ఒక్క సారి మెలుకు వచ్చింది. పక్కనే ఉన్న టేబుల్ మీద సెల్ ఫోన్లలో టైం చూస్తే మూడు ఇరవై. బ్రహ్మ ముహూర్తం. వెంటనే నమో వేంకటేశాయ అని రామ నామ వరాననే మూడు సార్లు చదువు కుని మళ్లీ నిద్ర కి ట్రై చేసా. ఊహూ.. ఇంకా ఎక్కడ వస్తుంది. అలా యేవో ఆలోచనలతో కళ్ళు మూసుకొన్నాను. అలా ఎంత సేపై అయిందో తెలియదు గానీ సెల్ మొగటం తొ ఉలిక్కి పడి అంతా తెల్లారిన ఎవరబ్బా అనుకుంటూ చూస్తే సాయి గాడు. వాడు మా కజిన్. ఏమిట్రా ఇంత పొద్దన్నే అడిగాను అరేయ్ మర్చి పోయావా ఇవాళ ఇయర్ ఎండ్.. పార్టీ ఈసారి మా ఇంట్లొ ఆరంజ్ చేస్తున్నా. మళ్లీ ఎవరూ కంప్టేషన్ కి రాకుండా పొద్దున్నే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా .. మరి నేనేమైనా తేనా ' అంటే ఊహూ.. అన్నీ హోటల్ నుంచి ఆరెంజ్ చేస్తా.. ఈవెనింగ్ ఆరు గంటల కి జ్యోతి నీ తీస్కుని వోచెయ్య్.. వోకే అని ఫోన్ పెట్టేసాడు. అవును నేను మర్చిపోయా ఇయర్ ఎండ్ పార్టీ గురించి.అవును మరి నాలుగు ఏళ్ల కిందట వరకు ఎంతో గ్రాండ్ గా జరుపు కొనేవాళ్ళం. పాత జ్ఞాపకాలు లొకి వెళ్ళి పోయా .. చిన్నపుడు నుంచి మేము అందరం అంటే అమ్మమ్మ సారథ్యం లొ మా ఫ్యామిలీ మా మేనమామ ఫ్యామిలీ కలిసే పెద్ద ఇంట్లో ఉండే వాళ్ళం. మొత్తం పెద్దలు చిన్నలు కలిసి 20 మందికి పైనే. మా అమ్మమ్మ ఇంజన్ అయితే నాన్నగారు మావయ్య చక్రాల్లగా మా ఇంటికి వచ్చే బంధు మిత్రుల తొ నిత్యం పండుగ లాగా ఉండేది మా ఇల్లు. మా కజిన్స్ తో రోజూ క్రికెట్ సరేసరి. అలా మా బాల్యం గడిచిపోయింది. ఒక్కొక్కరు చదువు ముగించి జాబ్స్ తర్వాత పెళ్ళిళ్ళు వేరు సంసారాలు ఆ తర్వాత పిల్లలు. అలా ఒకరినొకరు రెగ్యులర్ గా కలవడం కష్టం ఐపోయింది. మా అందరి పిల్లలు పెద్ద వాళ్లై పోవడం మా జనరేషన్ ఒక్కకళ్ళు గా రిటైర్ అయిపోవడం జరిగిపోయింది. పిల్లలు జాబ్స్ మీద దూరాలకు వెళ్ళడం తొ మేమందరం ఒకే సిటీ లో వుండడం చేత మళ్ళీ అకేషన్ కలిపించు కొని ఖాంధాన్ పేరు తొ ఇయర్ ఎండ్ సెలబ్రేషన్ మొదలెట్టాం. అలా లాస్ట్ 30ఏళ్లుగా ఏదో వంకతో నెలకి ఒక్క సారైనా ఫ్యామిలీలు అదే ఖాన్దాన్ కలిసే వాళ్ళం. ఒక్కకరు ఒక్కో ఐటెం తెచ్చేవారు. ఒక అన్నయ్య గ్రీన్ సలాడ్ లో ఎక్సపెర్ట్. ఒక కజిన్ గరం మిర్చీ ఒకరు జిలేబి ఇంకా బావార్చి బిర్యాని తొ సరేసరి. హలో మందు కూడా వుండేదండోయి. అలా మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వయసుని అధికమించి ఆహ్లాదంగా గడిపే వాళ్ళం. మా నెక్స్ట్ జనరేషన్ కూడా మమ్మల్ని ఫాలో అవడం మాకు గొప్పగా వుండేది. అలాంటిది గత కొన్నేళ్లుగా మా ఖాన్దాన్ నుంచి ఒక్కరి తర్వాత ఒకరు గుడ్ బై చెప్పి అందరినీ విషాదం లో ముంచి లోకం విడిచి వెళ్ళి పోవడం చాలా బాధాకరం. మిగిలిన మేము ఆ ట్రేడిసన్ నీ భారంగా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. చి న్నపుడు అమ్మమ్మ అల్లిన నిండు పూల దండ లో ఇప్పుడు మిగిలింది దారం అందులో వెలవెల పోతున్న మిగిలిన కొన్ని పూలు. నాకు తెలియ కుండానే వర్శిస్తున్న నా కళ్ళను తుడుస్తూ నా మనసు లోని ఆలోచ గ్రహించి జ్యోతి మెల్లిగా నా చెవిలో అంది "మీ దండ నీ మళ్ళీ భర్తీ చేయడానికి మన నెక్స్ట్ జనరేషన్ ఉన్నదిగా".