కదా.."
"ఛా..! ఏమిటి ఇది..చూడండి..నా పెదాలని ఎలా కొరికేసారో.."
"సినిమా లో మాత్రం ఎంత సేపు హీరో ముద్దులు పెట్టినా..అలా చూస్తావు..లైసెన్స్ ఉన్న మొగుడు పెడితే మాత్రం..అప్పుడే చాలు అంటావు.."
"పెట్టుకోండి..నాకు మాత్రం నచ్చదా చెప్పండి..! ఈ పెదాలు మీ కోసమే కదా..! నా శరీరంలో అణువణువు మీకే సొంతం..జస్ట్ బ్రేక్ ఇమ్మంటున్నాను అంతే..!"
"అయితే వన్ మినిట్ బ్రేక్ తీసుకో.."

అయినా ఇంక చాలు..తొందరగా లెండి ..ఫ్లైట్ కి టైం అవుతుంది..ఇక్కడ నాతో ఇలాగ సరసాలు ఆడుతూ కూర్చుంటే.. ఫ్లైట్ కాస్తా తుర్రు మంటుంది..

"ఖచ్చితంగా వెళ్ళలంటావా సుహా..?"
"ఆఫీస్ పని కదా..వెళ్ళరా మరి..? వెళ్ళకపోతే, మీ బాస్ ఊరుకుంటాడా...?"
"బాగా ఆలోచించుకుని చెప్పు సుహా...నేను వెళ్ళిపోతే, రెండు రోజులు నేను లేకుండా ఉండగలవా..? అసలే కొత్త పెళ్లికూతురివి...నువ్వు 'ఎస్' అంటే, ఇక్కడే ఉండిపోయి..రాత్రంతా నీతో ముచ్చట్లు ఆడుతాను..."

"పదండి..." అని సుహాస...సర్దిన బ్యాగ్ ని ఇచ్చి.. భర్త ని క్యాబ్ ఎక్కించి ఎయిర్ పోర్ట్ కు పంపించింది. సందీప్ మధ్య దారిలో ఫోన్ చేసాడు..
"సుహా...ఎలా ఉన్నావు..? రమ్మంటావా చెప్పు..బాస్ కు ఏదో చెప్పి వచ్చేస్తాను.."
"ఇప్పుడే వెళ్లారు..అప్పుడే ఫోన్..? బుద్ధిగా వెళ్ళండి.." అని చెప్పి ఫోన్ పెట్టేసింది సుహాస

సుహాస స్నానం చెయ్యడానికి రెడీ అయి...బాత్రూం లోకి వెళ్ళి షవర్ ఓపెన్ చేయగా..తలపై నుండి పడిన నీళ్లు కాళ్ళ వరకు జారీ..వొంట్లో విరహాన్ని రెట్టింపు చేసాయి. వెంటనే, భర్త గుర్తొచ్చాడు. సుహాస కి భర్త తనని వదిలి టూర్ కి వెళ్లడం ఇష్టం లేదు. కానీ, ఆఫీస్ పని అని తప్పక పంపించింది. వెంటనే, మళ్ళీ ఫోన్ మోగింది. ఎవరా..? అని బాత్రూములోంచి టవల్ చుట్టుకుని గబగబా బెడ్రూమ్ లోకి వచ్చింది సుహాస.

"మళ్ళీ ఫోన్ ఎందుకు చేశారు..?"
"వాతావరణం బాగోలేదని ఫ్లైట్ డిలే అయ్యింది. ఇప్పుడు ఏం చేయమంటావు సుహా..? "
"మీరే గుర్తుకు వస్తున్నారు..ఉండలేకపోతున్నాను..నేనే ఎయిర్ పోర్ట్ కు వచ్చేస్తాను..మీతో పాటు టూర్ కి వస్తాను..."
"మంచి డెసిషన్ తీసుకున్నావు సుహా...నీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను..తొందరగా రా.. ఫ్లైట్ డిలే చేత ఇక్కడ నాకు ఒక రూమ్ కూడా ఇచ్చారు.."

క్యాబ్ లో ఎయిర్ పోర్ట్ కు బయల్దేరిన సుహాస తన పెళ్ళిచూపులు ఎంత చిలిపిగా జరిగాయో గుర్తు చేసుకుంది..

ఆ రోజు తన పెళ్ళిచూపులు... పెళ్ళి కొడుకు ఫోటో చూసి, ఓకే చేసింది సుహాస. కానీ, అతను ఎలా మాట్లాడతాడో, కోపంగా ఉంటాడో, సరదాగా ఉంటాడో అని తెగ టెన్షన్ పడింది. అసలే, సరదాగా, చిలిపిగా ఉండే భర్త రావాలని ఎప్పుడూ అనుకునేది.

గుమ్మం బయట ఏదో కార్ ఆగింది...

"పెళ్ళివారు వచ్చారు.. చెంబు తో నీళ్ళు తీసుకురండి .." అని నాన్న గొంతు వినిపించింది..
అంతవరకూ ఎంతో ధైర్యం..ఇప్పుడు కాస్త గుండె దడ..అనిపించింది సుహాసకి. కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చారు పెళ్ళివారు. 'అమ్మాయి వచ్చేస్తుంది..కూర్చోండి..' అన్న నాన్న మాటలు వినిపించాయి. వెంటనే, రూమ్ లోంచి నన్ను బయటకు తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. కాఫీ ట్రే ని తీసుకుని వెళ్ళాను. ముందుగా పెళ్ళి కొడుకుకి కాఫీ కప్ ని ఇచ్చాను. కాఫీ అందుకుని..ఒక సిప్ చేసి.. 'చాలా బాగుంది..' అని నా నడుము కేసి చూసి అన్నాడు.

మళ్ళీ సర్దుకుని.."కాఫీ చాలా బాగుంది.." అని గట్టిగా అన్నాడు.
'రసికుడే...' అని మనసులో అనుకున్నాను..

తర్వాత ఇద్దరినీ విడిగా మాట్లడుకోమని పక్క గదిలోకి పంపించారు పెద్దలు. రూమ్ లోకి ఇద్దరం వెళ్ళాము..

"ఇందాకల కాఫీ చాలా బాగుందన్నారు..అంత బాగుందా..?" అడిగింది సుహాస
"మీకు తేలియదా..? అంత అందంగా ఉంటేనూ.."
"రసికులే..నాకు కాబోయే శ్రీవారు.."
"మీరు మాత్రం తక్కువ..కాఫీ చేతికి ఇస్తూ...కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎక్కడో గురి పెట్టి కొట్టారు.." అన్నాడు సందీప్
"అవునా..?"
"వంగి మరీ అంతగా కష్టపడకండీ...నా కొలతలు..36-24-36..మీకు నేను నచ్చానని నాకు తెలుసు..నాకు మీలాంటి రసికుడే భర్త గా రావాలని ఎప్పుడూ ఆ దేవుడ్ని కోరుకున్నాను.." అంది సుహాస
"అయితే..దేవుడు కరునించాడా మరి..?"
"ఆ దేవుడు కరుణించాడు..ఈ దేవుడు..కరుణిస్తే, పెళ్ళి చేసుకుని..సంతోషంగా ఉంటాను.."
"సరే.." అని ఇద్దరూ నవ్వుకున్నారు..

ఎయిర్ పోర్ట్ రావడం తో..హార్న్ సౌండ్ తో ప్రస్తుతంలోకి వచ్చింది సుహాస. క్యాబ్ దిగి..దూరాన భర్తను చూసి...పరిగెత్తుకుంటూ వెళ్లి వాటేసుకుంది...

*********

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల