పరిధి - ప్రభావతి పూసపాటి

paridhi

"మీ పరిధిలో మీరు వుంటె మంచిది.ఎవరెంతలో ఉండాలో ఎవరికి వారే తెలుసుకోవాలి .ఏళ్ళు వస్తే సరిపోదు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకొని మసిలితె మంచిది .పద టీంకు స్నానం చేసి అన్నం తిందువుగాని అంటూ నా కాళ్ళ దగ్గర కూర్చుని నా కొంగుతో ఆడుకొంటున్న మనవడిని విసురుగా లాక్కుని వెళుతూ కాంతం గారికి వినపడాలని కాస్త గొంతు పెద్దది చేసి మరి చెపు తోంది కోడలు సంధ్య .

" ఏమిటి కాంతం మళ్ళీ ఏమైంది ?కోడలు ఆలా మాట్లాడుతోంది "బయట వరండా లో కూర్చుని పేపర్ చదువుతున్న పరంధామయ్యగారు కంగారుగా లోపలికి వచ్చారు .

" ఆ ! కొత్తగా ఏమి లేదులెండి. వడ్ల గింజలో బియ్యపుగింజ అన్నట్టు... రోజు వుండే బాగోతమే..మనవడికి ఆకలి వేస్తోంది అంటె నాలుగు పకోడీ వేసి పెట్టాను అదేదో పెద్ద తప్పిదం అన్నట్టు అలా నూనె సరుకు పెట్టడం ఏమిటి అంటూ రాద్దాతం చేస్తోంది అంతేలెండి" కోడలు ఆలా మాట్లాడటం కొత్త విషయం కాదన్నట్టు కొప్పు

ముడివేసుకొంటూ కొంగు దులిపి బొడ్లో దోపుకొంటూ రాత్రికి వంట ఏమి చెయ్యాలో అనుకొంటూ లేచి వంటింట్లోకి వెళ్ళింది .

భార్య ని ఆలా చూసి చివుక్కుమంది పరంధామయ్యగారి మనసు.ఎన్నడూ ఎవరితోనూ ఒక్క మాట అనిపించుకుని భార్య ప్రతిసారి చేస్తున్న ప్రతి చిన్న

పనిలోనూ కోడలు కించపరుస్తున్నట్టుగా మాట్లాడటం ఆయనికి సుతరామూ నచ్చటం లేదు

మాటలుపడుతూ ఇక్కడ ఇలా ఎందుకు ఉండటం మన వూరికి వెళ్లిపోదాము అంటె

పిల్లలమీద ప్రేమ వదులుకోలేక సర్దుకుపోతూ ఉంటుంది.

అసలు దీనికి అంతటికి కారణం మా ఏకైక సుపుత్రుడు సుధీర్ .వుద్యోగం లో స్థిరపడ్డాకే పెళ్లి అని భీష్మించుకుని కూర్చుని దాదాపు 36 ఏళ్ళు వచ్చాకగాని పెళ్లి చేసుకోలేదు తీరా పెళ్లి అయ్యి సంధ్య కాపురానికి వచ్చి నప్పటినుంచి పెళ్ళాం అంటె బెల్లము తల్లి అంటె అల్లము అనే చందంగా తయారైంది వాళ్ళ ధోరణి .సరేలే కొత్తగా పెళ్లి అయ్యిది కదా అని మేమె ప్రతి దాన్లో సర్దుకుపోవటం మొదలు పెట్టాము,సంధ్యని కూతురికన్నా మిన్నగా చూసేవాళ్ళము .అప్పుడు ప్రతి పని మెమే చేసే వాళ్ళము అప్పుడు అనిపించని పరిధి మరి కొత్తగా ఎప్పుడు వాళ్ళకి అనిపించటం మొదలైందో గమనించే లోపు అతి కష్టం మీద కృత్త్రిమ పద్దతిలో సంధ్య నెల తప్పింది .అప్పటి నుంచి దాదాపు కాంతం వంటింటికే పరిమితం అయిపోయింది .అన్ని సౌకర్యాలు ఇక్కడ బాగున్నాయి పురిటి కూడా పుట్టింటికి వెళ్ళను అని సంధ్య తల్లితండ్రుల్ని ఇక్కడికే రప్పించింది.వాళ్ళు పది రోజులు వుండి స్నానం అయ్యాక తమ భాద్యత అయిపోయింది అన్నట్టు వెళ్లిపోయారు.అటు చంటి పిల్లాడి పని ఇటు బాలింత పని తో పాపం కాంతం నలిబిలి అయిపోయేది .ఐన నోరు తెరిచి ఎన్నడూ ఒక్క మాట పరుషంగా అనేదికాదు.

కొడుకు కోడలు తమ వుద్యోగం నిమిత్తం సిటీ లోనే సిరపడ్డారు .నా రిటైర్మెంట్ తర్వాత సిటీ కి దూరంగా వున్న తాతముత్తాతల వూర్లో వాళ్ళు మిగిల్చిన పెద్ద ఇంట్లో వుందామంటె తమకి కొంత సహాయం కావాలి అంటూ బలవంతంగా ఇక్కడికి రప్పించాడు .కాంతం ప్రతి పనిని తనదే భాద్యత అన్నట్టు,పిల్లల ప్రేమ ముందు మిగిలినవి ఏమి సరితూగవన్నట్టు అన్ని తానే అయ్యి ఇన్నాళ్లు వాళ్ళ ఆలనాపాలనాలతో కాలం గడిపింది.పగలంతా ఇంటిపని వంట పనితో సరిపోయేది మిగిలిన కాస్త టైం చంటి పిల్లాడి ముద్దుముచ్చట్లతో ఇన్నాళ్లు కష్టం అనుకోకుండా గడిపేశారు.ఎన్నడూ కాంతం ఎలా చేయగలుగుతుంది ఇంత పని అన్న ఆలోచనే కొడుకుకి,కోడలికి రాలేదు.

ఇప్పుడు ఎందుకో సంధ్యకి ఇక్కడ కాంతం తన బిడ్డని తన నుంచి దూరం చెయ్యటానికి దాపురించినదానిలా అనిపించి నట్టు వుంది అందుకని వెళ్లిపొమ్మని చెప్పలేక చీటికి మాటికీ అవమానిస్తూ నోటికి వచ్చిందల్లా అనేస్తోంది.కొడుకు గమనించినా

మేము ఇక్కడ సపోర్ట్ గ ఉండకపోతె కుదరదు కాబట్టి చూసీచూడనట్టు

ఉంటున్నాడు.

"ఏంటి నాన్న చీకట్లో ఏమి చేస్తున్నారు ?"హెల్మెట్ తీసి ఆఫీస్ నుంచి

లోనికి వస్తూ అడిగాడు ."ఏమి లేదురా ఊరి మీదకి గాలి మళ్లింది .సంక్రాతి వస్తోంది కదా ఇంటికి వెళదామనుకొంటున్నాను లోపల వున్న సంధ్య కి కూడా వినపడేలాగట్టిగానే చెప్పారు ."అదేంటి నాన్న సడెన్గా ..టీంకు డేకేర్ చేరాక వెళదామనుకొన్నారు ..ఇంతలో ఏమైంది ?"కొంచెం ఆత్రంగానే అడిగాడు మా మాటలు విని బయటికి వచ్చిన సంధ్యని కళ్ళతో ఏమైంది అని ప్రశ్నిస్తూ.

ఏమిటిది మావయ్య ..అయన ఇప్పుడే వచ్చారు కదా కొంచెం స్థిమిత పడ్డాక చెప్పవచ్చు కదా ...మీ ధోరణి మీదేగాని మా గురించి ఆలోచించరా.మీకు అన్నిటికి తొందరే చిన్నపిల్లాడిని కసురుకునట్టు మొహం చిట్లించి చెప్పింది.

" ఏమిటా మాటలు సంధ్య ?అయన ఇప్పుడు ఏమన్నారని ?"చేతులు తుడుచుకొంటూ హాల్లో మాటలు విని వంటింటి నుంచి వచ్చి విస్తుపోతూ అడిగింది కాంతం.

" నా మాటలికి ఏమి గాని, మీ చేతలే ఇలా పలికిస్తున్నాయి అత్తయ్య ...కొన్ని రోజులుగా మీ ప్రవర్తన నేను గమనిస్తూనే వున్నాను కదా ..అంతా మీ ఇష్ట ప్రకారమే చేస్తున్నారు ఇది మీ కొడుకు ఇల్లు ఇక్కడ మా మనసు ప్రకారం మీరు ఉండాలిఅని మరచిపోయారు, టీంకు మీద సర్వాధికారాలు మీవే అన్నట్టు వున్నారు,వంటింటి పెత్తనమంతా తీసేసుకున్నారు, మీ అబ్బాయి తో నాకు దొరికేదే అతి కొద్దీ సమయం అందులోను మీ పోసుకోలు మాటలతో మాకు టైం దొరకడం లేదు , ఇంక మీరు వెళితె మా సంసారం మేము చూసుకోగలము అన్నంత ధీమా కలిగిన దానిలా పైకి ఆ ఒక్క మాట అనలేదుకాని టేబుల్ మీద వున్న టిఫిన్ బాక్స్ తీసుకొని విసురుగా లోపలి కి వెళ్ళిపోయింది.

కొంచెం సేపు అక్కడ మౌనం రాజ్యం ఏలింది.ఆలా మాట్లాడుతుంది సంధ్య అని ఎవ్వరం ఊహించలేదు.ఒక్కసారి గుండెల్లో దడ పుట్టింది .".అమ్మ! సంధ్య మాటలు పట్టించుకోకు, నేను మాట్లాడతాను" ముందుగా తేరుకున్న కొడుకు కాంతం భుజాల చుట్టూ చెయ్యి వేసి నడిపిస్తూ పక్కనే వున్న సోఫా లో కుర్చోపెట్టాడు.

"సంధ్య అన్నదాన్లోతప్పేమి ఉందిరా ..అవసరం తీరాక ప్రతివాడు అనవలసిన మాటలే కదా అవి.మా అవసరం వున్నప్పుడు రాలేమురా ఈ వయసులో అంటె తల్లితండ్రులుగా ఆ మాత్రం సహాయం చేయలేరా అని తీసుకు వచ్చింది మీరే.ఇక్కడికి వచ్చాక ఇంట బయట మేము అన్ని సమర్ధించి చెస్తుంటె హాయిగా అన్ని సమయానికి అమరుతున్నాయికదా అని సంతోషపడింది మీరే,కాలు కింద పెట్టనివ్వకుండా కోడలైన కూతురైన మనపిల్లయే కదా అని అనుకోని చేసిన నాడు దర్జాగా కూర్చుని అనుభవించింది మీరే,కన్నది కోడలైన నువ్వు పుట్టినప్పుడు ఎంత తాపత్రయ పడిందో మనవడికి కూడా అంతసపర్యలు చేస్తున్నప్పుడు మీకు కొంత విశ్రాంతి దొరుకుతోంది కదా అని సంబర పడింది కూడా మీరే ....కానీ ఇప్పుడు మీకు ఇది మీ ఇల్లని .మీ సంసారమని గుర్తుకు వచ్చి మేము పరాయి వాళ్ళల్లా కనపడుతున్నాము .పని చెయ్యాలి గాని మిమ్మలిని అడిగి మీకు కావలసినంత మాత్రమే,అది మీకునచ్చినట్టు చెయ్యాలి.పిల్లాడిని లాలించవచ్చు కానీ అది కూడా మీకు ఇబ్బంది కలగనంత వరకే,మిమ్మలిని ప్రేమించవచ్చుకాని అది తూకం వేసి మీకు నచ్చినంతవరకే... శెభాష్ భలే తెలివైన వ్యవహారం రా మీది .

" అది కాదు నాన్న.. పరంధామయ్య మాటలికి అడ్డ్డువస్తు చెప్పబోయాడు

" లేదురా అబ్బాయి! మేము మీలా అంత తెలివైన వాళ్ళము కాము ఏదయినా మనది అనుకోని మనస్ఫూర్తిగా చెయ్యగలం,నిన్ను కన్నప్పటినుంచి ఇప్పటి వరకు నీకు ఎటువంటి సహాయము కొరత కలగకుండా ప్రేమతో చూసుకోవాలన్నదే మా తపన.అందుకని వున్నత పదవిలో రిటైర్ అయ్యి పదిమంది పనివాళ్లని పెట్టుకొని విలాసవంతంగా జీవించగలమని నీకు తెలుసు,తాతగారి ఆస్తి తో బ్రహ్మాండమైన భవంతి వూర్లో ఉందని కూడా నీకు తెలుసు రోజు పదిమంది ఇంటికి వచ్చి అమ్మతో నాతొ సలహా సంప్రదింపులు జరుపుతారని నీకు తెలుసు,కానీ నీకు కోడలికి తెలియనిది మీ మీద మాకు వున్న స్వార్ధం లేని మలినం లేని స్వచ్ఛమైన ప్రేమ. అది ఒక్కటె.దానికి కూడా పరిధులు గీస్తున్నారు. ప్రేమ కి పరిధుల ఉండవని గుర్తించలేక పోయారు కాబట్టే ఈ రోజు కోడలు అంత తేలికగా మాట్లాడగలిగింది .

" పద కాంతం రేపే మన వూరు వెళ్లిపోదాము" ఆని లేస్తున్న పరంధామయ్యగారి కాళ్ళు పట్టుకొని "క్షమించండి నాన్న తప్పు చేసాము మీరు అమ్మ చూపిస్తున్న ప్రేమని గుర్తించలేకపోయాము.. గొంతు మూగ పోవడం తో మాట్లాడలేక తండ్రి పాదాల మీద పడిపోయాడు .

ఇంకా ప్రేమ కి, మానవతకు, స్వచ్ఛమైన సేవ కి పరిధులు చూడని మంచి మనుష్యుల మధ్య మా ఇద్దరి జీవితాలు కడతేరాలని నా ఆశ నాన్న" అంటూ కొడుకుని లేవదీసి" మా వూరు పిలుస్తోంది రా అబ్బాయి , కోడలితో రేపు వెళ్ళిపోతున్నామని,మా పరిధి ఏమిటో మాకు తెలిసి వచ్చింది" అని చెప్పు అంటూ కళ్ళు తుడుచుకొంటూ కాంతం గారిని తీసుకొని వడివడిగా గది వైపు అడుగులు వేశారు

మరిన్ని కథలు

Katha cheppavoo...
కథ చెప్పవూ...
- చిట్టత్తూరు మునిగోపాల్
AI teerpu - TV pitalatakam
Ai తీర్పు - TV పితలాటకం
- హేమావతి బొబ్బు
Suneetamma Vodaledu
సూనితమ్మ ఓడ లేదు?
- హేమావతి బొబ్బు
Chesukunna punyam voorake podu
చేసుకున్న పుణ్యం ఊరకే పోదు
- పూసాల సత్యనారాయణ
Benarus Baamma
బెనారస్ బామ్మ
- కొడవంటి ఉషా కుమారి
Sanmanam
సన్మానం
- తాతా కామేశ్వరి
Mattilo manikyam
మట్టిలో మాణిక్యం
- కందర్ప మూర్తి