నీవే నామంత్రి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Neeve naa mantri

అమరావతి నగర సమీపంలోని కృష్ణానది తీరాన ఎగువున అరణ్యంలో సింహరాజు మంత్రి పదవి పోటీకి పలు రాష్ట్రాల జంతువులన్ని పాల్గొనడానికి వచ్చాయి. అప్పుడే వచ్చిన సింహరాజు '' మిత్రులారా ఈ మంత్రి పదవి పోటీకి వచ్చిన ఇతర రాష్ట్రాల వారు నేను అడిగే ప్రశ్నలకు వారి వారి మాత్రుభాషలో సమాధానం చెప్పవచ్చు నాకు చాలా భాషలు తెలుసు. మొదటి ప్రశ్న అక్కడ ఎండమండిపొతుంది తారురోడ్డు పైన చెప్పులు లేకుండా నడవటం అసాధ్యం, అక్కడ ఇద్దరు ఉన్నారు కాని చెప్పులు ఒకరికే ఉన్నాయి ఇద్దరు ఆతారురోడ్డుపైన నడిచి వెళ్ళాలంటే ఎలా? "అన్నాడు. ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. చెట్టుదిగి వచ్చిన కోతి " ప్రభూ అక్కడ ఉన్న చెప్పులు తల్లి తన కాళ్ళకు వేసుకుని ఏడాది వయసు బిడ్డను చంకన ఎత్తుకుని ఆతారు రోడ్డుపైకి వెళితే ఇద్దరూ రోడ్డు పైకి వెళ్ళగలరు "అన్నాడు.

అక్కడ ఉన్న జంతువులనీ కోతి తెలివిని తమ కూతల ద్వారా ఆనందం తెలిపాయి. " మరో ప్రశ్న ఆవు ఎలా ఉంటుంది " అన్నాడు సింహరాజు.

" ఆవు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది.( పసుమాడు ఎప్పిడి ఇరుక్కుమో అప్పిడిదా ఇరుకుం ) అన్నాడు తమిళనాడు నుండి వచ్చిన కోతి. తమిళ కోతి మాటలకు నవ్వాడు సింహరాజు. ఎవ్వరు సమాధానం చెప్పక పోవడంతో " ప్రభు ఆవు ఒకచోట కట్టివేస్తె స్ధరంగా అలా ఉంటుంది. కోతి సమాధానానికి అడవి జంతులన్ని ఆనందంగా తలలు ఊపాయి. " చెరువు ఎలా ఉంటుంది ?" అన్నాడు సింహరాజు." జీక్కనే జోల్ భర్తీ తాకిలే బోలా జాబే తలబ్, ఎక్కబార్ సీత్కాల్ దూకలే బుజజాబే. (ఎక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటాయో అదే చెరువు. ఒకసారి చలికాలం దిగుతే చెరువు ఎలా ఉంటుందో తెలుస్తుంది.)" అన్నది బెంగాలి భాషలో కాకి.

బెంగాలి కాకి తెలివికి నవ్వాడు సింహరాజు.( పాన్యాని భర్లేలా జాగాల తలావ్ మన్తో...నీటితో నిండి ఉన్న చోటును చెరువు అంటారు..) అన్నది మరాఠి రామచిలుక. " ప్రభూ నీళ్ళు వెలుపలకు పోకండా కట్టవేస్తేనే చెరువు స్ధరంగా ఉంటుంది" అన్నాడు తెలుగు కోతి.

" ఏప్రాణికైనా అన్నింటికన్న ముఖ్యమైనది సుఖంగా జీవించడానికి అవసరమైనది ఏది? " హణ ఈద్దరే ఎల్లావు తానాగి బరుత్తవే " అన్నది

కన్నడ కాకి. కాకి సమాధానానికి " ధనం ఉంటే అన్ని వస్తాయి ఇది మనుషులకు మరి మిగిలిన ప్రాణకోటికి ధనం అవసరం లేదుకదా ? "అన్నాడు సింహరాజు.

" ప్రభు ఏప్రాణికైనా ఉన్నంత లో తృప్తి చెందాలి అప్పుడే సుఖ శాంతులతో జీవించగలం. అత్యాశ ప్రమాదకరమైనది అనుక్షణం మనల్ని వేధిస్తుంది "అన్నాడు తెలుగుకోతి.

" తెలుంగుకార్ కి మూల అధికం " ( తెలుగు వారికీ తెలివి అధికం)అన్నాడు తమిళ కోతి.

"యదార్ధం నాప్రశ్నలకు సరైన సమాధానాలు తెలిపిన కోతి నీవే నామంత్రి" అన్నాడు సింహరాజు.

మరిన్ని కథలు

Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati
KARMA VADALADU
కర్మ వదలదు
- తాత మోహనకృష్ణ