భువనగిరి రాజ్యంలో అడవిని పరిరక్షించాలని తలచిన రాజు ఆబాధ్యతను తన మంత్రికి అప్పగించాడు. ఆపదవికి పోటీకి వచ్చినవారందరిని సమావేశపరచిన మంత్రి ' నాయనలారా నేను రెండు ప్రశ్నలు అడుగుతాను వాటికి సరైన సమాధానం చెప్పినవారికే ఈపదవి. మొదటి ప్రశ్న వేళ్ళు లేకుండా గోళ్ళు ఉన్న ప్రాణి ఏది? రెండో ప్రశ్న ఒకచెట్టు వలన మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ? 'అన్నాడు.
అక్కడ ఉన్నవారిలో ఒక యువకుడు మంత్రికి నమస్కరిస్తూ ... " అయ్యా నాపేరు సుదరం ,వేళ్ళు లేకుండా గోళ్ళు ఉండే ప్రాణి ఏనుగు. రెండో ప్రశ్నకు సమాధానం పూర్తిగా ఎదిగిన చెట్టు ప్రత్యక్షంగాకాని పరోక్షంగాకాని మనకు ఎంతో మేలు చేస్తుంది. ఒకచెట్టు విభిన్నజాతులకు చెందిన పక్షులకు ,కీటకాలు, సరీసృపాలు,పరాన్నజీవులు,క్షీరదాలు తదితరాదులకు జీవనాధారంగా నిలుస్తుంది.ఒకచెట్టు తన55ఏళ్ళజీవితకాలంలో ప్రాణ వాయువును ఇస్తుంది చెట్లుపెంచడంద్వారా పండ్లు,కూరగాయలు, తేనె,గింజలు, ఓౌషదాలు,లక్క,జిగురు,కుంకుళ్ళు వంటి వాటిని మనంపొందవచ్చు. సకాలంలో వర్షలు పడటానికి చెట్లు ఎంతో వినియోగపడతాయి .అలాసరైన సమయంలో వర్షలుపడితే పంటలు బాగాపండి ప్రజలు అందరు సుఖంగా ఉంటారు.పల్లెల్లో పాడి పంటలు బాగుంటే పల్లెప్రజలు పట్నాలకు వలసపోరు.యిలా ఎన్నో లాభాలు చెట్లుపెంచడంవలన ఉన్నాయి.మనిషి ఆర్ధికతను ఓవిధంగాచెట్లే నిర్ణయిస్తాయి. సుడిగాలి మొదలు సునామిల వరకు వచ్చే ఆపదలను నివారించేశక్తి చెట్లకు మాత్రమే ఉంది.రేపటి తరం భావిపౌరులుగా రాబోఏ ప్రమాదాన్ని నివారించే శక్తి మీచేతుల్లోఉంది.చక్కటి ఆరోగ్యకరమైన అహ్లదకర వాతావరణం ప్రకృతి మనకు ప్రసాదించింది.దాన్నికాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది ' అన్నాడు సుందరం. "సముచితమైన సమాధానాలు ఈపదవినీకే లభిస్తుంది నీకు కావలసిన సిబ్బంది ఏర్పాటు చేస్తాను " అన్నడు మంత్రి. సభలోనివారంతా కరతాళధ్వనులు చేసారు.

