కురుక్షేత్ర సంగ్రామం . 11. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kurukshetra sangramam.11

కురుక్షేత్ర సంగ్రామం .(11) .

పాంచాలదేశాధిపతి వృషద్రుడు.ఇతని కుమారుడు ద్రుపదుడు .(ద్రుపద అంటే చెట్టు మొదలు అని అర్ధం) ఇతనికి యజ్ఞసేనుడు అనే మరో పేరు కూడా ఉంది.ఇతని రాజధాని కాంపిల్య నగరం.భరద్వాజ ఆశ్రమంలో ఉంటూ ద్రోణునితో అక్కడే విద్యలు నేర్చుతాడు.తను రాజైన తరువాత సహయం కోరివచ్చిన ద్రోణుని అవమానిస్తాడు.ద్రోణుని ,అర్జునుడు గురుదక్షణ ఏమికావాలని అనిఅడుగగా, ద్రుపదుడిని బంధించి తీసుకు రమ్మంటాడు.అర్జునుడు గురుదక్షణ చెల్లిస్తాడు.అవమానంపొందిన ద్రుపదుడు తపస్సు చేసి ద్రోణుని సంహరించే కుమారుడు ద్రుష్టద్రుమ్నుడు,అర్జునుని వివాహం చేసుకునే కూతురు ద్రౌపతి,తో పాటు భీష్ముని మరణానికి కారణమైన శిఖండి ని సంతతిగా పొందుతాడు. పాండవులు లక్కఇంటిలో మరణించారని బాధపడగా వేగుల ద్వారా వారు సజీవులని తెలుసుకుని ద్రౌపతి స్వయంవరం ప్రకటించి మత్సయంత్రాన్ని ఛేదించ గలిగిన వారికి తన కుమార్తెను యిచ్చి వివాహం జరిపిస్తాను అన్నాడు.

తన కుమార్తెకు అయిదుగురు భర్తలు అంటే చింతిస్తాడు.వ్యాసుడు ద్రౌపతి గత జన్మరహస్యం గురించి వివరించి సమాధాన పరుస్తాడు.

భీష్ముని అంపశయ్య కర్ణుడు రథమును వెళ్ళి కన్నీటితో పాదములకు నమస్కరించి " పితామహా ! రాధేయుడు తమ దర్శనార్ధం వచ్చాడు. కళ్ళు తెరవండి తమరు ఇలా అంపశయ్య మీద ఉండటం విధి విలాసం కాక మరేమిటి. నేను ఈ రోజు నుండి పాండవుల మీద యుద్ధానికి పోతున్నాను. పరమ పావనమైన మీ పలుకులతో నన్ను ఆశీర్వదించండి " అని పలికాడు. భీష్ముడు కళ్ళు తెరవగానే కర్ణుడు నమస్కరించి " అనఘా ! అర్జునుని అహంకారం నేను ఒక్కడినే అణుస్తాను. పాండవులను గడ్డిగరిపిస్తాను నన్ను ఆశీర్వదించండి " అన్నాడు. భీష్ముడు " కర్ణా ! సుయోధనుడు నీ అండ చూసుకునే ఉన్నాడు. కౌరవులకు సుయోధనుడు నువ్వూ అంతే జన్మతః వచ్చిన బంధుత్వం కంటే స్నేహమే గొప్పది కదా ! కౌరవ సేన భారం వహించి సుయోధనునికి మేలు చెయ్యి. అంబష్ట, పౌండ్రాది దేశములు జయించి సుయోధనుని ఆధీనము కావించిన నీకు చెప్పవలసిన పని ఏమి ? కౌరవ సేనను నడిపించి అతడికి విజయం చేకూర్చు. నాకు సుయోధనుడు ఎంతో

నువ్వూ అంతే " అన్నాడు. కర్ణుడు మరొక్క సారి భీష్ముని పాదములకు నమస్కరించి అక్కడి నుండి యుద్ధరంగముకు వెళ్ళాడు. రథ, గజ, తురంగ, పదాతి దళాలను సమీకరించి వారికి ఉత్సాహం కలిగించాడు. అంతలో సుయోధనుడు అక్కడకు వచ్చి " కర్ణా ! నీ రాకతో కౌరవ సేనలు ఉత్సాహాన్ని పుంజుకున్నాయి. మన సేనలు యుద్ధానికి ఉరకలు వేస్తున్నాయి. మన ప్రస్థుత కర్తవ్యం ఏమిటి " అన్నాడు. కర్ణుడు " సుయోధనా ! రారాజువైన నీ ఆజ్ఞ మాకు శిరోధార్యము. నీవే కర్తవ్యాన్ని

నిర్ణయించు " అన్నాడు. సుయోధనుడు " కర్ణా ! భీష్ముని నాయకత్వంలో ఈ పది రోజులు మన సేనలు నడిచాయి. ప్రస్థుతం మనకు ఒక సేనా నాయకుడు కావాలి. కౌరవ సేనలకు నాయకత్వం వహించుటకు ఎవరు అర్హులో నీవే నిర్ణయించాలి " అన్నాడు . కర్ణుడు " సుయోధనా ! మన యోధులందరూ నాయత్వ అర్హత ఉన్న వారే ఒకరిని నియమించిన వేరొకరికి మత్సరం కలుగుతుంది. కనుక ద్రోణుని సైన్యాధ్యక్షుని చేసిన అందరికీ అమోద యోగ్యముగా ఉంటుంది. ఆచార్యుడు, వివిధ రణతంత్ర కోవిదుడు, పూజ్యుడు , శూరుడు, వయోవృద్ధుడైనా వీరుడు అతడిని సైన్యాద్యక్షునిగా అభిషేకించండి " అన్నాడు.

అందరి అనుమతితో ద్రోణుని సర్వసైన్యాధక్షుడుగా అభిషేకించాడు రారాజు.సంతోషించిన ద్రోణుడు" ఏదైనా వరంకోరుకో " అన్నాడు. ధర్మరాజును ప్రాణాలతో పట్టివమని రారాజు అడిగాడు. " నీకోరిక నెరవేరాలి అంటే యుధ్ధరంగంలో అర్జునుడిని దూరంగా తీసుకువెళ్లాలి " అన్నాడు ద్రోణుడు.

మరుదినం పాండవులు క్రౌంచ వ్యూహం నిర్మించారు.అందులో అగ్రభాగాన కృష్ణార్జునులు,వారికి ఇరువైపులా భీమసేనుడు,ధృష్టద్యుమ్నుడు నిలిచారు.కౌరవులు శకట వ్యూహం నిర్మించారు.దానికి కుడి భాగాన సింధూ,కళింగ రాజులతో కర్ణుడు,అతనికి బాసటగా అశ్వబలంతో శకుని,ఎడమ భాగాన కృతవర్మ వివింశతి చిత్రసేనులతో దుశ్శసనుడు, అతనికి బాసటగా శక యపన కాంభోజరాజు ప్రభువులు,మధ్యభాగంలో శుశర్మా,శల్యుడు ,శిబి శూర సేనాధిపతులు, నిలిచారు.

యుధ్ధం ఆరంభంలో తొలి సారి కర్ణుడితో అర్జునుడు తలపడి ఒకరిపై మరొకరు దివ్య అస్త్రాలను ప్రయోగించుకుంటూ భీకర సమరం చెయసాగారు.ద్రోణుడు అరణ్యంలోని దావానలంలా తన శరపరంపరలతో పాండవ సేనలను పరుగులు తీయించసాగాడు.

ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ఎదుర్కోన్నాడు.శకుని సహదేవునితో, అలంబసుడు ఘటోత్కచునితో మాయ యుధ్ధం చేయసాగాడు.

ద్రుపదుడు భగదత్తుని తో తలపడ్డాడు.అభిమన్యుడు సైంధవుని రక్తసిక్తుని చేసాడు.అదేసమయంలో శల్యుడు అటుగావచ్చి సైంధవుని ఆదుకున్నాడు. శల్యుని రధ సారధిని పరలోకానికి పంపాడు అభిమన్యుడు,కోపించిన శల్యుడు తన గధతో అభిమన్యునిపైకి వచ్చాడు శల్యుడు.అభిమన్యుడు తన గధతో శల్యుని తో పోరాడసాగాడు. గాయాలపాలైన ఇరువురి శరీరాల నుండి జివ్వున రక్తం ఎగసినా హుంకరిస్తు పోరాటం సాగించసాగారు.తుదకు ఇద్దరు మూర్చనోందారు. క్షత్రదేవునితో లక్ష్మణ కుమారుడు,చేకితానుడితో అనువిందుడు, నకులుడితో శల్యుడు,ధృష్టకేతువుతో కృపాచార్యుడు,ధర్మరాజును బంధించడానికి ద్రోణుడు రావడం చూసిన ద్రౌపదేయులు,సాత్యకి , విరాటుడు,శిఖండి ధర్మరాజుకు రక్షణగా వచ్చారు.వారందరిని నిలువరించి, వ్యాఘ్రదత్త, సింహసేనుల శిరస్సులు ఖండించి, ధర్మరాజును సమీపించాడు ద్రోణుడు .అది చుసిన కౌరవ సేనలు 'ధర్మరాజు బంధించబడ్డాడు'అని కేకలు వేయసాసాగారు.

ఉరుములేని పిడుగులా వచ్చాడు అర్జునుడు 'నేను ప్రాణాలతో ఉండగా మా అగ్రజుని సమీపించడం అసంభం'అని ద్రోణాది కౌరవ వీరులను శ్వాస తీసుకోనీకుండా శరాలు సంధించాడు . ప్రళయ కాలరుద్రునిలా చలరేగిన అర్జునుని వీరవిహారం ముందు కౌరవుల శౌర్యంచిన్నబోయింది.

సాయంత్రం సూర్యుడు పడమటి కనుమల్లోకి వెళ్లడంతో యుద్ధ విరామ భేరిలు మ్రాగాయి.

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం