భువనగిరి జిల్లాలో అధికమార్కులతో అందరూ ఉత్తిర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరిని అభినందించడానికి వచ్చిన జిల్లా కలక్టర్ గారు '' బాలలు ముందుజీవితంలో మీఅందరికి వినియోగపడే విషయాలు కొన్ని మీకు చెపుతాను. మన నేర్చుకునే సమయంలో అది ఏదైనా విద్య, నైపుణ్యంతో ప్రదర్శిస్తే అదికళ అవుతుంది.మీలో ఎవరైనా మరొకరి కాళ్ళపై ఎంతసేపు నిలబడగలరు ?''
''మరోకరి కాళ్ళపై మనం నిలబడటం అసంభవం,మనకాళ్ళపైనే మనం నిలబడాలి 'అన్నాడు పదవతరగతి చదువుతున్న జివితేష్ అనే విద్యార్ధి. " నిజమేకదా ! మనజీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు మనమే అనుభవించాలి .చేరువలోని పాపను దగ్గరకు పిలిచి '' ఇప్పుడు నీవయసు ఎంత ?'' అన్నాడు కలక్టర్ గారు.'పన్నెండేళ్ళు 'అన్నది ఆపాప. '' ఇప్పుడునువ్వు పదేళ్ళ వయసులోనికి వెళ్ళగలవా? ''అన్నాడు కలక్టర్ గారు. '' అయ్యగారు గడచినకాలం తిరిగిరాదుగా !'' అన్నది ఆపాప" గతించిన కాలం మనం తిరిగి పొందలేం. అంటే మన సమయం ఎంతో విలువైనది. చెడిన ఆరోగ్యం బాగు చేసుకోవచ్చు, చేజారిన ధనం తిరిగి సంపాదించవచ్చు కానీ గడచిన కాలాన్ని, గతించిన తల్లి తండ్రిని ఎంత ధనం పోసినా, ఎంత సమయం కేటాయించానా తిరిగి వాళ్ళు రారు.కనుక వాళ్ళు మనతో ఉన్న సమయంలోనే పెద్దవాళ్ళ పట్ల గౌరవంగా, చిన్నవారి పట్ల ఆరణతో ప్రేమగా ఉండాలి.సమయం విలువ తెలుసుకుని మసలుకోవాలి అని ఈపాప చక్కగా తెలియజేసింది. మనకు జన్మనిచ్చిన తల్లి తండ్రి మనం జీవించినంతకాలం మనతో ఉండరు.కాని వాళ్ళు ఇచ్చిన మనశరీరం మాత్రం మన చివరిదాక మనతోనే ఉంటుది. విద్యనేర్పిన గురువుకూడా అంతే , నువ్వు విద్యావంతుడవుకావడంతో నేర్చిన విద్య ద్వారా గొప్పగా జీవించమని ఆశీర్వదించి పంపిస్తాడు. అసలు కష్టాలు అనేవి ఎవరికైనా ఎందుకు వస్తాయో తెలుసా? మన మానసిక ధైర్యాన్ని పరిక్షించడానికి. రోజు మనతో ఉండే కష్టాలను కాదని ఎప్పుడో వచ్చే సుఖంకోసం ఎదురు చూడటం అవివేకం.యవ్వన దశలో కష్టించి సంపాదించి దాచుకోవాలి,ఆడంబరాలకు పోకుండా,తమ అవసరాలకు పొదుపుగా వాడుకోవాలి. నేడు మనం చేసిన పొదుపే ముందు కాలంలో అంటే వృధాప్యంలో మదుపు అవుతుంది. ఎవరికైనా జీవితం జీవించడానికే, భయంతోనో, మరోకారణం తోనో చనిపోవడం పిరికి చర్య అవుతుంది. సమస్య ఏదైనా,చూడ్డానికి కొండలా కనిపిస్తుంది, ధైర్యంగా సమస్యను ఎదుర్కొంటే మేఘంలా విడిపోతుంది. బాలలు భయమే మన మొదటి శత్రువని గుర్తుంచుకొండి .కోపమే అన్నింటికి మూలం అని ఎన్నడూ మరుకండి. మీసాటివారితో సఖ్యతగా జీవించండి. మీరు నాలాగా ఉన్నత పదవులు పొందాలంటే విద్యతోనే సాధ్యమౌతుంది. వేైయి మంది సూర్యులు,వందమంది చంద్రులు ఒక్కసారిగా వెలుగునిచ్చినా మనిషిలోని అజ్ఞానం తొలగిపోదు మనిషి జ్ఞాన వంతుడు కావడానికి ఏకైకమార్గం విద్యను అభ్యసించడమే. ఇదే నేను మీకు ఇచ్చే సలహమన రాష్ట్రంలోనే ఉత్తమ పాఠశాలగా పేరు రావడం అభినందనీయం. ఇంతగొప్పగా చదువుతున్న మీఅందరికి,మీఅందరిని ఉత్తమ విద్యార్దిని, విద్యాయులుగా తీర్చిదిద్దిన మీ ఉపాధ్యయులను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను ''అన్నాడు కలక్టర్ గారు.
పాఠశాలలోని పిల్లలతోపాటు,అక్కడ ఉన్న పెద్దలుకూడా కరతాళధ్వనులు చేసారు.

