జీవించు - B.Rajyalakshmi

Jeevinchu

రవి చేయిపట్టుకుని కొత్తపెళ్లి కూతురుగా అత్తవారింట అడుగు పెట్టింది ఉష .కోడలికి దిష్టి తీయించారు అత్తగారు సుశీలమ్మ .అత్తగారి పాదాలకు నమస్కరించింది ,ఎదురుగా గోడమీద వున్న మామగారి ఫొటోకు నమస్కరించింది ఉష .పూజగదిలో దేవుడికి ఉష చేత దీపం పెట్టించారు సుశీలమ్మ .ఉష యిల్లంతా పరిశీలనగా చూసింది .మూడు గదులు హాలు ,బయట వరండా ,వెనకాల కూరల పాదులు ,పూలమొక్కలు వంటిల్లు చక్కగా అమరికగా వుంది .అత్తయ్యగారి తత్త్వం కొద్దిగా అర్ధమయ్యింది ఉషకు.ప్రతి గది పొందికగా వుంది .రమ ,ఉమ సుమారు పన్నెండేళ్ల వయసు యిద్దరూ ఉషని చూస్తున్నారు .ఉష నవ్వుతూ వాళ్లను దగ్గరగా పిలిచి ముద్దు పెట్టుకుంది .అది చూసిన సుశీలమ్మ ఆనందం గా వూపిరిపీల్చుకున్నారు.

ఉష అత్తయ్య సుశీల చూపించిన గదిలో తన సామానంతా సర్దుకుంది .ఇంతలో రవి నవ్వుతూ “మరి నన్ను నీ గదిలోకి రానిస్తావా “అంటూ ప్రేమగా ఉష కళ్లలోకి చూసాడు .”ఇది మనగది మీ సామాను కూడా సర్దేసాను “అన్నది ఉష .ఈరోజు నుండి యిదంతా తనకుటుంబం వీళ్లంతా తన వాళ్లు .తన వర్తమానం ,భవిష్యత్తు అంతా అంతా భర్త ,ఆడబిడ్డలు తన అత్తయ్య అనుకుంటూ ఉష తెలియని తన్మయం తో చెమర్చిన కళ్లను తుడుచుకుంది .

ఉష కోడలిగా యిల్లాలిగా ఆ కాదు తన యింటి బాధ్యతలను స్వీకరించింది ..బంధాలను ,బంధువుల్ని ఆప్యాయం ఆహ్వానించింది .రవి తన జీతం తల్లికి యివ్వబోతే ఆవిడ ఉష కు యివ్వమని చెప్పారు .రవి తన అవసరాలకు మాత్రం వుంచుకుని మిగిలినదంతా ఉష చేతిలో పెట్టాడు .ఉష కు ఆర్ధికం గా ప్లాన్ వేసుకుని పొదుపుగా అందరికీ ఆమోదం గా నడపడం అలవాటయ్యింది .కాలచక్ర వేగం లో ఉష కు యిద్దరు బిడ్డలు కొడుకు విష్ణు కూతురు గౌరి పుట్టారు .బళ్లకు వెళ్తున్నారు .అత్తగారు సుశీలమ్మ కు ఓపిక తగ్గింది .అయినా మనవరాలికి తల దువ్వడం ,కూరలు తరిగివ్వడం ఆలా చిన్న చిన్న సహాయాలు చేస్తుండేవారు .

కొడుకు విష్ణు ఐదో క్లాసు ,కూతురు గౌరి రెండో క్లాసు చదువుతున్నారు .ఇద్దరు ఆడబిడ్డల పెళ్లిళ్లు జరిగాయి .పురుళ్లు షరా మామూలేగా .చల్లటి అందమైన ఆ సంసారం లో
పెను తుఫాను రవి ఆకస్మిక మరణం ! అతని వుద్యోగం ఉష కు యిచ్చారు . అన్ని బాధ్యతలూ ఉష ఓపికగా స్వీకరించింది .తెల్లవారు ఝామున నిద్ర లేస్తే రాత్రి పదిగంటల దాకా ఉష గడియారం ముళ్ల లాగా తిరుగుతూ పని చేసుకుంటున్నది .పుల్లల చదువు కూడా చెక్ చేస్తుంటుంది .

కొడుకు విష్ణు ఇంజనీరింగ్ చదువు అయిపొయింది .కూతురు గౌరి డిగ్రీ ఫైనల్ కు వచ్చింది .సుశీలమ్మ చనిపోయారు .విరామమెరుగని ఉష దైనందిన జీవితం లో కొద్దిగా వెసులుబాటు వచ్చింది .ఉష కు బంధువుల వైపునుంచి గౌరికి పెళ్లిసంబంధం వచ్చింది .సుందరం ఢిల్లీ లో పేరున్న కంపెనీ లో పనిచేస్తున్నాడు .రెండుకుటుంబాలు సామరస్యం గా పెళ్లిజరిపించారు .అత్తవారింటికి వెళ్తున్న గౌరిని కన్నీళ్లతో కౌగలించుకుని దీవించి పంపింది ఉష .తన యింటి దీపం మరో యింటిదీపం గా వెళ్తున్నది .విష్ణు అమ్మ భుజం మీద చెయ్యేసి లోపలికి తీసుకెళ్లాడు .విష్ణు కు వుద్యోగం వచ్చింది .US లో కాంట్రాక్టు వుద్యోగం .ఉష కొడుకు తో పెళ్లి ప్రస్తావన తెచ్చింది .

“అమ్మా నేను నా ఇంజనీరింగ్ క్లాసుమేట్ గీతను యిష్టపడ్డాను చెల్లాయి పెళ్లి అయ్యాక చెప్పాలి అనుకున్నాను .గీత ప్రాజెక్ట్ పనిమీద అమెరికా వెళ్లింది “అన్నాడు విష్ణు .ఉష నవ్వేసింది .

గీత వచ్చాక రెండుకుటుంబాల మాటామంతీ వారిద్దరి పెళ్లిజరిగింది.విష్ణు ,గీత అమెరికా వెళ్లిపోయారు .ఉష ఒంటరిగా మిగిలింది .భార్యగా ,కోడలిగా ,ఇల్లాలిగా ,వియ్యపురాలిగా తన బాధ్యతలను నెరవేర్చింది .

బయట కార్ హారన్ శబ్దానికి వులిక్కిపడుతూ ఉష తన గతం తెరను కప్పేసింది .

“ఉషా యేమిటిలాగే కూర్చున్నావు ?పద పద పార్క్ లో సాయంకాలం మన get together ! మర్చిపోయావాలా “అంటూ లోపలికి వచ్చిన సంధ్యను చూస్తూ ‘అవును కదూ యిప్పుడు యిది తన తన స్వయం క్షణాలు !తన తనకోసమే యీ జీవిత మధురిమలు ‘ అనుకుంది ఉష .

మనందరికీ భగవంతుడిచ్చిన ఒక జీవితం ,మనం జీవితాన్ని యెవరిని బాధ పెట్టకుండా మనకు నచ్చినట్టుగా అనుభవిద్దాం .

మరిన్ని కథలు

Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao
Aakali
ఆకలి
- అరవ విస్సు
Alludigari alaka panpu
అల్లుడుగారి అలక పాన్పు
- మోహనరావు మంత్రిప్రగడ
Nruga maharaju
నృగ మహరాజు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Maa nava bandhalu
మా నవ బంధాలు
- బామా శ్రీ (బాలాజీ మామిడిశెట్టి)
Cycle nerchukovadam
సైకిల్ నేర్చుకోవడం
- మద్దూరి నరసింహమూర్తి