వేగుచుక్క రావడంతో ఆహరం వెదుకుతూ బయలుదేరిన కుందేలు కనిపించిన పుట్టగొడుగును నములుతూ కోతి నివాసమైన చెట్టుబవద్దకు వెళ్ళాడు. కుందేలును చూసిన కోతి " రామామ నాకోసందేహం కేవలం ఆకుకూరలు, క్యారెట్ ,బీట్ రూట్ ,ముల్లంగి వంటి దుంపలు తింటూ నువ్వు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నావు "అన్నాడు.
" అల్లుడు ప్రకృతి ఎంతో గొప్పది కేవలం చెట్ల పైన జీవించే ప్రాణులకు పలురకాల పండ్లు లభించేలాచేస్తుంది,మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎనిమిది గంటల నిద్ర,గంటసేపు వ్యాయామం లేదా నడక, పౌష్టిక ఆహరం,తగినంత పరిశుభ్రమైన నీరు తీసుకోవాలి " అన్నాడు కుందేలు .
ఇంతలో రివ్వున వచ్చిన రామచిలుక " ఏమిటి మీరు రావడంలేదా ,మన అడవిలోని జంతువులు అన్ని నీటిని వెదకుతూ బయలు దేరాయి " అని వెళ్ళిపోయింది. కుందేలు,కోతి కూడా అడవి జంతువుల సమూహంగా చేస్తున్న ప్రయాణంలో కలుసుకున్నాయి.
భువనగిరి అడవిలో నీటిజాడలు కనుమరుగు కావడంతో నీటిని వెదుకుతూ అడవిజంతువులన్ని ఎగువ అడవిలో నీటి జాడలు వెదుకుతూ పయనించసాగాయి.
" నేను నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నన మావారికి ఇక్కడనుండి సందేశం పంపగలను అలాగే దాదాపు ఇరవై కిలోమీటర్ల పరీధిలోని నీటి జాడలు పసిగట్టగలను మనకు చేరువలోనే నీటి జాడలు ఉన్నాయి ,ఎండ చాలా ఎక్కువగాఉంది ఆమర్రి చెట్టు నీడన కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని అనంతరం ప్రయాణం చేద్దాం "అన్నాడు ఏనుగు తాత.
జంతువులన్ని పెద్ద మర్రి చెట్టుకింద చేరాయి.
పెద్ద గొంతుకతో ఓండ్ర పెట్టిన గాడిద " అందరికి నామనవి నేను సిరిపురంలో ఒకరైతు వద్ద పనిచేస్తున్నప్పుడు నాకుచాలా విషయాలుమనుషులద్వారా తెలుసుకున్నాను,ఇప్పుడు నేను అక్కడ తెలుసుకున్న కథ ఒకటి చెపుతాను వినండి... గుంటూరు పట్టణంలో రంగనాధ్ ,మురళి, జివితేష్ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు ,ఒకసారి తన పనిచేస్తున్న కంపెనీవారు జివితేష్ ను సంవత్సరం కాలం శిక్షణకు పంపించారు. శిక్షణముగించుకుని వచ్చిన జివితేష్ రంగనాధ్ ను కలసి మురళి కనిపించడంలేదు ఎక్కడా అన్నాడు.
తమకు ఎదురుగా ఉన్న చెట్టుపైకి చూపించిన రంగనాధ్ " మురళికి హఠాత్తుగా గుండె ఆపరేషన్ చేయవలసి వచ్చింది ఆసమయంలో మనిషి గుండె లభించకపోవడంతో తప్పని పరిస్ధితులలో ప్రాణంకాపాడటానికి మేక గుండె వేసారు తరువాత మనిషి గుండె లభించాక మరలా మారుస్తారట అప్పటినుండివీడు ఆకలి వేసినప్పుడల్లా అలా చెట్టు ఎక్కీ నోటితో ఆకులు తుంచుకు నములుతున్నాడు "అన్నాడు.
" ఎంతఆపద తప్పింది సమయానికి మేకగుండె కాకుండా పందిగుండె దొరికితే దాన్ని మన వాడీకి వేసుంటే ..." అన్నాడు జివితేష్ .
గాడిద కథ విన్న జంతువులన్ని ఫక్కున నవ్విన జంతువులన్ని నీటిని వెదుకుతూ ముందుకు కదిలాయి.

