ప్రేమ నాటకం - బొబ్బు హేమావతి

Prema naatakam

రవి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నాడు. రవి తండ్రి పొలంలో పనిచేస్తూ అనుకోకుండా మోటార్ కరెంటు టచ్ అయినప్పుడు చనిపోయాడు. అతను తల్లి అప్పటినుండి కూలి పనికి వెళ్లి తన బిడ్డలు ముగ్గురిని సాకింది. ముగ్గురిలో రవికి మాత్రమే చదువు అబ్బింది. రవి కంటే పెద్దోడైన కిషోర్ ఒక వయస్సుకు రాగానే పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం మొదలుపెట్టాడు. రవి ఒకవైపు పొలం పని చేస్తూ ఇంకొక వైపు చదువును ఆపకుండా డిగ్రీ పూర్తి చేశాడు. ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎగ్జామ్స్ అవ్వగానే నంద్యాలలో బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడానికి కోచింగ్ చేరాడు. అక్కడ అతనికి శశికళ పరిచయమై అది ప్రేమగా మారింది. శశికళ రవిలోని టాలెంట్ గమనించి అతనిని మరింత బాగా చదవమని ప్రోత్సహించేది. నీవు బ్యాంక్ ఎగ్జామ్ తెచ్చుకుంటేనే మన పెళ్లికి నా తల్లిదండ్రులు ఒప్పుకుంటారు అని రవితో ఖరాఖండి గా చెప్పేసింది. శశి మీద ఎంతో ప్రేమ ఉన్న రవి ఆమెతో ఎక్కడ పెళ్లి తప్పిపోతుందోనని మరింత శ్రద్ధగా చదివి బ్యాంక్ లో జాబ్ తెచ్చుకున్నాడు. రవి కి జాబ్ రాగానే శశి అతనిని తన తల్లిదండ్రులకు పరిచయం చేసింది. రూపాయి కట్నం లేకుండా ప్రొఫెషనరీ ఆఫీసర్ ను అల్లుడుగా చేస్తున్నందుకు శశికళ తల్లిదండ్రులు ఆమె తెలివిని చూసి ఆనందించారు. శశి తల్లిదండ్రులు తమ పెళ్ళికి ఒప్పుకోగానే, తన ప్రేమ విషయం తన అన్నయ్య కిరణ్ తో చెప్పాడు. రవి తల్లి ఆ పెళ్ళికి ససేమిరా ఒప్పుకోను అన్నది. చెల్లి పెళ్లికి చేసిన అప్పు తలకు మించి భారంగా ఉన్నంతలో కొడుగ్గా నువ్వు ఈ కుటుంబ భారాన్ని ఎత్తుకుంటావు అనుకుంటే ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని అమ్మాయిని తీసుకొస్తావా అని రవి తల్లి రవి ని గట్టిగా కోప్పడింది. కిరణ్ రవి తో నేను అమ్మను ఎదిరించను. అమ్మ చెప్పినట్లు చెయ్యి అంటూ పక్కకు తప్పుకున్నాడు. శశి మీద ఉన్న ప్రేమతో పెళ్లికి కమిట్ కావడం వల్ల అతను ఎవరు లేకుండా ఒంటరిగా వెళ్లి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత రవి ఏదైతే అతని భార్య నుండి కోరుకున్నాడో ఆ ప్రేమ అతని మీద ఆమెకు అస్సలు లేదు. ఆమె చెప్పినట్లు వింటేనే ఆమెకు భర్త మీద ప్రేమ. ఆమెకు నచ్చినట్లు ఉంటూ తన మాటే వింటే అప్పుడు రవి అంటే ఇష్టం చూపేది. అక్కడ రవి డిసప్పాయింట్ అయిపోయాడు. ఏ ప్రేమ కోసం తల్లిని ఎదిరించి సోదరుడిని వదులుకొని పెళ్లి చేసుకున్నాడో ఆ ప్రేమ అతని పట్ల ఆమెకు లేదు. అతను తెలివైనవాడని ఆమె గ్రహించి అతని మీద ప్రేమ నటించి అతనికి ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకున్నది. అతనికి రెండేళ్లకు మూడేళ్లకు ఒకసారి జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యేది. ఆమె అతనితో రావడానికి ఇష్టం చూపేది కాదు. ఆమె తన తల్లిదండ్రులకు దగ్గరగా వారికి ఎదురుగా ఉన్న ఇల్లు అమ్ముతూ ఉంటే రవి తో కొనిపించింది. తరువాత తను అక్కడే ఉండి పిల్లలను చదివించుకుంటూ ఉంటానని తేల్చి చెప్పింది. రవి అప్పటి నుండి ఉద్యోగం పేరుతో దూరం గానే ఉండి ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాడు. రవి తిరిగి తన తల్లిని సోదరుడిని కలిసాడు. కానీ తన సంసారం విషయాలు మాత్రం వాళ్లకి చెప్పలేదు. కన్నతల్లి కనుక ఆమె అతనిని క్షమించింది. ఎప్పుడైనా కోడలును తమ ఊరికి తీసుకుని రమ్మని చెప్పినా , పిల్లలకు నీళ్లు పడవని చెబుతూ రవి మాట దాటవేసేవాడు. ఈ మధ్యలో రవి పనిచేస్తున్న బ్యాంకు లో కొత్తగా ఒకావిడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. ఆమె పది రోజుల్లో మొత్తం ఆఫీస్ వాళ్ళ బయో డేటా గురించి పూర్తిగా తెలుసుకుంది. అక్కడ పనిచేసే వాళ్ళలో రవి చాలా బుద్ధిమంతుడు అని తెలుసుకుంది. నెమ్మదిగా ఆమె రవికి దగ్గర అవడానికి ప్రయత్నించసాగింది. ఒంటరి తనం, ప్రేమ రాహిత్యం ఉన్నా కూడా రవిని తన దారి లోకి తెచ్చుకోవడానికి ఆవిడకు ఒక సంవత్సరం పట్టింది. స్లో పాయిజన్ లాగ అతనిని పూర్తిగా ఆమె వైపు తిప్పుకుంది. రవి మళ్ళీ ప్రేమలో పడ్డాడు. కానీ ఆ ప్రేమ సక్రమమైనది కాదు కదా! ఆమె రవిని ఆట బొమ్మను చేసుకున్నది.ఆ ప్రేమ మూడు నెలల తరువాత పతనం వైపు మళ్ళింది. ఆమె మొదట్లో రవి మీద చూపిన ప్రేమ రాను రాను తగ్గిపోయింది. భోజనం చేసే సమయంలో ఆమె ఫోన్ చేసి భోజనం చేసావా అని అడిగేది. రవి ఇంకా చెయ్యలేదు అంటే నువ్వు తింటేనే నేను తింటాను లేకపోతే తినను అన్న మనిషి అన్న మనిషి మూడు నెలల తరువాత రవి తనకు తానుగా ఆమెకు ఫోన్ చేసి తిన్నావా లేదా అని అడిగేలా చేసుకుంది. ఒక వేళ రవి నేను ఇంకా తినలేదు అంటే.... నువ్వు తింటే తిను లేదా మానేయి.నాకు ఆకలి వేస్తుంది. నువ్వు ముందు ఫోన్ పెట్టేయ్యి అనేది. ఈ ద్వంద ప్రవృత్తిని సున్నితమైన రవి మనస్సు భరించలేక పోయింది. రవి మానసికంగా దెబ్బ తిన్నాడు. డిప్రెషన్ తో బ్యాంకు కు సరిగ్గా రాక నోటీస్ అందుకున్నాడు. అటువంటి రోజులలో ఒకానొక రోజు అతను చేసినటువంటి పెద్ద బ్లండర్ కారణంగా బ్యాంకులో పెద్ద ట్రాన్స్ యాక్షన్ రివర్స్ అయింది.అలా ఆవిడ కారణంగా రవి తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు.ఇదంతా తెలుసుకున్న శశి అతనికి డివోర్స్ నోటీస్ పంపింది. అలా భార్యకు, పిల్లలకు దూరం అయ్యాడు. పూర్తిగా మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యాడు. అనుకోకుండా ఒక రోజు రవిని చూడడానికి బ్యాంకు కు వెళ్లిన తన అన్న కిరణ్ కు జరిగిన విషయం పూర్తిగా తెలిసి రవి ఇంటికి వెళ్లి అతని పరిస్థితి చూసి వెంటనే హాస్పిటల్ లో చేర్పించాడు. అలా ఇద్దరు ఆడవాళ్ళ ప్రేమ నాటకానికి ఆ విధంగా రవి జీవితం బలైపోయింది.

మరిన్ని కథలు

Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao
Aakali
ఆకలి
- అరవ విస్సు
Alludigari alaka panpu
అల్లుడుగారి అలక పాన్పు
- మోహనరావు మంత్రిప్రగడ
Nruga maharaju
నృగ మహరాజు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Maa nava bandhalu
మా నవ బంధాలు
- బామా శ్రీ (బాలాజీ మామిడిశెట్టి)
Cycle nerchukovadam
సైకిల్ నేర్చుకోవడం
- మద్దూరి నరసింహమూర్తి